Reliance Jio లాంగ్-టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఏది బెటర్?
రిలయన్స్ జియో ప్రస్తుతం తన వినియోగదారులకు అన్ని రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందివ్వడం లేదుకానీ 365 రోజుల చెల్లుబాటును అందించే టారిఫ్ ప్లాన్లను కూడా కలిగి ఉంది. భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి వాటితో పోల్చినప్పుడు కూడా ప్రీపెయిడ్ ప్లాన్‌ల విభాగంలో కాస్త పరిమితంగా ఉంది.

జియో సంస్థ గత వారం 360 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను రూ.4,999 దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అందిస్తోంది. ఇది జియో నుండి వస్తున్న లాంగ్ వాలిడిటీ ప్లాన్‌లలో సరికొత్తది. దీనిని 336 రోజుల వాలిడిటీతో ఇటీవల విడుదల చేసిన రూ .2,121 ప్లాన్‌తో పోల్చినప్పుడు 4G డేటా మధ్య గల వ్యత్యాసం మరియు కంపెనీ అందించే ఆఫ్-నెట్ వాయిస్ కాల్‌ల పరిమితం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో రూ.2,121 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఆఫర్స్
రిలయన్స్ జియో 1.5GB డైలీ డేటా ప్లాన్స్ కింద రూ.2,121 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్యాక్‌లో జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్, 12,000 నిమిషాల ఆఫ్-నెట్ కాల్స్, రోజుకు 100SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా వంటి ప్రయోజనాలను 336 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో ప్రీపెయిడ్ యూజర్లు మొత్తంగా 504GB డేటాను పొందుతారు. కేటాయించిన రోజువారీ 1.5GB డేటా అయిపోయిన తర్వాత అదనపు డేటా వినియోగం కోసం మీరు డేటా ప్యాక్ ను రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

జియో రూ.4,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఆఫర్స్
జియో యొక్క రూ .4,999 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే రూ.2,121 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క రోజువారీ డేటా పరిమితిలా కాకుండా కేటాయించిన 350GB 4G డేటాను రోజువారీ లేదా ఒక వారం లేదా నెలవారీ పరిమితి లేకుండా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. రూ.2,121 ప్లాన్‌తో పోలిస్తే రూ.4,999 ప్లాన్ అందించే డేటా పరిమితి తక్కువగానే ఉంది. కాకపోతే రూ.2,121 ప్యాక్ మొత్తంగా 336 రోజుల చెల్లుబాటుతో వస్తే రూ.4,999 ప్లాన్ అదనపు వాలిడిటీతో మొత్తంగా 360 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

అదనపు ప్రయోజనాలు
ఇతర ప్రయోజనాలు రెండింటిలో ఒకే విధంగా ఉన్నాయి. జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్, 12,000 నిమిషాల నాన్-జియో లేదా ఆఫ్-నెట్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు లబిస్తాయి. ఈ రెండు ప్లాన్లు మొత్తం చెల్లుబాటు కాలానికి JioCinema, JioTV మరియు JioSaavn వంటి Jio యాప్ లకు యాక్సిస్ ను అందిస్తాయి.

ఈ ప్లాన్‌లలో ఏది బెటర్?
వినియోగదారుల నుండి అధిక మొత్తంలో రూ.4,999 వసూలు చేసిన తరువాత కూడా రిలయన్స్ జియో అపరిమిత ఆఫ్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందించడం లేదు. ఇది చాలా వరకు తమ వినియోగదారులను నిరాశపరుస్తుంది. రూ.2,121 ప్లాన్‌తో జియో అందిస్తున్న రోజువారీ డేటా పరిమితి గురించి మీరు బాధపడకపోతే రిలయన్స్ జియో నుండి వస్తున్న రూ.4,999 ప్లాన్‌కు ఎటువంటి అర్థం లేదు.


Click it and Unblock the Notifications








