జియో స్పీడ్‌పై నమ్మలేని నిజాలు..ఎందుకిలా..?

Written By:

ఉచిత డేటా అంటూ వచ్చి రావడంతోనే కష్టమర్ల మనసు దోచుకున్న జియో ఇప్పుడు స్పీడ్ విషయంలో అనేక విమర్శలను ఎదుర్కుంటోంది. కష్టమర్లకు జియో అందిస్తానన్న స్పీడ్ రోజు రోజుకు తగ్గిపోతుందని ఎంతో మంది నిరాశను వ్యక్తం చేస్తున్నారు. స్పీడ్ టెస్ట్ లో సైతం జియో నెగ్గలేక చతికిలపడినట్లుగా తెలుస్తోంది. జియో స్పీడ్ పై పూర్తి వివరాలతో కూడిన కధనం..

ఎయిర్‌టెల్ మరో సంచలనం : రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరైన నెట్‌వర్క్‌ స్పీడ్‌ను

ఆర్భాటంగా ప్రారంభమైన రిలయన్స్‌ జియో సరైన నెట్‌వర్క్‌ స్పీడ్‌ను అందించలేకపోతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

దేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలోనూ

దేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలోనూ జియో సరైన డేటా స్పీడ్ ను అందించడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో అందించే స్పీడ్‌పై పరీక్షలు

ఈ నేపథ్యంలో ప్రముఖ డేటా స్పీడ్‌ టెస్టింగ్‌ వెబ్‌సైట్‌ అయిన 'ఊక్లా' జియో అందించే స్పీడ్‌పై పరీక్షలు నిర్వహించడంతో పాటు, జియో డేటా స్పీడ్‌ రోజురోజుకీ తగ్గిపోవడం వాస్తవమే అంటూ తన టెస్ట్‌ రిపోర్టులను ప్రకటించింది.

కనీసం సగటు స్పీడ్‌ను కూడా

జియో కస్టమర్‌లందరూ డేటా స్పీడ్‌ గురించి చాలా ఎక్కువగా ఊహించుకున్నారనీ, అయితే కనీసం సగటు స్పీడ్‌ను కూడా ఇది అందించలేకపోతుందని 'ఊక్లా' వెల్లడించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

50 mbps పైగా ఉండే సూపర్ ఫాస్ట్

కొన్ని నెలల క్రితం ప్రివ్యూ ఆఫర్ ను ప్రకటించినపుడు జియో వినియోగదారులు డేటా స్పీడ్ లో ఒక సరికొత్త అనుభూతిని అనుభవించారు. 50 mbps పైగా ఉండే సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్ ద్వారా అత్యద్భుత ఇంటర్ నెట్ అనుభూతిని చవిచూశారు.

ప్రత్యర్థి కంపెనీల డేటా స్పీడ్ లతో పోలిస్తే

ఎందుకంటే ప్రత్యర్థి కంపెనీ లైన ఎయిర్ టెల్, వోడా ఫోన్ లు అందించే డేటా స్పీడ్ లతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కానీ ఈ స్థాయి లో మార్పు

కమర్షియల్ గా లాంచ్ అయిన తర్వాత ఈ స్పీడ్ లో కొంచెం మార్పు ఉండవచ్చని అందరూ భావించారు కానీ ఈ స్థాయి లో మార్పు ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు.

అనేక రకాల ఫిర్యాదులు

సెప్టెంబర్ లో దీని కమర్షియల్ లాంచ్ జరిగిన దగ్గరనుండీ డేటా స్పీడ్ లు తగ్గిపోతున్నయనీ, ఇంటర్ నెట్ సరిగా పనిచేయడం లేదనీ అనేక రకాల ఫిర్యాదులు రిలయన్స్ కు వెళ్ళాయి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతీ నెలా 23 శాతం తగ్గుతూ

దీని డేటా స్పీడ్ ప్రతీ నెలా 23 శాతం తగ్గుతూ 11.31mbps నుండీ 8.77 mbps కు చేరింది. ఇది ఇదే విధంగా తగ్గిపోయే అవకాశాలు నూటికి నూరుపాళ్ళూ ఉన్నాయి.

ఒక రేంజ్ లో ఊహించుకుంటే

జియో కస్టమర్ లందరూ తమ డేటా స్పీడ్ గురించి ఒక రేంజ్ లో ఊహించుకుంటే కనీసం సగటు స్పీడ్ ను కూడా ఇది అందించలేకపోతుందని ఊక్లా వెల్లడించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీని స్పీడ్ కేవలం 4.55 mbps

జూలై లో అది 32.47 mbps స్పీడ్ ను అందించగా అక్టోబర్ 7 వ తేదీన అదే ప్రదేశం లో దీని స్పీడ్ కేవలం 4.55 mbps గా ఉందని వినియోగదారులు వాపోతున్నారు.

ముందు ముందు ఈ సమస్యకి

మరి ముందు ముందు ఈ సమస్యకి జియో ఎటువంటి పరిష్కారం చూపుతుందో చూడాలి. జియో స్పీడ్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరిస్తోందో వేచి చూడాల్సిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
It's Not Just You, Reliance Jio 4G Speeds Have Totally Gone Down Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot