ఇకపై జియో స్పీడ్ 400Mbps,లైవ్‌లోకి సిల్వర్,గోల్డ్,ప్లాటినం ప్లాన్లు !

Written By:

జియో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదమే..కనిపిస్తుంది. నలుగురు ఓచోట కూర్చుంటే ముందుగా అడిగేది జియో సిమ్ గురించేనంటే అతిశయోక్తి లేదు. జియో సీమ్ కోసం షో రూంల ముందు బారులు తీరిన సంధర్భాలు కూడా ఉన్నాయి. అయితే జియో చాలా స్లోగా ఉందని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జియో ఇప్పుడు స్పీడ్ పెంచడంపై దృష్టి సారించింది.

4జీ ఫోన్స్ లేకున్నా సరే, జీవితాంతం జియో ఉచిత కాల్స్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫైబర్ నెట్ ద్వారా కూడా సేవలు

సెల్యులార్ మార్కెట్ ని కొత్త పుంతలు తొక్కిస్తూ జియో దూసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొబైల్ కే కాకుండా ఫైబర్ నెట్ ద్వారా కూడా సేవలు అందిస్తామని, అతి త్వరలో దీనికి సంబంధించిన లాంచ్ కూడా ఉంటుందని ముకేష్ అంబాని తెలిపారు కూడా.

సిల్వర్, గోల్డ్, ప్లాటినం

అయితే లేటెస్ట్ గా వచ్చిన కథనాల ప్రకారం జియో ఫైబర్ నెట్ మొత్తం మూడు రకాల ప్లాన్లలో లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అవి సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ఈ మూడు రకాల ప్లాన్లలో ఎవరికి నచ్చినట్టు వారు వేసుకోవచ్చు.

బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్లాన్స్ రూ. 500 నుంచి

నెలవారి బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్లాన్స్ రూ. 500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ధరలో 600 జిబి డేటా 15 Mbps స్పీడ్ తో మీకు లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ కావాలంటే

దీంతో పాటు మీకు అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ కావాలంటే అది రూ. 800 నుంచి స్టార్టయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఇది 10Mbps స్పీడ్ తో లభించే అవకాశం ఉంది.

ఒకరోజు అన్ లిమిటెడ్ డేటా ప్లాన్

ఇది కాకుండా మీకు ఒకరోజు అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ. 400

స్పీడ్ తో కూడిన ప్లాన్ కావాలనుకున్నవారికి

ఇక నెలవారీగా స్పీడ్ తో కూడిన ప్లాన్ కావాలనుకున్నవారికి 50 Mbps స్పీడ్ తో ప్లాన్ స్టార్టవుతుంది. దీనిలో 2000 జిబి డేటా లభిస్తుంది. అక్కడ నుంచి మొదలెడితే 400Mbps స్పీడ్ తో 300 జిబి వరకు మీరు ప్లాన్ వాడుకోవచ్చు.

వచ్చే ఏడాది మధ్యలో లైవ్ లోకి

ఈ కొత్త సర్వీసులన్నీ వచ్చే ఏడాది మధ్యలో లైవ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అంతా టెస్టింగ్ దశలో ఉంది. మరి అప్పటిదాకా వేచి చూడక తప్పదు.

జియో పాత ప్రస్థానం..షాకింగ్ నిజాలు.

ఎవరికీ తెలియని జియో పాత ప్రస్థానం..షాకింగ్ నిజాలు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

ఐడియా,ఎయిర్‌టెల్‌ రూ.13,500 కోట్లు

ఆ స్పీచ్‌తో ఐడియా,ఎయిర్‌టెల్‌ రూ.13,500 కోట్లు నష్టపోయాయి. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

బిగ్ ఆయిల్,బిగ్ డేటా..జియో ఇన్‌సైడ్ నిజాలు

బిగ్ ఆయిల్,బిగ్ డేటా..జియో ఇన్‌సైడ్ నిజాలు . మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

unlimited data,1Gbps స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్

unlimited data,1Gbps స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్


 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio is coming up with 100 MBPS internet speeds at just Rs. 500 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot