Home
News

జియో& ఎయిర్టెల్ లను వెనక్కి నెట్టిన Vi టెల్కో!! ఎందులోనో తెలుసా??

వోడాఫోన్ ఐడియా యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ల సమర్పణలు ప్రస్తుతం ఇతర టెల్కో యొక్క ఆఫర్ల కంటే మెరుగ్గా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. Vi టెల్కో కోల్పోయిన తన వినియోగదారులను తిరిగి పొందడం కోసం మరియు ఉన్న వారి కోసం ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా కొన్ని ఉత్తేజకరమైన మరియు అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడుతున్నది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 2021 నెలలో కొత్త చందాదారులను చేర్చడానికి సహాయపడింది.

84 రోజుల వాలిడిటీ ప్లాన్

మీడియం-టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్న ప్రీపెయిడ్ వినియోగదారులలో ఎక్కువ మంది 84 రోజుల వాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటున్నారు. ఇది టెల్కోస్ అందించే ప్రయోజనాలను సమానంగా యూజర్లు ఖర్చు చేసే మొత్తానికి విలువను కలిగి ఉంటుంది. రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ యొక్క 84 రోజుల వాలిడిటీ ప్లాన్లకు మించిన ప్రయోజనాలతో వొడాఫోన్ ఐడియా (Vi) అందించే అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

వోడాఫోన్ ఐడియా 84 రోజుల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా 84 రోజుల వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటుతో అనేక ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో అన్నిటికన్నా మెరుగ్గా ఉన్నది రూ.801 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. టెల్కో నుండి లభించే ఈ ప్లాన్ Vi పరిశ్రమకు ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది. ఇది ఇతర టెల్కోస్ కంటే మెరుగైన ప్రయోజనాలతో వస్తుంది. vi యొక్క పోర్టుపోలియోలో రూ.801 ప్లాన్‌ను కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారులకు హై-ఎండ్ ఓవర్-ది-టాప్ (OTT) సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలతో అందించే సమర్పణగా ఈ ప్లాన్ ను తీసుకువచ్చారు. రూ.801 ధర వద్ద లభించే ప్లాన్‌తో వినియోగదారులు 3GB రోజువారీ డేటాతో పాటుగా అదనంగా 48GB బోనస్‌ డేటాను కూడా పొందుతారు. కాబట్టి ఈ ప్లాన్‌తో యూజర్లు మొత్తంగా 300GB డేటాను పొందుతారు.

OTT ప్రయోజనం

వినియోగదారులకు 84రోజుల వాలిడిటీతో 300GB డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్న అధిక-నాణ్యత 4G నెట్‌వర్క్ ఉన్న టెలికాం ఆపరేటర్లు దేశంలో మరొకరు లేరు. ఇంకా ఈ ప్లాన్ మొత్తం 84 రోజుల వాలిడిటీలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్‌లో లభించే OTT ప్రయోజనం విషయానికి వస్తే డిస్నీ + హాట్‌స్టార్ VIP ఒక సంవత్సరంకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌కు ఒక సంవత్సరానికి చందాను పొందాలంటే సాధారణంగా రూ.399 ఖర్చు అవుతుంది. వినియోగదారులు సంస్థ నుండి ‘బింగే ఆల్ నైట్' మరియు ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌తో పాటు Vi మూవీస్ & టీవీ యొక్క అదనపు OTT ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

బింగే ఆల్ నైట్ ఆఫర్

వోడాఫోన్ ఐడియా(Vi) అందించే ‘బింగే ఆల్ నైట్' ఆఫర్ అనేది వినియోగదారులకు ప్రతిరోజూ ఉదయం 12am నుంచి ఉదయం 6am గంటల మధ్య తమకు కావలసినంత డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది సాధారణంగా ప్లాన్ తో వినియోగదారుడు పొందే సరసమైన-వినియోగ-విధానం (FUP) డేటాను ప్రభావితం చేయదు. మరోవైపు ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ లో భాగంగా ఒక వారంలో ఉపయోగించని డేటాను సేకరించి వీకెండ్ రోజున ఇంటి వద్ద ఉండి వారి వినోద అవసరాలను తీర్చడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Vi vs జియో vs ఎయిర్టెల్

Vi vs జియో vs ఎయిర్టెల్

84 రోజుల వాలిడిటీ కాలానికి 3GB రోజువారీ డేటాతో రిలయన్స్ జియో 999 రూపాయల ధర వద్ద ఒక ప్లాన్ ను అందిస్తుంది. అయితే ఎయిర్టెల్ టెల్కో అటువంటి ప్లాన్ ను ఏది కూడా ఇవ్వదు. Jio యొక్క ప్లాన్ ఎటువంటి బోనస్ డేటా లేదా OTT ప్రయోజనాలు లేదా ‘బింగే ఆల్ నైట్' లేదా ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' వంటి ఆఫర్‌లతో రాదు. Vi యొక్క 3GB రోజువారీ డేటా ప్లాన్ జియో యొక్క 84 రోజుల ప్లాన్ కంటే చౌకైనది. అంతే కాక ఒక టన్ను అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌లో Vi ఇతర టెల్కోల కంటే చాలా మెరుగ్గా ఉంది.

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi:Vodafone Idea 84 Days Validity Plan Offers More Benefits Compared Others
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X