జియోని కుదిపేస్తున్న రూ.149 అన్‌లిమిటెడ్ ప్లాన్

Written By:

ఇప్పుడు దేశంలో అన్నా దమ్ముళ్ల మధ్యనే టెల్కోల వార్ నడుస్తుందని చెప్పవచ్చు. జియోతో ముఖేష్ అంబాని దూసుకుపోతున్న నేపథ్యంలో అనిల్ అంబాని కూడా అన్న మీద పోటీకి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా జియోకి ధీటుగా సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల మదిని దోచుకుంటున్నారు. మరి కొత్తగా ఆర్ కామ్ ఇప్పుడు రూ. 149కే అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

జియో టార్గెట్‌గా కొత్త బ్రాండ్‌తో ఆర్‌కామ్, Aircel, MTS..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 149 కే అపరిమిత కాలింగ్ ప్లాన్‌

అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రూ. 149 కే అపరిమిత కాలింగ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

ఏ టెలికాం నెట్‌వర్క్‌కైనా

దేశవ్యాప్తంగా ఏ టెలికాం నెట్‌వర్క్‌కైనా, ఏ మొబైల్ నుంచైనా అపరిమిత కాలింగ్ టాక్ టైమ్ సద్వినియోగం చేసుకునేలా ఈ ప్లాన్ దోహదం చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2 జీ, 3 జీ, 4 జీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌లోని అన్ని నెట్‌వర్క్‌‌లకు

నెలకు రూ .149 చెల్లిస్తే 2 జీ, 3 జీ, 4 జీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌లోని అన్ని నెట్‌వర్క్‌‌లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు.

టార్గెట్‌

2 జీ, 3 జీ, 4 జీ హ్యాండ్‌సెట్ ఓనర్లను టార్గెట్‌గా చేసుకుని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా, వారిని ఆర్‌కామ్ నెట్‌వర్క్‌లోకి మరల్చడానికి ఈ ప్లాన్ దోహదం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

300 ఎంబీ డేటా

ఈ ప్లాన్‌పై 300 ఎంబీ డేటా కూడా వినియోగదారులకు లభిస్తుంది. భారత్‌లో లక్షల మంది 2 జీ హ్యాండ్‌సెట్ ఓనర్లు ఉన్నారని, వారందరు ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆర్‌కామ్ తెలిపింది.

అపరిమిత వాడక పద్ధతిలోకి

యూజర్లను యూనిట్ రేట్ చార్జింగ్ విధానం నుంచి సింగిల్ రీచార్జ్‌తో, అపరిమిత వాడక పద్ధతిలోకి టెలికాం మార్కెట్‌ను తీసుకురావడానికి తమ కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్ సహకరించనుందని ఆర్‌కామ్ కన్సూమర్ బిజినెస్ సీఈవో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కో-సీఈవో గుర్‌దీప్ సింగ్ చెప్పారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RCom unveils Rs 149 bucket plan offering unlimited voice calls with 300 MB of data Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot