మామ్ ఏడాది పయనంలో మరచిపోలేని చిత్రాలెన్నో..

|

అంతరిక్ష పరిశోధన రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన మంగళ్‌యాన్ ప్రయోగానికి గురువారంతో ఏడాది పూర్తయింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో శాస్త్రవేత్తలు ఘనంగా సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మార్స్ అట్లాస్‌ను ఇస్రో విడుదల చేసింది. విశ్వవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలిపిన మామ్ ఏడాది పూర్తయిన నేపథ్యంలో మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) ద్వారా తీసిన 100 చిత్రాల సంకలనాన్ని ఫిషింగ్ హ్యామ్లెట్ టు మార్స్ అనే పేరుతో నవంబర్ 5న జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. భరతావని ముద్దు బిడ్డ.. మామ్ ఏడాది కాలం గమనంపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: శాస్ర్తవేత్తలకే షాక్ ఇస్తున్న మామ్ ఫోటోలు

అద్భుతమైన ఫోటోలను తీసి భూమికి

అద్భుతమైన ఫోటోలను తీసి భూమికి

అంతరిక్షం నుంచి కొన్ని అరుదైన చిత్రాల్ని కలర్ కెమెరా తీసి పంపింది. అంగారక గ్రహం పైకి భారత్‌ పంపిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌) అద్భుతమైన ఫోటోలను తీసి భూమికి పంపింది. 

ఎత్తుగల అగ్నిపర్వతాలు, లోతైన లోయల చిత్రాలు

ఎత్తుగల అగ్నిపర్వతాలు, లోతైన లోయల చిత్రాలు

సౌరవ్యవస్థలోని అత్యధిక ఎత్తుగల అగ్నిపర్వతాలు, లోతైన లోయల చిత్రాలను తన కెమెరాలో బంధించింది. వీటితో ఇస్రో బెంగళూరులో 'మార్స్‌ అట్లాస్‌' ను ప్రారం భించింది.

వందకి పైగా చిత్రాలను సైంటిఫిక్‌ అట్లాస్‌ రూపంలో..

వందకి పైగా చిత్రాలను సైంటిఫిక్‌ అట్లాస్‌ రూపంలో..

మార్స్‌ కలర్‌ కెమెరా 350 ఫొటోలను తీస్తే వాటిలో వందకి పైగా చిత్రాలను సైంటిఫిక్‌ అట్లాస్‌ రూపంలో పొందుపరిచారు.

గ్రహంపై జీవం వుండడానికి అవకాశాలు

గ్రహంపై జీవం వుండడానికి అవకాశాలు

రోదసీలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న మామ్‌ భూమికి పంపిన డేటాను విశ్లేషించి చూసినట్లైతే పొడిగా, దుమ్ము, ధూళితో వుండే ఈ గ్రహంపై జీవం వుండడానికి అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోందని ఇస్రో తెలిపింది.

గతేడాది సెప్టెంబర్ 24న మంగళ్‌యాన్ ప్రయోగం

గతేడాది సెప్టెంబర్ 24న మంగళ్‌యాన్ ప్రయోగం

అంగారక గ్రహం (మార్స్)పై జీవుల మనుగడ, మిథేన్ వాయువు ఉందా అనే అంశాన్ని పరీశీలించడానికి, అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి దేశ అణు సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే లక్ష్యంగా, భారత్ గతేడాది సెప్టెంబర్ 24న మంగళ్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టింది.

జీవం చరిత్రను మామ్‌ తిరగరాస్తుందా..

జీవం చరిత్రను మామ్‌ తిరగరాస్తుందా..

అంగారకుని వాతావరణంలో మీథేన్‌ వాయువు వుందనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ సంకేతాలను ఇంకా శాస్త్రీయంగా నిరూపించాల్సి వుంది. విశ్వంలో ఇప్పటివరకు మనకు తెలిసిన జీవం చరిత్రను మామ్‌ తిరగరాస్తుందా అనడానికి ఇంకా మనం కొంత వేచి వుండాల్సిన పరిస్థితి వుంది. నవంబరు 5వ తేదిన 'ఫిషింగ్‌ హామ్లెట్‌ టు మార్స్‌' అనే పుస్తకాన్ని ఇస్రో ఆవిష్కరించనుంది.

తొలి ప్రయత్నంలోనే..

తొలి ప్రయత్నంలోనే..

అయితే తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహంపైకి మామ్‌ను విజయవంతంగా ప్రయోగించి భారత్ చరిత్ర సృష్టించింది.

నాసా సరసన..

నాసా సరసన..

గతంలో మార్స్‌పైకి ఇలాంటి మిషన్లను పంపిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెందిన యూరోపియన్ కన్సార్టియం, అమెరికాకు చెందిన నాసా, రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్ సరసన చేరింది.

51 మిషన్లలో  21 మిషన్లు మాత్రమే విజయవంతం

51 మిషన్లలో 21 మిషన్లు మాత్రమే విజయవంతం

మామ్ ప్రయోగానికి ముందు అంగారక గ్రహంపైకి మొత్తం 51 మిషన్లను చేపట్టగా కేవలం 21 మిషన్లు మాత్రమే విజయవంతమయ్యాయి. మంగళ్‌యాన్ విజయవంతమైన తర్వాత ఇప్పట్లో ఏ దేశానికి సాధ్యం కానటువంటి కార్యాన్ని సాధించారని ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించిన సంగతి తెలిసిందే.

మరెన్నో ఏండ్లపాటు మామ్ సేవలందించే అవకాశం

మరెన్నో ఏండ్లపాటు మామ్ సేవలందించే అవకాశం

మొదట మామ్ ఆరునెలలపాటు సేవలందిస్తుందని భావించారు. కానీ ఇంకా 35 కేజీల ఇంధనం ఉండటంతో మరెన్నో ఏండ్లపాటు మామ్ సేవలందించే అవకాశముందని ఇస్రో అంచనా వేస్తున్నది.

విష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తే సూచనలు కనిపించడం లేదు

విష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తే సూచనలు కనిపించడం లేదు

మార్స్ సోలార్ కంజెక్షన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తే సూచనలు కనిపించడం లేదు. మరెన్నో ఏండ్ల పాటు సేవలందించే అవకాశముంది అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఇటీవల తెలిపారు.

మామ్ పై నుంచి తీసి భూమి పైకి పంపిన ఎర్ర సముద్రం ఫోటో

మామ్ పై నుంచి తీసి భూమి పైకి పంపిన ఎర్ర సముద్రం ఫోటో

మామ్ పై నుంచి తీసి భూమి పైకి పంపిన ఎర్ర సముద్రం ఫోటో 

మామ్ తీసి పంపిన సహారా ఎడారి ఫోటో

మామ్ తీసి పంపిన సహారా ఎడారి ఫోటో

మామ్ తీసి పంపిన సహారా ఎడారి ఫోటో 

మామ్ మన ఇండియాను సై నుంచి తీసి పోటో ఇది

మామ్ మన ఇండియాను సై నుంచి తీసి పోటో ఇది

మామ్ మన ఇండియాను సై నుంచి తీసి పోటో ఇది 

 తేదీల వారీగా..

తేదీల వారీగా..

మామ్ పై నుంచి వివిద దశల్లో ఫోటోలను తీసి భూమిపైకి పంపింది.అవి తేదీల వారీగా..

 నాలుగు రకాలుగా ఫోటోలు

నాలుగు రకాలుగా ఫోటోలు

మామ్ కలర్ పోటో ఇలా నాలుగు రకాలుగా ఫోటోలు తీస్తుందని ఇస్రో తెలిపింది. 

అంగారక గ్రహానికి సంబంధించి వ్యూ పాయింట్

అంగారక గ్రహానికి సంబంధించి వ్యూ పాయింట్

అంగారక గ్రహానికి సంబంధించి వ్యూ పాయింట్ 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Mangalyaan had successfully completed one year in Martian orbit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X