బెజవాడలో రిలయన్స్ జియో ఫోన్

Written By:

తన 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌‍తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించబోతోన్న రిలియన్స్ జియో, 'LYF' బ్రాండ్‌తో విడుదల చేయబోతోన్న తక్కువ ధర 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మొదటి హోర్డింగ్‌ను విడుదల చేసింది. నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో నిర్వహించిన అమరావతి మారధాన్ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్‌గా జియో వ్యవహరించిన విషయం తెలిసిందే.

బెజవాడలో రిలయన్స్ జియో ఫోన్

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌లో భాగంగా తన 'LYF' బ్రాండ్ ఫోన్‌లను రియలన్స్ జియో ప్రదర్శించింది. డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చే 'LYF' మొబైల్ ఫోన్‌‍లు జియో సిమ్‌తో థర్డ్-పార్టీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

మార్కెట్లో హల్‌‌చల్ చేస్తున్న 4జీబి ర్యామ్‌ ఫోన్‌లు ఇవే

త్వరలో కస్టమర్ మార్కెట్లోకి రాబోతున్న ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌లలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వై-ఫై, హైడెఫినిషన్ వాయిస్ ఇంకా వీడియో కాలింగ్‌ను ఆస్వాదింవచ్చు.

సంక్రాంతి బరిలో 20 బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌లు

డిసెంబర్ 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఇంకా చైర్మన్ ధీరూభాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా తొలత జియో సేవలను రిలయన్స్ గ్రూప్ సిబ్బందికి సంస్థ అందించిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొత్త ఆవిష్కరణలో వేడెక్కుతోంది. అయితే, 3జీ ఫోన్లు పూర్తి స్థాయిలో కష్టమర్ల చేతుల్లో పడకుండానే 4జీ టెక్నాలజీ విస్తరిస్తుండటం కొంత విడ్డూరంగా ఉంది. ఏదేమైనప్పటికి 4జీ ఫోన్లతో భారత్ మొబైల్ పరిశ్రమ రోజు రోజుకు వేడెక్కిపోతోంది.

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఇండియా చైనా పోటీ పడుతూ ముందుకు దూసుకువెళుతున్నాయి. చైనా 4జీ ఫోన్లకు ఇండియా డంపింగ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడి కంపెనీలకు సవాల్ మొదలైంది.

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

ఇండియన్ కంపెనీలు చైనా ఫోన్లకు ధీటుగా తమ ఫోన్‌లను మార్కెట్‌లోకి దించుతున్నాయి. 

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

శక్తివంతమైన స్పెక్స్‌తో భారత్ కంపెనీలకు ధీటుగా ఫోన్‌లను ఆఫర్ చేస్తోన్న చైనా కంపెనీలు కస్టమర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

భారత్ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చైనా శాసిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇందుకు ఉదాహరణ చైనా కంపెనీలు భారత్‌లో 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండటమే.

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

చైనా 4జీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు భారత్‌లో పాగా వేసేందుకు సిద్ధమైయ్యాయి. ఇండియా బ్రాండ్లకంటే ఎక్కువ అమ్మాకాలను సాధిస్తామనే ధీమాతో చైనా కంపెనీలు ఉన్నాయి. మరి ఇండియా దానికి ధీటుగా అమ్మకాలు సాగిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

పతాక స్థాయికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల యుద్ధం

2015లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ విక్రయాల వృద్ధిలో భారత్ మార్కెట్‌దే ప్రధాన పాత్ర అని జీఎఫ్ కె కెవిన్ వాల్ష్ వెల్లడించారు కూడా.2016లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఫీచర్ ఫోన్లను మించిపోతుందని విశ్లషకులు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio unveils low-cost 4G mobile phones LYF. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot