జియోని వేధిస్తున్న ర్యాగింగ్ : అంతు చూస్తామన్న అధినేత

Written By:

జియో..అత్యంత తక్కువ సమయంలోనే దేశ ప్రజలను తనవైపుకు తిప్పుకున్న టెల్కో దిగ్గజం. ఎటువంటి అనుభవం లేకుండానే 4జీ మార్కెట్లోకి దూసుకువచ్చిన దిగ్గజానికి ఇప్పుడు ర్యాగింగ్ భయం పట్టుకుంది. సంచలనం రేపుతున్న ఈ ర్యాగింగ్ పై జియో అధినేత ముఖేష్ అంబాని గరంగరం అయ్యారు. దీన్ని వెంటనే ఆపకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముఖేష్ అంబానీ ఫైర్

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌పై ఇతర టెలికాం కంపెనీలు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఫైర్ అయ్యారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

ఈ ర్యాగింగ్ ఆగడాలను తాను గమనిస్తున్నానని, వెంటనే ర్యాగింగ్‌ను నిలిపివేయాలని లేకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్కాదత్ ఏర్పాటుచేసిన 'ఆఫ్ ది కఫ్' షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్‌కనెక్షన్ ఇవ్వకుండా

టెలికాం మార్కెట్లో ఎప్పటినుంచో పాతుకునిపోయి ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కొత్తగా వచ్చిన తమ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇంటర్‌కనెక్షన్ ఇవ్వకుండా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.2,50,000కోట్లకు

తమ కొత్త టెలికాం వెంచర్ లక్ష్యం రూ.1,50,000 కోట్లు కాదని, రూ.2,50,000కోట్లకు తాము కట్టుబడి ఉన్నామని అంబానీ చెప్పారు. అంతే కాకుండా శక్తివంతమైన ఆలోచనలతో ప్రపంచాన్నే మార్చేస్తామన్నారు.

తమ క్వార్టర్లీ ఫలితాలతో దిమ్మతిరిగే షాక్

బిజినెస్‌ల పరంగా ఎవరైతే(ఫైనాన్సియల్ ఎనలిస్టులు) మార్కెట్లో జియోను తప్పుగా చిత్రీకరించాలనుకుంటున్నారో వారికి తమ క్వార్టర్లీ ఫలితాలతో దిమ్మతిరిగే షాకిస్తామన్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆపిల్, గూగుల్ వంటి టెక్నాలజీలపై ఫోకస్

ఫైనాన్సియల్ మార్కెట్లు తప్పుదోవలో నడుస్తున్నాయని, ముఖ్యంగా ఆపిల్, గూగుల్ వంటి టెక్నాలజీలను ఫోకస్ చేస్తూ విమర్శలు చేశారు. ఫైనాల్సియల్ ఎనలిస్టులందరూ తప్పని తమ క్వార్టర్లీ ఫలితాలతో నిరూపిస్తామన్నారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో అద్భుత సృష్టికి

దీంతో పాటు జియో బోర్డు సభ్యులందరూ తనకు వెన్నంటే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. జియో అద్భుత సృష్టికి దోహదం చేసిన తన పిల్లలు, ప్రస్తుతం జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్ లను మరోసారి మెచ్చుకున్నారు.

పాకిస్తాన్ యాక్టర్ల నిషేధాన్ని సమర్ధిస్తూ

ఇక భారత్ లో పాకిస్తాన్ యాక్టర్ల నిషేధాన్ని సమర్ధిస్తూ భారతీయులకు మొదట దేశమే ముఖ్యమని చెప్పారు. తర్వాతే కళలు, సంస్కృతి అన్నారు.. పాకిస్తానీ యాక్టర్లను భారత్‌లో నిషేధించడాన్ని ఆయన తన మద్దతును తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Jio is a commitment of Rs 2,50,000 crore, set to tap the consumption wave in India: Mukesh Ambani read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting