జియోకి పంచ్..ఐడియా, ఎయిర్‌టెల్ దూకుడు !

Written By:

సమ్మర్ సర్‌ప్రైజ్ అంటూ దూజుకొచ్చిన జియోకి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన నేపథ్యంలో దేశీయ టెలికం ఆపరేటర్లు పండగ చేసుకుంటున్నాయి. జియో తాజా సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఉచిత ఆఫర్లను నిలిపివేయాలంటూ ట్రాయ్‌ ఆదేశించడంతో జియో షేర్లు కుదేలయ్యాయి.

నోకియా 9 vs వన్‌ప్లస్ 5, ఈ ఏడాది పెద్ద పోటీ ఇదేనా..?

జియోకి పంచ్..ఐడియా, ఎయిర్‌టెల్ దూకుడు !

భారతి ఎయిర్‌ టెల్‌ దాదాపు 3 శాతంపైగా జంప్‌చేసిటాప్‌ గెయినర్‌గా నిలిచింది.ఇదే బాటలో ఐడియా సెల్యులర్‌ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు ఇటీవలి రికార్డ్‌స్తాయి లాభాలను పొందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1 శాతానిపైగా నష్టపోయింది. ఇదిలా ఉంటే జియో ఆఫర్ నిలుపుదలపై ట్రాయ్ వివరణ ఇచ్చింది.

ఇకపై విమానం ఎక్కాలంటే ఆధార్ తప్పనిసరి !

జియోకి పంచ్..ఐడియా, ఎయిర్‌టెల్ దూకుడు !

జియో తాజా ఆఫర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ట్రాయ​ చైర్మన్ ఆర్‌ ఎస్‌ శర్మ శుక్రవారం వివరించారు. అందుకే ఈ ఆఫర్‌ నిలిపివేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. పరిశీలన అనంతరం జియో ఆఫర్‌ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించామని పీటీఐకి చెప్పారు.

పాత ఫోన్లే..కాని అదరహో అనిపించే ఫోన్లు !

జియోకి పంచ్..ఐడియా, ఎయిర్‌టెల్ దూకుడు !

దీనిపై స‍్పందించిన జియో ట్రాయ్‌ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పింది. తమ ఆఫర్‌ నిబంధనలను లోబడే ఉందని పేర్కొంది.

English summary
Bharti Airtel, Idea Cellular, RCom shares gain after Trai asks Reliance Jio to withdraw 3-month offer Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot