ధన్ ధనా ధన్ ఆఫర్‌కు క్లీన్ చిట్, మీకు తెలియని విషయాలు ఇవే !

Written By:

టెలికాం రెగ్యులేటరీ సంస్థ 'ట్రాయ్' ఆదేశాలతో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను జియో ఉపసంహరించుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ధన్ ధనా ధన్ ఆఫర్ అంటూ తన కష్టమర్ల కోసం జియో మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. దీంతో, ఈ ఆఫర్ కూడా ఆమోదయోగ్యం కాదంటూ ప్రత్యర్థి టెలికాం కంపెనీలు మళ్లీ ట్రాయ్ ను ఆశ్రయించాయి.

4 జిబి ర్యామ్‌తో సచిన్ ఫోన్ , ధర ఎంతంటే..

ఈ నేపథ్యంలో ధనాధన్ ఆఫర్ పై వివరణ ఇవ్వాలంటూ జియోను ట్రాయ్ ఆదేశించింది. ఈ క్రమంలో ట్రాయ్ కు జియో వివరణ ఇచ్చింది. జియో ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ట్రాయ్... ఈ ఆఫర్ లో ఎలాంటి తప్పు లేదంటూ తెలిపింది. ఈ ఆఫర్ పై 6 ముఖ్యమైన విషయాలు..

ఐదే నిమిషాల్లో మీ ఫోన్ రీఫ్రెష్, ( సింపుల్ ట్రిక్స్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేవలం రూ.309, రూ.509 ప్లాన్లు మాత్రమే

జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కింద కేవలం రూ.309, రూ.509 ప్లాన్లు మాత్రమే లభిస్తున్నాయి. గతంలో ఉన్న రూ.999 ఆపైన ఆఫర్లు లేవు. వాటిని తొలగించారు. కాకపోతే ఈ రెండు ప్లాన్ల ద్వారా లభించే డేటా సరిపోకపోతే యూజర్లు బూస్టర్ ప్యాక్‌లు వేసుకోవచ్చు. అవి రూ.11 నుంచి లభిస్తున్నాయి. రూ.11కు 100 ఎంబీ డేటా లభిస్తుండగా, గరిష్టంగా రూ.301 వేసుకుంటే 10 జీబీ 4జీ డేటా పొందవచ్చు.

ఆఫర్‌కు ఎలాంటి గడువు లేదు

జియో మొన్నా మధ్యే ప్రవేశ పెట్టిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు ఎలాంటి గడువు లేదు. కానీ ట్రాయ్ ఆదేశాలతో జియో ఆ ఆఫర్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే దానిలాగే ఇప్పుడు వచ్చిన ధన్ ధనా ధన్ ఆఫర్‌కు కూడా ఎలాంటి గడువు లేదు. యూజర్లు ఎప్పుడైనా ఆ ప్లాన్‌లో ఉన్న ప్యాక్‌లను రీచార్జి చేయించుకోవచ్చు.

ప్రైమ్ మెంబర్‌షిప్ అధికారిక గడువు ముగిసినప్పటికీ

ప్రైమ్ మెంబర్‌షిప్ అధికారిక గడువు ముగిసినప్పటికీ జియో తన ధన్ ధనా ధన్ ఆఫర్‌తో కలిపి ఈ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తోంది. అది ఎలా అంటే ఇప్పటికే ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన వారు, ఎలాంటి ప్యాక్‌లను రీచార్జి చేసుకోని వారు పైన చెప్పినట్టుగా రూ.309 లేదా రూ.509 వేసుకుంటే జియో ధన్ ధనా ధన్ ఆఫర్‌ను పొందవచ్చు.

ప్రైమ్ మెంబర్‌షిప్ పొందని వారు

అయితే ఇంకా ప్రైమ్ మెంబర్‌షిప్ పొందని వారు కూడా ఈ ప్యాక్‌లను వేసుకోవచ్చు. కాకపోతే రూ.309కు అదనంగా రూ.99 కలిపి అంటే రూ.408, అదే రూ.509కు అదనంగా రూ.99 కలిపి అంటే రూ.608 వేసుకుంటే దాంతో ప్రైమ్ మెంబర్‌షిప్ లభిస్తుంది. అదేవిధంగా రూ.309, రూ.509 ప్యాక్‌లను కూడా వాడుకోవచ్చు. వాటికి పైన చెప్పినట్టుగా 84 రోజుల వాలిడిటీ లభించడంతోపాటు ప్లాన్ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయి.

కాసింత ఎక్కువ ధరకు

గతంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ కింద రూ.303, రూ.499 ఆఫర్లనే జియో కాసింత ఎక్కువ ధరకు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అంటే రూ.303ని రూ.6 పెంచి రూ.309 చేసింది. రూ.499ని రూ.10 పెంచి రూ.509 చేసింది. ఇక వాలిడిటీ 90 రోజులు కాకుండా 84 రోజులకు తగ్గించింది. అంటే 6 రోజుల వాలిడిటీ తగ్గినట్టు లెక్క.

ధన్ ధనా ధన్ ఆఫర్‌లోనూ

సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ లాగే ధన్ ధనా ధన్ ఆఫర్‌లోనూ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీయే. యూజర్లు కేవలం డేటా ఛార్జిలు మాత్రమే భరించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Dhan Dhana Dhan offer approved by TRAI, 4G service for free users ends now read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot