ఆన్‌లైన్ డేటింగ్‌‌లో అంతా మోసమేనట

Written By:

ఇప్పుడు అంతా ఆన్‌లైన్ ప్రపంచం కావడంతో ప్రతి ఒక్కరూ దాని వెంట పరుగులు తీస్తున్నారు. ఇక భార్యా భర్తలు ఒకరికి ఒకరు దూరమైన వారయితే తోడు కోసం ఎక్కువగా ఆన్‌లైన్ డేటింగ్ వైపు చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ డేటింగ్ లో వారికి ఆనందం దొరక్కపోగా మరింత విషాదం వారిని వెన్నాడుతోంది. చాలామంది ఇదే విషయాన్ని తమ అనుభవాల రూపంలో పంచుకుంటున్నారు. మరి వారి భాదలు చూసినవారెవరికైనా అయ్యో అనిపించక మానదు.

Read more: ప్రమాదంలో చిక్కుకున్నారా : అయితే 9 గట్టిగా నొక్కండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై

భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై ఒంటరితనంతో బాధ పడుతున్న వారెందరో ఆన్లైన్ డేటింగ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ డేటింగ్లలో ఆశించిన ఆనందం దొరక్కపోగా మరింత విషాదం వారి జీవితాలను అలుముకుంటోంది.

కోరుకున్నవారు కోరుకున్నట్లు ఉండకపోవడంతో

కోరుకున్నవారు కోరుకున్నట్లు ఉండకపోవడంతో హతాశులవుతున్నవారు ఎందరో! ఏదోరకంగా భార్యాపిల్లలకు దూరమై ఒంటరిగా బతుకుతున్న కొంతమంది వయోవృద్ధుల అనుభవాలు ఇలా ఉన్నాయి ..

ఆన్ లైన్ డేటింగ్ సైట్లో కనిపించే మహిళల ఫొటో

ఆన్ లైన్ డేటింగ్ సైట్లో కనిపించే మహిళల ఫొటో కనీసం పది నుంచి పాతికేళ్ల క్రితం తీసుకున్నదై ఉంటుంది. వయస్సు కారణంగానో, మేకప్ కారణంగానో చూడడానికి ఫొటో అందంగా కనిపించవచ్చు. తీరా వెళ్లి చూస్తే పీక్కుపోయి ముడతలు పడిన ముఖంతోనీ, పిచ్చుక గూడులాగానో, చింపిరి జుట్టుతోనో కనిపించడం ఖాయం.

సన్నగా నాజూగ్గా కనిపిస్తుందనుకుంటే

సన్నగా నాజూగ్గా కనిపిస్తుందనుకుంటే సుమోలకు తీసిపోని విధంగా ఉంటారు. ఆన్లైన్లో వారి ఫొటోలకన్నా కలిసే నాటికి కనీసం యాభై కిలోల బరువు ఎక్కువుంటారు.

ఆకారం ఎలా ఉంటేనేమీ మానసికంగా కంపెనీ ఇచ్చేవాళ్లుంటే

ఆకారం ఎలా ఉంటేనేమీ మానసికంగా కంపెనీ ఇచ్చేవాళ్లుంటే చాలులే అనుకుంటే వెనక్కి తిరిగి పిక్క బలం చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకునే మాటల సంగతి అటుంచి ఐదు నిమిషాలకు మించి భరించలేని సుత్తి కబుర్లను సరికొత్తగా వినాల్సి వస్తోంది.

మాజీ భర్త లేదా మాజీ బోయ్ ఫ్రెండ్ గురించో,

మాజీ భర్త లేదా మాజీ బోయ్ ఫ్రెండ్ గురించో, ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల గురించో, చిన్నప్పుడే భగ్నమైన ప్రేమ గురించో విఫులంగా వినాల్సి వస్తోంది. త ల్లీ పిల్లలను ఖరీదైన హోటళ్లకు తిప్పడమే పనిగా పెట్టుకోవడం, బేబీ సిట్టింగ్లతో సేవలు చేయడమూ తప్పదు. పిల్లల పెళ్లిళ్ల లాంటి బరువు బాధ్యతలు కూడా మోయాల్సి రావచ్చు.

పర్యటించడమంటే ఎంతో ఇష్టమన్నారంటే

పర్యటించడమంటే ఎంతో ఇష్టమన్నారంటే పక్కనున్న హాలీ డే రిసార్ట్కు వెళ్లడమట.అలాగే ఫారిన్ ఫుడ్ ఎంతో ఇష్టమంటే పూరీలు తినే వాళ్లు, నూడుల్స్ తినడం లాంటిదని, సంగీతాన్ని ప్రేమిస్తానని అన్నారంటే 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' సినిమా చూసిన గుర్తు ఉండడమని ఈ సైట్లో పలువురు వెల్లడిస్తున్నారు. ఇక సోషల్ డ్రింక్స్ అంటే పీకలదాకా తాగి సొమ్మసిల్లి పడిపోవడమేనట.

ట్రాన్స్ ఫోర్ట్ బిజినెస్ మేన్ గా పనిచేస్తున్న గేరి బాల్

ట్రాన్స్ ఫోర్ట్ బిజినెస్ మేన్ గా పనిచేస్తున్న గేరి బాల్ వయస్సు 51వ సంవత్సరాలు ఆయనకు 12 సంవత్సరాల కూతురు మియా ఉంది. ఆయన భార్య లేకపోవడంతో ఆన్ లైన్ డేటింగ్ ను ఆశ్రయిస్తే అంతా విషాదమేనట. తీరా అన్నీ మాట్లాడుకున్న తర్వాత వారు మనల్ని బ్లాక్ చేస్తారు. ఎందుకు బ్లాక్ చేశారంటే అటునుంచి సమాధానం ఉండదని చెబుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్ షైర్లో ఓ కంపెనీకి డెరైక్టర్ గా పని చేస్తున్న 51 ఏళ్ల స్టీఫెన్

ఆక్స్‌ఫర్డ్ షైర్లో ఓ కంపెనీకి డెరైక్టర్ గా పని చేస్తున్న 51 ఏళ్ల స్టీఫెన్ నైట్స్ ది ఇంకో గాధ. 20 మందితో డేటింగ్ చేసిన ఆయన వారి నుంచి చాలానే నేర్చుకున్నారట. నేను మాట్లాడేలోపు ఇంకోకరితో ఆమె డేటింగ్ చేస్తుందని చెబుతున్నారు. ఇందులో సెన్సిటివ్ అంటే, బాటిల్ వైన్ తాగి గత జీవితం గురించి బాధపడడం అని తన అనుభవాలు చెబుతున్నారు.

బెర్క్ షైర్ కి చెందిన రిటైర్డ్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ 67 ఏళ్ల మార్టిన్ కర్టీస్ ది

బెర్క్ షైర్ కి చెందిన రిటైర్డ్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ 67 ఏళ్ల మార్టిన్ కర్టీస్ ది మరొక గాధ. 25 సంవత్సరాలుగా సింగిల్ గా ఉంటున్నారట.ఆమె ఫోటోలో ఓ విధంగా ఉంటుంది. అక్కడికెళ్లి చూస్తే మరో విధంగా ఉంటుంది. దీనితో నేను చాలా డిసప్పాయింట్ అయ్యానని చెబుతున్నారు. అప్పుడప్పుడు సెక్స్ దొరికినా నిజమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ దొరకదని వాపోతున్నారు.

లింకన్ షైర్ కు చెందిన 61 ఏల్ల జాన్వేన్ ది మరో కథ.

లింకన్ షైర్ కు చెందిన 61 ఏల్ల జాన్వేన్ ది మరో కథ. ట్రాన్స్ పోర్ట్ మేనేజర గా చేస్తున్న ఈయన 18 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటున్నారు. తోడు కోసం ఆన్ లైన్ డేటింగ్ ను ఆశ్రయిస్తే ఓ 61 ఏళ్ల ఆమెతో పరిచయం ఏర్పడింది. తీరా కలుద్దామంటే ఆమె ఒప్పుకోవడం లేదట. ఆమెకు కలవడం ఇష్టం లేదని చెబుతోంది. జంతువులను అదే పిల్లులను, కుక్కల గురించే మాట్లాడుతారట.

వారు ఇంచుమించు తమ ఏజ్ వాళ్లతోనే డేటింగ్

వారు ఇంచుమించు తమ ఏజ్ వాళ్లతోనే డేటింగ్ చేశారు. ఇప్పుడు డేటింగ్ కు స్వస్తి చెప్పి ఇష్టమైన మద్యం సేవిస్తూ, ఇష్టమైన సినిమా ఒంటరిగా చూడడమే బెటర్ అని వారు సలహా ఇస్తున్నారు.

వీళ్ల సంగతి సరే, మరి ఆన్ లైన్లో డేటింగ్ చేస్తున్న

వీళ్ల సంగతి సరే, మరి ఆన్ లైన్లో డేటింగ్ చేస్తున్న మహిళల సంగతేమిటి? వారి అనుభవాలు ఇంతకంటే వెగటు పుట్టించేలా ఉంటాయోమో! వీరిలాగా వారు కూడా మీడియా ముందుకొచ్చి చెబితేగానీ వాస్తవాలు తెలియవు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Think it's hard for women to find love online It's FAR worse for men! Read these toe-curling stories of dates from hell and you'll see why
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot