జియోకి వణుకుపుట్టిస్తున్న ప్రత్యర్థుల స్కెచ్

By Hazarath
|

టెలికం రంగంలోకి ఊహించని విధంగా దూసుకువచ్చి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న జియోను వణికించేందుకు ఇప్పుడు టెల్కోలు రెడీ అయ్యాయి. దీనికోసం కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను అందిపుచ్చుకున్నాయి.జియోతో ముఖాముఖిలో తేల్చుకునేందుకు అవసరమైన 4జీ తరంగాలను సొంతం చేసుకుని జియోని వణికించేందుకు రెీ అయ్యాయి. మరి ఎలా వణికించనున్నాయో మీరే చూడండి.

 

బ్లాక్‌‌బెర్రీ వదిలి వెళ్లిన తీపి గుర్తులు

 దిగ్గజాల వెన్నులో ఇప్పటిదాకా వణుకు

దిగ్గజాల వెన్నులో ఇప్పటిదాకా వణుకు

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ అంటూ టెలికం రంగంలో పాతుకుపోయిన దిగ్గజాల వెన్నులో ఇప్పటిదాకా వణుకు పుట్టించిన విషయం విదితమే.

ఇప్పుడు ప్రత్యర్థి టెల్కోలు కూడా

ఇప్పుడు ప్రత్యర్థి టెల్కోలు కూడా

కానీ ఇప్పుడు ప్రత్యర్థి టెల్కోలు కూడా జియోతో ముఖాముఖి తేల్చుకునేందుకు తాజా వేలంలో తగినంత స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి. ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేసీ మరీ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతీ ఎయిర్‌టెల్
 

భారతీ ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ రూ.14,244 కోట్లతో 1800, 2100, 2300 మెగాహెర్జ్ బ్యాండ్‌లలో 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. కేరళ, అసోం, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, నార్త్‌ఈస్ట్ సర్కిళ్లలో స్పెక్ట్రమ్ లభించింది.

ఐడియా

ఐడియా

ఐడియా రూ.12,798 కోట్లతో 1800, 2100, 2300, 2500 మెగాహెర్జ్ బ్యాండ్‌లలో మొత్తం 349.20 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. దీంతో తాను సొంతంగానే దేశవ్యాప్తంగా 20 సర్కిళ్లలో 4జీ సర్వీసులను ఐడియా అందించగలదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వొడాఫోన్ ఇండియా

వొడాఫోన్ ఇండియా

వొడాఫోన్ ఇండియా రూ.20,280 కోట్ల వ్యయంతో 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. 17 సర్కిళ్లలో 4జీ సేవలను అందించే శక్తిని సమకూర్చుకుంది.

జియోకు కౌంటర్ ఇవ్వడానికి

జియోకు కౌంటర్ ఇవ్వడానికి

జియోకు కౌంటర్ ఇవ్వడానికి మొదటి మూడు టెలికం కంపెనీలు (ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా) తగినంత 4జీ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో చందాదారులను ఆకర్షించే విషయంలో మరింత పోటీ పడనున్నాయి' అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ పేర్కొంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 జియోతో పోలిస్తే ఇప్పటికీ ఒక గిగాహెర్జ్ 4జీ బ్యాండ్

జియోతో పోలిస్తే ఇప్పటికీ ఒక గిగాహెర్జ్ 4జీ బ్యాండ్

అయితే, జియోతో పోలిస్తే ఇప్పటికీ ఒక గిగాహెర్జ్ 4జీ బ్యాండ్ కొరతను ప్రధాన మూడు టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్నాయని, ఈ దృష్ట్యా ఇవి భవిష్యత్తులో 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

డేటా అధికంగా వినియోగంచే సర్కిళ్లలో

డేటా అధికంగా వినియోగంచే సర్కిళ్లలో

టెలికం కంపెనీలు డేటా అధికంగా వినియోగంచే సర్కిళ్లలో విపరీతమైన రద్దీని ఎదుర్కొంటున్నాయి. ఈ దృష్ట్యా తాజాగా కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ను 4జీ సేవలకు వినియోగిస్తాయి' అని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండేళ్లలో నెట్‌వర్క్ విస్తరణకు

రెండేళ్లలో నెట్‌వర్క్ విస్తరణకు

టెలికం సేవల ద్వారా వచ్చే ఆదాయంలో నాలుగింట మూడో వంతు మొదటి మూడు టెలికం కంపెనీలకు చెందినదేనని, వచ్చే రెండేళ్లలో నెట్‌వర్క్ విస్తరణకు ఇవి రూ.80వేల కోట్లు వ్యయం చేయనున్నాయని క్రిసిల్ మరో డెరైక్టర్ అజయ్ శ్రీనివాసన్ చెప్పారు.

ఈ నెల 1 నుంచి భారీ స్పెక్ట్రమ్ వేలాన్ని

ఈ నెల 1 నుంచి భారీ స్పెక్ట్రమ్ వేలాన్ని

కేంద్ర టెలికం శాఖ ఈ నెల 1 నుంచి భారీ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించింది. తక్కువ స్పందనతో ఐదు రోజుల పాటు సాగిన ఈ వేలం చివరికి గురువారంతో ముగిసింది.

5.6 లక్షల కోట్లు వస్తాయని

5.6 లక్షల కోట్లు వస్తాయని

5.6 లక్షల కోట్లు వస్తాయని కేంద్రం అంచనా వేసింది. కానీ టెలికం కంపెనీలు తాజా వేలంలో దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి వ్యవహరించడంతో ప్రభుత్వానికి కేవలం రూ.65,789 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసమే బిడ్లు వచ్చాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

700, 900 మెగాహెర్జ్ బ్యాండ్‌లో

700, 900 మెగాహెర్జ్ బ్యాండ్‌లో

700, 900 మెగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ కోసం అసలు ఒక్క బిడ్ కూడా రాలేదు. వీటి ఖరీదు అధికంగా ఉన్నందున కంపెనీలు దూరంగా ఉండిపోయాయి.

భవిష్యత్ లో డిమాండ్ లేనందున

భవిష్యత్ లో డిమాండ్ లేనందున

అయితే భవిష్యత్ లో డిమాండ్ లేనందున 700/900 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ధరను ప్రభు త్వం తగ్గిస్తుందని అప్పుడు అన్నీ టెల్కోలు ఏకమై కొనే అవకాశం కూడా ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio 4G after one month: Speed plummets but calls finally connect read more at telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X