జియో ఉచిత ఆఫర్‌ను ఎందుకు పొడిగించింది, షాకింగ్ కారణాలు ఇవే !

డిసెంబర్ తో జియో ఉచిత ఆఫర్ అయిపోతుందని టెల్కోలు సంబరపడుతున్న నేపథ్యంలో వారికి షాకిస్తూ జియో వెల్‌కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

By Hazarath
|

ఇప్పుడు దేశం మొత్తాన్ని ఊపేస్తున్న ఫీవర్ ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియో మాత్రమే. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు జియో గురించే చర్చ నడుస్తోంది. జియో ఉచిత ఆపర్లు దిగ్గజ టెల్కోలను ఒక్కసారిగా నష్టాల బాటలోకి నడిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జియో ఇప్పుడు మళ్లీ ఉచిత ఆపర్ నుమరో మూడు నెలల పాటు పొడిగించింది. మరి దీని వెనుక ఉన్న మర్మమేమిటో చాలామందికి తెలియదు. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో యూజర్లకి దిమ్మతిరిగే షాక్

టెల్కోలు సంబరపడుతున్న నేపథ్యంలో

టెల్కోలు సంబరపడుతున్న నేపథ్యంలో

డిసెంబర్ తో జియో ఉచిత ఆఫర్ అయిపోతుందని టెల్కోలు సంబరపడుతున్న నేపథ్యంలో వారికి షాకిస్తూ జియో వెల్‌కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

 జియో ఈ ఆఫర్‌ను పొడిగించడానికి కారణమేంటి

జియో ఈ ఆఫర్‌ను పొడిగించడానికి కారణమేంటి

అయితే అసలు జియో ఈ ఆఫర్‌ను పొడిగించడానికి కారణమేంటి? అన్ని నెలలు ఉచితంగా ఫ్రీ డేటా, ఫ్రీ కాలింగ్ సదుపాయాన్ని వినియోగదారులకు ఎలా అందించగలుగుతోంది? ప్రస్తుతం టెలికామ్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్ అంశంగా మారింది.

ఈ ఆఫర్‌ను పొడిగించడానికి ప్రధానంగా మూడు కారణాలు

ఈ ఆఫర్‌ను పొడిగించడానికి ప్రధానంగా మూడు కారణాలు

ముఖేష్ అంబానీ ఈ ఆఫర్‌ను పొడిగించడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణాలతోనే జియోని మూడు నెలల పాటు మీకు ఉచితంగా అందించేందుకు అంబాని రెడీ అయినట్లు తెలుస్తోంది.

 100 మిలియన్ల యూజర్లే తమ లక్ష్యమని

100 మిలియన్ల యూజర్లే తమ లక్ష్యమని

జియో ఆఫర్స్‌ను ప్రకటించిన రోజే ముఖేష్ అంబానీ చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఇది. 100 మిలియన్ల యూజర్లే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం జియో 25 మిలియన్ల మార్క్‌ను దాటింది. ఇప్పటివరకూ 16వేల టెరాబైట్స్ డేటాను వినియోగదారులు వాడుకున్నారు.

టార్గెట్ చేరుకోవాలంటే

టార్గెట్ చేరుకోవాలంటే

ఇంకా టార్గెట్ చేరుకోవాలంటే కనీసం రెండు, మూడు నెలలు పొడిగించక తప్పని పరిస్థితి. ఇదో ప్రముఖ కారణంగా టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జియో ఇంటర్‌నెట్ సేవల పట్ల చాలామంది

జియో ఇంటర్‌నెట్ సేవల పట్ల చాలామంది

రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా ఫ్రీ డేటా, కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే జియో ఇంటర్‌నెట్ సేవల పట్ల చాలామంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు జియో యాజమాన్యం శ్రీకారం చుట్టింది.

కాల్స్ పట్ల తీవ్ర నిరాశకు గురైనట్లు

కాల్స్ పట్ల తీవ్ర నిరాశకు గురైనట్లు

ఇతర టెలికామ్ కంపెనీలు కాల్ డ్రాప్స్‌తో అవరోధం కలిగించాయని, కాల్స్ పట్ల తీవ్ర నిరాశకు గురైనట్లు జియోకు అనేక ఫిర్యాదులు అందాయి.

ఫ్రీ కాలింగ్ సేవలను

ఫ్రీ కాలింగ్ సేవలను

దీంతో ఫ్రీ కాలింగ్ సేవలను మెరుగుపరచడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆఫర్‌ను పొడిగించిందని చెబుతున్నారు. యూజర్ల అసంతృప్తిని కొంతైనా తగ్గించడానికి జియో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఎలాంటి ముప్పు లేదని

ఎలాంటి ముప్పు లేదని

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌ వల్ల ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేయడంతో జియోకు అడ్డంకులు తొలగాయి.

 జియోపై ఫిర్యాదు చేసినప్పటికీ

జియోపై ఫిర్యాదు చేసినప్పటికీ

ఇతర కంపెనీలు జియోపై ఫిర్యాదు చేసినప్పటికీ ట్రాయ్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా రిలయన్స్ జియో వినియోగదారులు చాలా తక్కువ మందే ఉన్నారని ట్రాయ్ ప్రకటించడం మరో కొసమెరుపు. ఈ ప్రకటనతో ఆఫర్‌ను పొడిగించినా తమకెలాంటి ఇబ్బంది లేదని నియంత్రణ మండలి చెప్పకనే చెప్పేసింది.

మూడు నెలలు జియోని మీరు ఉచితంగా

మూడు నెలలు జియోని మీరు ఉచితంగా

సో..ఈ కారణాలతో ఇంకో మూడు నెలలు జియోని మీరు ఉచితంగా వాడుకొని ఎంజాయ్ చేయవచ్చు మరి.

Best Mobiles in India

English summary
Jio Welcome Offer Validity Extended till March 2017 Reasons you didnt know read more at gizbot telugu news

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X