బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి..అమెజాన్ అధినేత ముందుకు

Written By:

ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బిజోస్ వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టారు. ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించారు. అతని సంపద విలువ దాదాపు 65. 3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ అంశాలను ఫోర్బ్స్ రియల్ టైమ్ వెల్త్ ట్రాకర్ వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కొనసాగుతున్నారు. బిల్ గేట్స్ సంపద విలువ 78 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండో స్థానంలో స్పెయిన్ కు చెందిన ఫ్యాషన్ చైనా జరా వ్యవస్థాపకుడు అమన్కియో ఒర్టేగా ఉన్నారు. ఈయన సంపద విలువ 73 బిలియన్ డాలర్లు. ఇక ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ 54 బిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదంటున్నారు అమెజాన్ బాస్ అదెలాగో మీరే చూడండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతికాలంలోనే విస్తరించుకున్న ‘అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం తీరలేదట.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే నూతన సంవత్సరంలో తన లక్ష్యమని ఆయన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

6 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే మూడవ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందని చెబుతున్నారు.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్ ఇప్పటికీ వ్యక్తిగత సంపాదనలో ప్రపంచ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వ్యవస్థాపకులను అధిగమించారు

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలనే హాలీవుడ్ సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని ప్రకటించిన విషయం తెల్సిందే.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన లక్ష్యమని ప్రకటించిన విషయం తెల్సిందే.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించని వ్యక్తి. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల వెయ్యి నుంచి పది వేల డాలర్ల వరకు విరాళాలు ఇస్తున్నారు.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి...అమెజాన్ అధినేత ముందుకు

అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని నడుపుతుందని ప్రకటించారు. అంతటి చిత్తశుద్ధే ఆయనకుంటే అమెజాన్ సరఫరా చేస్తున్న ఉత్పత్తుల ప్యాకేజీకి ఏమాత్రం ప్లాస్టిక్ పేపర్‌ను వాడకూడదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Jeff Bezos passes Warren Buffett in Forbes rich list
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot