టెలికం కంపెనీలకు షాక్..ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

Written By:

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..అందులో 4జీ నెట్ వర్క్ వాడుతున్నారా..అయితే మీకు రిలయన్స్ బంఫరాఆపర్ ఇస్తోంది. టెలికాం మార్కెట్లో రిలయన్స్ మరో సంచలనానికి తెరలేపేందుకు రెడీ అయింది. కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు 4జీ కష్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు.90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు.అతి త్వరలో ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని చెబుతున్నారు. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ ఈ విషయంపై టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్‌తో సమావేశమయ్యారు. తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియో 4జీ ఆవిష్కరణ ప్రణాళికపై వీరిరువురు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

టెలికం ఆపరేటర్లు తమ ట్రయల్ సర్వీసులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆ భేటీలో ముకేష్ అంబాని చెప్పినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో జియో సర్వీసులు త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

మరోవైపు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సహా పలు ఇతర టెలికం కంపెనీలతో కూడిన సీవోఏఐ ఇటీవల డాట్‌కి ఒక ఉత్తరం రాస్తూ... జియో నిబంధనలకు విరుద్ధంగా తన 15 లక్షల మంది యూజర్లకు ట్రయల్స్ చాటున పూర్తి స్థాయి సేవలను అందిస్తోందని ఆరోపించింది.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

ఈప్రివ్యూ ఆఫర్ ను రిలయన్స్ జియో ఆరు నెలల క్రితం ప్రారంభించింది. దీని కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

అయితే తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు దీనిని అమలు చేసింది. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

ఇప్పుడు దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ఇప్పటి వరకు ఏ టెలికం సంస్థా ఇవ్వనటువంటి అత్యుత్తమ సీయూజీ ప్యాక్‌ను ఇచ్చేందుకు హామీ కూడా ఇచ్చింది. అలాగే లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను అమలు చేస్తోంది.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

దీనిని శామ్‌సంగ్, హెచ్‌పీ వినియోగదారులకు విస్తరించింది. తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీదైనా సరే. ప్రతి ఒక్క కస్టమర్‌కు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా అధీకృత స్టోర్‌ను సంప్రదించి ఉచిత సిమ్‌ను పొందవచ్చు.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

ఇదిలా ఉంటే ప్రివ్యూ ఆఫర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 25 లక్షలపైచిలుకు కస్టమర్లను జియో సొంతం చేసుకుంది. వీరిలో ఒకట్రెండు లక్షలు మినహా మిగిలినవారంతా లైఫ్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లే.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

రూ.3 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లైఫ్ బ్రాండ్ ప్రకటించడం దీనికితోడు ప్రివ్యూ ఆఫర్ ఉండడంతో కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్తోంది.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

మరోవైపు జియోఫై వైఫై హాట్ స్పాట్‌కు ఏకంగా 31 ఉపకరణాల ను అనుసంధానించవచ్చు. వైఫై ఫీచర్ ఉన్న ప్రతి ఉపకరణంలో 4జీ స్పీడ్ ఎంజాయ్ చేయవచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ గ్యాడ్జెట్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ధర రూ.2,899. దీనిపైనా ప్రివ్యూ ఆఫర్ ఉంది.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

కస్టమర్ల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈని సపోర్ట్ చేయకపోయినా సరే. జియో జాయిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దీనిద్వారా 2జీ, 3జీ ఫోన్లలో హెచ్‌డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ సౌకర్యం పొందవచ్చు.

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 

ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించక ముందే తీసుకున్న తాజా నిర్ణయం టెలికం మార్కెట్‌ను ఎలా షేక్ చేస్తుందో ముందు ముందు చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Jio Sim with unlimited preview offer for LG and Samsung smartphone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot