1gbpsతో స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్ , 3 నెలలు ఫ్రీ !
రిలయన్స్ జియో సైట్‌లో బ్రాడ్‌బాండ్ రీ ఛార్జ్ చేసుకోమంటూ హింట్
రిలయన్స్ జియో గతేడాది నవంబర్ లో బ్రాడ్ బాండ్ మార్కెట్లోకి అతి త్వరలోనే ఎంటర్ కాబోతున్నామని ప్రకటించింది. ఇప్పటికే ముంబై, పుణే నగరాల్లో టెస్టింగ్ జరుపుతున్నామని అతి త్వరలోనే మీ ముందుకు జియో పైబర్‌నెట్ తీసుకువస్తామని జియో చెప్పింది. అయితే అది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. ఈ మేరకు రిలయన్స్ జియో సైట్‌లో బ్రాడ్‌బాండ్ రీ ఛార్జ్ చేసుకోమంటూ హింట్ ఇచ్చింది. దీన్ని బట్టి అతి త్వరలోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
జియోకి పంచ్..ఐడియా, ఎయిర్‌టెల్ దూకుడు !

జియోవైబ్ సైట్లోకి వెళ్లగానే
జియోవైబ్ సైట్లోకి వెళ్లగానే అక్కడ హోమ్ బ్రాడ్‌బాండ్ లింక్ అలాగే జియో లింక్‌లు కనిపిస్తున్నాయి. రీ ఛార్జ్ చేసుకోమంటూ కింద ఆప్సన్ కూడా ఇచ్చారు. దీనర్థం ఏంటంటే జియో బ్రాడ్‌బాండ్ త్వరలోనే రాబోతుందని..

జియో లింక్ పేరుతో
ఇక జియో లింక్ పేరుతో ఇంటర్నెట్ రూటర్ ని ఇచ్చారు. ఇది అచ్చం టీవి సెట్ టాప్ బాక్స్ లాగనే ఉంది. జియో డీటీహెచ్ మార్కెట్లోకి కూడా ఎంటర్ కాబోతుందని ఇప్పటికే వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుటు లీకయిన చిత్రాలు అది నిజమేనని తెలియజేస్తున్నాయి.

1 జిబిపిఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్
జియో యాన్యువల్ మీటింగ్ లో అంబాని FTTH పైబర్ హోమ్ సర్వీసులు అందిస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. 1 జిబిపిఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు. అనుకున్నట్లుగా జియో పైబర్ టెస్ట్ింగ్ సేవలను ముంబైలో గతేడాది ప్రారంభించారు.

నెలకి 100జిబి డేటా ఫ్రీ
జియో ఆఫర్ చేస్తున్న బేటా సర్వీసులో ప్రతి ఒక్క వినియోగదారుడు నెలకి 100జిబి డేటాను ఫ్రీగా వాడుకోవచ్చు. అది హై స్పీడ్ నెట్ తో. దాని తరువాత జియో వేగం 1mbpsకు పడిపోతుంది. మొత్తం ఇన్ స్టాలేషన్ ఛార్జీలు రూ. 4500. వినియోగదరుడు మూడు నెలల్లో జియోపై సంతృప్తిగా లేకపోతే దాన్ని రీఫండ్ చేస్తామని జియో తెలిపింది.

మొదటి మూడు నెలలు ఫ్రీ
కాబట్టి అతి త్వరలోనే జియో పైబర్ నెట్ రాబోతుందని తెలుస్తోంది. మొదటి మూడు నెలలు ఫ్రీగా పైబర్ నెట్ ని జియో ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications