Jio Rs.4999 Prepaid Plan: అధిక వాలిడిటీ గల ఒకే ఒక ప్లాన్

|

డిసెంబర్ నెలలో ప్రైవేట్ టెలికం కంపెనీలు టారిఫ్ యొక్క ధరలను పెంచిన తరువాత జియో అన్ని ప్లాన్‌ల విభాగాల్లోను తక్కువ సరసమైన ధరలను కలిగి ఉంది. ప్రస్తుతం ఎయిర్ టెల్, వొడాఫోన్ సంస్థలు తమ AGR డ్యూలను తీర్చడానికి వివిధ రకాల విభాగాలలో ధరలను పెంచాయి. రిలయన్స్ జియో కూడా వివిధ విభాగాల్లో ధరలను పెంచినప్పటికీ సరసమైన దరల వద్దనే గొప్ప ప్లాన్‌లను కలిగి ఉండి వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తున్నది.

జియో

జియో యొక్క తన ఒకప్పటి పాత ప్లాన్‌కు కొన్ని మార్పులను చేసి మళ్లీ వినియోగదారులకు అందిస్తున్నది. ఈ తరహాలోనే జియో తన పాత లాంగ్ టర్మ్ ప్లాన్‌ను మళ్లీ ఇప్పుడు తీసుకువచ్చింది. జియో తీసుకువచ్చిన కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్ ఏది? పోటీదారులలో ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్‌లతో ఇది ఎంతవరకు పోటీ పడగలదు? జియో సంస్థలో ఉన్న మిగతా లాంగ్ టర్మ్ ప్లాన్‌లు ఏవి? వంటి వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

BSNL అడ్వాన్స్ రెంటల్ ఆఫర్: ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా BSNL ఆఫర్స్BSNL అడ్వాన్స్ రెంటల్ ఆఫర్: ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా BSNL ఆఫర్స్

జియో రూ.4,999 లాంగ్ టర్మ్ ప్లాన్‌
 

జియో రూ.4,999 లాంగ్ టర్మ్ ప్లాన్‌

జియో సంస్థ విడుదల చేసే లాంగ్ టర్మ్ ప్లాన్‌లు సాధారణంగా అధిక ధరను కలిగి ఉంటాయి. ఇప్పుడు జియో విడుదల చేసిన కొత్త ప్లాన్ కూడా అదే కోవలోకి వచ్చింది. జియో అందిస్తున్న ఈ కొత్త ప్లాన్ యొక్క ధర అక్షరాలా రూ.4,999లు. మీరు విన్నది నిజమే అక్షరాలా రూ.5000లకు తక్కువ ఒక రూపాయి. జియో ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 350GB డేటాను అందిస్తుంది. పరిమిత కాలంలో 350GB డేటా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకు తగ్గించబడుతుంది. ఫోన్ కాల్స్ విషయానికి వస్తే జియో టు జియో అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ మరియు ఇతరులకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాల ప్రయోజనంను 360 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

 

 

WhatsAppలో చక్కర్లు కొడుతున్న కరోనావైరస్ చిట్కాలు!!! అస్సలు నమ్మకండి...WhatsAppలో చక్కర్లు కొడుతున్న కరోనావైరస్ చిట్కాలు!!! అస్సలు నమ్మకండి...

​అత్యధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్

​అత్యధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్

జియో అందించే ప్లాన్లలో అత్యధిక వ్యాలిడిటీని కలిగి ఉన్న ప్లాన్ ఇదే కావడం గమనార్హం. జియో యొక్క కొత్త ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 360 రోజులు. అధిక మొత్తంలో ధరను కలిగి ఉన్నపటికీ పూర్తి అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంను మాత్రం అందించడం లేదు. ఇతర నెట్‌వర్క్ లకు కాల్స్ చేయడానికి 12,000 నిమిషాల ప్రయోజనంను అందిస్తుంది. ఈ పరిమితి అయిపోయాక 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. జియో సంస్థ తన పోర్టుఫోలియోలో ఇంకా కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్నది.

 

 

Tata Sky క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి చిన్న చిట్కాTata Sky క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి చిన్న చిట్కా

జియో ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియో

జియో ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియో

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన వాటిలో రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు టారిఫ్ రివిజన్ తర్వాత ఇప్పుడు ఇతర రెండు టెల్కోలతో సమానంగా ఉన్నాయి. రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే రిలయన్స్ జియో యొక్క రూ.399 ప్లాన్ కూడా 1.5 జీబీ డైలీ డేటా బెనిఫిట్‌తో వస్తుంది. రిలయన్స్ జియో నుండి మరొక నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు రోజువారీ 1.5GB 4G డేటాను అందిస్తున్నాయి.

 

మొబైల్ టారిఫ్ పెంపు తరువాత లాభపడిన టెల్కో ఎవరు?మొబైల్ టారిఫ్ పెంపు తరువాత లాభపడిన టెల్కో ఎవరు?

జియో రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు రూ.199 నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ తన 28 రోజుల మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 42GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా జియో - టు -జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు నాన్-జియోలకు 1,000నిమిషాల FUP వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

 

 

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలుAirtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలు

 

 

జియో రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తున్న ప్లాన్‌లలో ఎక్కువగా జనాదరణ పొందిన వాటిలో రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ముందు వరుసలో ఉంది. ఈ ప్లాన్ అందిస్తూన్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మొత్తంగా 56 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటా, అపరిమిత జియో-టు- జియో వాయిస్ కాలింగ్, నాన్-జియోలకు 2,000నిమిషాలతో పాటుగా రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్ యొక్క మొత్తం 56 రోజుల చెల్లుబాటు కాలంలో 84GB డేటాను వినియోగదారులకు అందించబడుతుంది. ఇంతకుముందు ఇదే ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందించడానికి ఉపయోగించబడింది. కాని ఇప్పుడు దీని యొక్క చెల్లుబాటు కాలం 56 రోజులకు తగ్గించబడింది.

 

 

Airtel Digital TV: మల్టీ టీవీ ధరలను పెంచిన airtel,కొత్త ధరలు ఇవే!Airtel Digital TV: మల్టీ టీవీ ధరలను పెంచిన airtel,కొత్త ధరలు ఇవే!

జియో రూ.555 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.555 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో కొన్ని నెలల క్రితం ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ రీఛార్జిని 555 రూపాయల ధర వద్ద ప్రవేశపెట్టింది. అదే రూ.555ల ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100SMSలు, జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 3,000నిమిషాల నాన్-జియో కాలింగ్ ప్రయోజనాలను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

 

 

BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్

​జియో రూ.1299 ప్లాన్

​జియో రూ.1299 ప్లాన్

జియో యొక్క రూ.1,299 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా కేవలం 24GB డేటాను మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది జియో టు జియో అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ మరియు ఇతర నెట్‌వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాల ప్రయోజనంను అందిస్తారు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. డేటాను అధికంగా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ కరెక్టుగా సరిపోతుంది అని చెప్పవచ్చు.

 

 

New HD కనెక్షన్ ను తక్కువ ధరకు అందిస్తున్నది ఎవరో తెలుసా...New HD కనెక్షన్ ను తక్కువ ధరకు అందిస్తున్నది ఎవరో తెలుసా...

​జియో యొక్క రూ.2,121 ప్లాన్

​జియో యొక్క రూ.2,121 ప్లాన్

జియో తాజాగా ప్రవేశపెట్టిన లాంగ్ టర్మ్ ప్లాన్లలో రూ.2,121 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి రోజువారి 1.5GB డేటా ప్రయోజనంతో పాటు ఇతర నెట్‌వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాలు, రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

 

Tata Sky మల్టీ టీవీ కనెక్షన్ల మీద భారీగా మార్పులుTata Sky మల్టీ టీవీ కనెక్షన్ల మీద భారీగా మార్పులు

జియో వన్ ఇయర్ ప్లాన్

జియో వన్ ఇయర్ ప్లాన్

రిలయన్స్ జియో గతంలో తన లాంగ్ టర్మ్ ప్లాన్‌లలో 365 రోజుల వ్యాలిడిటీని అందించేది. కానీ ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని 336 రోజులకు తగ్గించింది. జియో సంస్థ ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్ల విషయంలో నెల అంటే 28 రోజులు మాత్రమే. దానికి తగ్గట్లే 28*12=336 కాబట్టి వార్షిక ప్లాన్ల వ్యాలిడిటీని 336 రోజులకు తగ్గించింది. ప్రస్తుతం జియోలో ఉన్న ప్లాన్లలో అత్యధిక వ్యాలిడిటీని అందించే ప్లాన్ రూ.4,999 ప్లాన్ మాత్రమే. అయితే జియో అందించే అన్ని ప్లాన్లతో జియో టీవీ, జియో సినిమా వంటి ప్రీమియం యాప్ లను ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Launched Rs 4,999 Prepaid Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X