కోట్ల నష్టంతో చిన్నబోయిన చెన్నపట్నం

Written By:

భారీ వర్షాలతో చిన్నబోయిన చైన్నై ఆర్థిక పరంగానూ చిన్నబోయింది. భారీ వర్షాల ధాటికి అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి.సాఫ్ట్ వేర్ కు తలమానికంగా నిలిచిన చెన్నై ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ కు కోట్లలో నష్టాన్ని మిగిల్చింది. ఒక్క సాఫ్ట్ వేర్ రంగానికే దాదాపు రూ. 400 కోట్ల రూపాయల మేర ఆస్థినష్టం వాటిల్లింది. ఇక టెలికం కంపెనీలు రూ. 300 కోట్ల మేర నష్టాలను చవిచూశాయి. ఆటో మొబైల్ రంగానికి మిగిల్చిన విషాదం రూ. 1500 కోట్లు. ఇక మరణించిన వారి సంఖ్య 450కి మందికి పైగానే.

Read more: శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటీ రంగానికి 60 మిలియన్ డాలర్ల నష్టం

భారీ వర్షాలు, వరదలతో చెన్నై ఐటీ రంగానికి 60 మిలియన్ డాలర్ల (రూ. 400 కోట్ల) నష్టం. ఇప్పటికీ అన్ని టెక్ కంపెనీలు నీటిలో మునిగితేలుతున్నాయి.

చిన్న ఐటీ కంపెనీలకు వాటిల్లిన నష్టం 10 మిలియన్ డాలర్ల వరకు

ఇందులో చిన్న ఐటీ కంపెనీలకు వాటిల్లిన నష్టం 10 మిలియన్ డాలర్ల వరకు ఉండగా, పెద్ద కంపెనీలు 50 మిలియన్ డాలర్ల వరకు నష్టపోయిన్నట్లు అంచనా వేస్తున్నారు.

టీసీఎస్, కాగ్నిజంట్, ఇన్ఫోసిస్ లాంటి కొన్ని సంస్థలు

టీసీఎస్, కాగ్నిజంట్, ఇన్ఫోసిస్ లాంటి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను బెంగళూరుకు తరలించి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాయి.

ఆటోమొబైల్ రంగానికి సుమారు 15,000 కోట్ల రూపాయల నష్టం

ఐటీ రంగంతో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమొబైల్ రంగానికి సుమారు 15,000 కోట్ల రూపాయల నష్టం కలుగుతున్నట్లు అంచనావేస్తున్నారు.

అసోచామ్ వెల్లడి

చిన్న, మధ్య తరహా, సాంకేతిక, టెక్స్టైల్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు అసోచామ్ వెల్లడించింది.

టెలికాం రంగానికి రూ. 300 కోట్ల రూపాయల మేర నష్టం

ఇక టెలికాం రంగానికి రూ. 300 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.

వర్షాలతో మూతపడిన పలు కంపెనీలు

వర్షాలతో మూతపడిన పలు కంపెనీలు ఇప్పటికీ తెరుచుకోలేదు. పరిస్థితి ఈ వారమంతా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here write IT Companies Suffer 60 Million Dollar Loss Due To Chennai Floods
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot