ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

By Hazarath
|

ఇండియాలో ఈ కామర్స్ మార్కెట్ ను సొంతం చేసుకోవడానికి అమెజాన్ భారీ పెట్టుబడులతో దూసుకొస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పోటీకి సై అంటూ టాప్ లో నిలిచేందుకు భారత్ లో 20,169.75 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెజాన్ బాస్ జెఫ్ బిజోస్ ప్రకటించారు. దీంతో భారత్ లో మొత్తం 500 కోట్ల డాలర్లను అమెజాన్ ఇండియాలో పెట్టుబడిగా పెట్టినట్లయింది. ఇప్పటికే భారత్ మార్కెట్లో దూసుకుపోతున్న అమెజాన్ 45 వేల ఉద్యోగాలను అందించామని ఈ సంఖ్యను మరింత పెంచుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో జెఫ్ బిజోస్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read more: కోట్లాస్తి మాకొద్దంటున్న దానకర్ణులు

Jeff Bezos

చైనా మార్కెట్ ను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించి అలీబాబా దెబ్బకు వెనక్కు వచ్చింది. ఇప్పుడు ఇండియాపై పూర్తి స్థాయిలో ఈ కామర్స్ ను సొంతం చేసుకోవాలని కోట్లను కుమ్మరిస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్ మూడేళ్ల వారి్షకోత్సవాన్ని ఇండియాలో పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును, సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీతో కలిసి బెజోస్ ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. ఇదిలా ఉంటే జెఫ్ బిజోస్ ధన దాహం గురించి వింటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

Read more: అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతికాలంలోనే విస్తరించుకున్న ‘అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం తీరలేదట.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే తన లక్ష్యమని వెల్లడించారు.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే నాలుగవ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందంటున్నారు.

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్ ఇప్పటికీ వ్యక్తిగత సంపాదనలో ప్రపంచ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వ్యవస్థాపకులను అధిగమించిన విషయం విదితమే. ఆయన వ్యక్తిగత సంపాదన గత ఏడాదిలోనే రెండింతలైంది.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలనే హాలీవుడ్ సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని ప్రకటించిన విషయం తెల్సిందే.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన లక్ష్యమని ఆ దిశగా నిరంతరం అడుగులు వేస్తానని చెప్పారు.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను ఇప్పటికే న్యూయార్క్, లాస్ ఏంజెలిస్ నగరాల్లో సరఫరా చేస్తోంది. దీన్ని ఈ ఏడాదిలో ప్రపంచంలోని నగరాలన్నింటికీ విస్తరించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు ఈ అమెజాన్ బాస్.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించని వ్యక్తి. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల వెయ్యి నుంచి పది వేల డాలర్ల వరకు విరాళాలు ఇస్తున్నారు.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని నడుపుతుందని ప్రకటించారు.

 ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

కోట్ల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ అమెజాన్ బాస్ సమాజ సేవకు తన వంతు సాయం చేస్తే అందరూ మెచ్చుకుంటారు. ా ఆ దిశగా అడుగులు ఎంతవరకు వేస్తారో చూడాలి. 

Best Mobiles in India

English summary
Here Write Jeff Bezos says Amazon to up India investment to $5 billion

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X