జియో యూజర్లకి దిమ్మతిరిగే షాక్

జియో యూజర్లకు మళ్లీ షాకిచ్చింది. జియో ఉచిత సేవలు డిసెంబర్ 3తోనే అంతమవుతాయని తెలిపింది

By Hazarath
|

అత్యంత తక్కువ కాలంలో ఇండియాలో అందరి మనసులు దోచుకున్న టెలికం ఏదైనా ఉందంటే అది ఒక్క రిలయన్స్ జియో మాత్రమే. ఉచిత డేటా ఆఫర్ తో కష్టమర్లను తన వైపుకు తిప్పుకుని అన్ని టెల్కోలకు భారీ షాక్ ఇచ్చింది. జియో దెబ్బకు టెల్కోలు ఇప్పుడు కోట్ల నష్టాల్లో మునిగిపోయాయి. అయితే సంవత్సరం చివరి వరకు ఉచిత ఆఫర్ తో ఎంజాయ్ చేద్దామన్న వారికి ఇప్పుడు నిరాశే ఎదురయింది.

ఫోన్ నంబర్స్, కాలిక్యులేటర్ నంబర్స్ ఎదురెదురుగా ఎందుకు ఉంటాయి ?

కటాఫ్ తేదీ డిసెంబరు 3

కటాఫ్ తేదీ డిసెంబరు 3

దేశవ్యాప్తంగా 4జీ డేటా, వాయిస్ కాల్స్‌ను తన కష్టమర్ల అందరికీ ఉచితంగా ఇస్తున్న రిలయన్స్ జియో ఈ ఉచిత సేవలకు కటాఫ్ తేదీగా డిసెంబరు 3ను నిర్ణయించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో సిమ్ అక్కర్లేదని భావించేవారు

జియో సిమ్ అక్కర్లేదని భావించేవారు

రిలయన్స్ జియో సేవలకు ఛార్జీలు చెల్లించకూడదని, జియో సిమ్ అక్కర్లేదని భావించేవారు డిసెంబరు 3లోగా ఆ విషయాన్ని జియో స్టోర్లలో తెలియజేసి, అధికారికంగా సిమ్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది.

సిమ్‌ను సరెండర్ చేయని పక్షంలో
 

సిమ్‌ను సరెండర్ చేయని పక్షంలో

ఒకవేళ ఎవరైనా సిమ్‌ను సరెండర్ చేయని పక్షంలో... వారికి డిసెంబరు 31వరకూ ఉచిత సేవలు కొనసాగుతాయి. ఆ తరువాత మాత్రం నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉచిత సేవలు 90 రోజులకే

ఉచిత సేవలు 90 రోజులకే

నిబంధనల మేరకు జియో ఉచిత సేవలు 90 రోజులకే పరిమితమని, ఇవి డిసెంబర్ 3తో ముగిసిపోతాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జియో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

తర్వాత టారిఫ్ ప్లాన్లు వేసుకోవాల్సిందే

తర్వాత టారిఫ్ ప్లాన్లు వేసుకోవాల్సిందే

జియో ఉచిత సేవలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4 నుంచి అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 3తో దీని గడువు తీరిపోతుంది. ఆ తర్వాత టారిఫ్ ప్లాన్లు వేసుకోవాల్సిందేనని జియో సైతం స్పష్టం చేసింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నూతన టారిఫ్ ప్లాన్ల మేరకు సేవలు

నూతన టారిఫ్ ప్లాన్ల మేరకు సేవలు

జియో ఉచిత కాల్స్, డేటా ప్రయోజనాలు కస్టమర్లందరికీ డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉంటాయని, ఆ లోపు కనెక్షన్ తీసుకోని వారు ఆ తర్వాత నుంచి అందుబాటులో ఉన్న నూతన టారిఫ్ ప్లాన్ల మేరకు సేవలు పొందాల్సి ఉంటుందని జియో అధికారులు చెబుతున్నారు.

కేవలం డేటా చార్జీలు

కేవలం డేటా చార్జీలు

జియో కస్టమర్లకు జీవితకాలం పాటు కాల్స్ ఉచితంగానే అందిస్తామని, కేవలం డేటా చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వారు ప్రకటించారు.

ఉచిత కాల్స్ సేవలు డిసెంబర్ 31 తర్వాత అందుతాయా

ఉచిత కాల్స్ సేవలు డిసెంబర్ 31 తర్వాత అందుతాయా

ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ఉచిత కాల్స్ సేవలు డిసెంబర్ 31 తర్వాత అందుతాయా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే డిసెంబర్ 4 తర్వాత పొందే సేవలకు వసూలు చేసే ఛార్జీలెంతన్నది కంపెనీ ఇంకా పేర్కొనలేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్‌చిట్

రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్‌చిట్

ఇదిలా ఉంటే రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్‌చిట్ ఇచ్చింది. జియో టెలికం సేవల టారిఫ్ ప్లాన్లు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన లేదని ప్రత్యర్థి కంపెనీలకు తెలియజేసింది.

టెలికం సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు

టెలికం సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు

జియో ఉచిత కాల్స్ సేవలు నిబంధలకు విరుద్ధమంటూ టెలికం సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా స్పష్టతనిచ్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో ప్రత్యర్థులపై తాజాగా ఆరోపణలు

జియో ప్రత్యర్థులపై తాజాగా ఆరోపణలు

కాగా, టెలికం కంపెనీలు పోటీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ రిలయన్స్ జియో ప్రత్యర్థులపై తాజాగా ఆరోపణలుకు దిగింది.

కాల్స్‌లో 75 శాతం ఫెయిల్

కాల్స్‌లో 75 శాతం ఫెయిల్

తమ నెట్‌వర్క్ నుంచి వెళుతున్న కాల్స్‌లో 75 శాతం ఫెయిల్ అవుతున్నాయని పేర్కొంది. తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య అని తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio Welcome Offer validity is not expiring on December 3 Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X