స్పీడ్‌లో దుమ్మురేపిన జియో, Airtelకి పెద్ద షాక్..

Written By:

జియో స్పీడ్‌లో దుమ్మురేపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను తెలుసుకునేందుకు మైస్పీడ్ యాప్‌ను గతంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా యూజర్లు చెక్ చేస్తున్న మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ వివరాలను సేకరించి ట్రాయ్ ఎప్పటికప్పుడు టాప్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తున్న కంపెనీల వివరాలను తెలియజేస్తున్నది.ఈ వివరాల ప్రకారం దేశంలో రిలయన్స్‌కు చెందిన జియో 4జీ మొబైల్ ఇంటర్నెట్ జూన్ మాసానికి టాప్ ప్లేస్‌లో నిలిచింది.

3జిబి ర్యామ్‌తో శాంసంగ్ నుంచి J5 Pro

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సగటున 18.8 ఎంబీపీఎస్

దేశంలో జియో 4జీ ద్వారా యూజర్లకు అందుతున్న మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ సగటున 18.8 ఎంబీపీఎస్ ఉందని ట్రాయ్ వెల్లడించింది.

జియో తరువాత వొడాఫోన్

ఇక జియో తరువాత రెండో స్థానంలో 12.29 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌తో వొడాఫోన్ నిలిచింది.

తరువాత స్థానాల్లో

ఆ తరువాత స్థానాల్లో వరుసగా ఐడియా (11.68 ఎంబీపీఎస్), ఎయిర్‌టెల్ (8.23 ఎంబీపీఎస్)లు నిలవడం గమనార్హం.

ఎయిర్‌టెల్

అయితే ఎయిర్‌టెల్ సంస్థ ఇండియాలోనే ఫాస్టెస్ట్ 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ట్రాయ్‌కు ఫిర్యాదు

దీనిపై గతంలో జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది కూడా. ఇక ముందు ముందు 4జీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లలో ఏయే టెలికాం కంపెనీలు టాప్ స్థానాల్లో నిలుస్తాయో చూడాలి..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio tops 4G mobile speed chart in June: TRAI Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot