జియో యూజర్లకు దిమ్మతిరిగే షాక్: వారి సీక్రెట్స్ విదేశాలకు..

Written By:

రిలయన్స్ జియో యూజర్లకు ఈ విషయం గురించి తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావడం ఖాయం. అత్యంత తక్కువ ధరలకే ఉచిత కాల్స్, ఫ్రీ డేటా అంటూ కష్టమర్లను తన వైపు తిప్పుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు కష్టమర్ల అందరి కాల్ డేటాను ఫారిన్ కంపెనీలకు అందిస్తుందని, వారి నుంచి డబ్బులు దండుకుంటుందని ఓ హ్యాకర్స్ గ్రూపు వివరాలను బయటపెట్టింది. ఇది చాలా డేంజర్ తో కూడుకున్న వ్యవహారమని కూడా వారు హెచ్చరిస్తున్నారు.

అన్నాదమ్ముళ్లు ఏకమయ్యారు..జియోతో ఏం చేయబోతున్నారు ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తమ యూజర్స్ లొకేషన్ ను

రిలయన్స్ జియో తమ యూజర్స్ లొకేషన్ ను ఏడాదిగా చైనాకు చేరవేస్తోందట.. దీంతోపాటు జియో యూజర్ల కాల్ సమాచారాన్ని ఈ సంస్థ రహస్యంగా విదేశాలకు చేరవేస్తోందని తన టుంబ్లర్ ఖాతాలో పేర్కొంది.

రిలయన్స్ జియో కష్టమర్ల కాల్ డేటాను

దీంతో పాటు రిలయన్స్ జియో కష్టమర్ల కాల్ డేటాను సింగపూర్ అలాగే యూఎస్ లోని పలు యాడ్ నెట్‌వర్క్‌లకు విక్రయిస్తుందని హాక్టివిస్ట్ గ్రూప్ అనానిమస్ అనే సంస్థ వెల్లడించింది.

మై జియో, జియో డీలర్ యాప్‌ల ద్వారా

జియో వినియోగదారులు తప్పక వాడే మై జియో, జియో డీలర్ యాప్‌ల ద్వారా వినియోగదారుల కాల్ డేటాను వారి అనుమతి లేకుండా యాడ్ నెట్‌వర్క్‌లకు విక్రయించి జియో వారి నుంచి డబ్బు తీసుకుంటుందని ఆ హ్యాకింగ్ గ్రూప్ చెబుతోంది.

ఆధారాలతో సహా ముందుకు

ఈ విషయాన్ని వారు ఆధారాలతో సహా ముందుకు తెస్తున్నారు. జియో ఏ విధంగా కాల్ డేటాను రిమోట్ సర్వర్లకు చేరవేస్తుందో అనే విషయాలను బహిర్గతం చేస్తున్నారు.

జియో తన యాప్స్ ని రూపొందించడానికి

దీంతో పాటు జియో తన యాప్స్ ని రూపొందించడానికి థర్డ్ పార్టీ సాప్ట్‌వేర్ డెవలప్ మెంట్ కిట్స్ ఉపయోగిస్తున్నదని ఇది పరోక్షంగా వినియోగదారుల సెక్యూరిటీకి భంగం కలిగించడమేనని వారు చెబుతున్నారు.

ఈ గ్రూప్ ఓ వీడియో లింక్ ను కూడా

దీనికి సంబంధించి ఈ గ్రూప్ ఓ వీడియో లింక్ ను కూడా పోస్ట్ చేసింది. వాడకందార్ల మై జియో, జియో డయలర్ యాప్స్ ను కొందరు డౌన్ లోడ్ చేసుకుని ఇలా మీ సీక్రెట్స్ ను విదేశాలకు చేరవేస్తున్నారని ఆ వీడియోలో ఆరోపించింది.

ఈ తాజా ఆరోపణలను రిలయెన్స్

అయితే ఈ తాజా ఆరోపణలను రిలయెన్స్ ఖండించినట్లుగా తెలుస్తోంది. అలాంటిదేమి లేదని కొట్టి పారేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమో కాదో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Still Sharing Your Call Information With Foreign Countries, Warns Anonymous India read more Telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot