రిలయన్స్ జియో vs బీఎస్ఎన్ఎల్:పోల్చి చూస్తే జియోకి షాక్

Written By:

గత కొద్ది రోజుల నుంచి మార్కెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది జియోనే.. అయితే ఇప్పుడు ఆ జియోకే షాక్ ఇస్తూ రూపాయికే 1 జిబి డేటా అంటూ బీఎస్ఎన్ఎల్ సంచలన ప్రకటన చేసి జియోకు షాకిచ్చింది. ప్రభుత్వ రంగ దిగ్గజం 249 రూపాయల అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ తో ఇప్పుడు జియోకే చుక్కలు చూపిస్తోంది. వాయిస్ కాల్స్ ప్రీ అంటూ జియో చేసిన ప్రకటన మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తగా ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటనతో షాక్ కు గురవుతున్నారు..రెండు ప్లాన్ల మధ్య తేడాలను ఓ సారి పరిశీలిద్దాం.

అరగంట నీళ్లలో ఉంచినా చెక్కు చెదరని ఫోన్..ధర రూ. 7వేలే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

జియో చిన్న ప్లాన్ ప్ర‌కారం ఒక రోజు వ్య‌వ‌ధితో 100ఎంబీ డేటా ఆఫ‌ర్ చేస్తోంది. దానికి 19 రూపాయ‌లు వ‌సూల్ చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం 110 ఎంబీని కేవ‌ల 17 రూపాయ‌ల‌కు అంటే జియో క‌న్నా అద‌న‌పు డేటాను దానిక‌న్నా త‌క్కువ‌కే ఇస్తోంది.

#2

జియో 149 రూ.ల ప్లాన్ ప్ర‌కారం 300 ఎంబీ డేటా ఒక నెల వినియోగం కోసం వ‌స్తుంది. అదే ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కేవ‌లం 109 రూ.ల‌కే అందిస్తుండం విశేషం.

#3

జియో 499రూ.ల ప్లాన్ ప్ర‌కారం ఒక నెల వ్య‌వ‌ధికి 4 జీబీ డేటా వ‌స్తుంది. అదే స‌మ‌యంలో బీఎస్ఎన్ఎల్ 10జీబీని కేవ‌లం 549రూ.ల‌కే అందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ లో 156రూ.ల‌కే 2జీబీ కూడా ఉంది.

#4

రిల‌యెన్స్ 10జీబీ 999రూ.ల‌కు అందిస్తోంది. కానీ బీఎస్ఎన్ఎల్ లో అదే ప్లాన్ ఖ‌రీదు 549రూ.లు కావ‌డం గ‌మ‌నించాల్సిందే. అంతేగాకుండా 1049రూ.ల‌కే అప‌రిమిత‌మైన అన్ లిమిటెడ్ డేగా ఆఫ‌ర్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

#5

జియో లో అతిపెద్ద ప్లాన్ 4999రూ.లు. దానిద్వారా 75 జీబీ డేటా మూడు నెల‌ల వినియోగానికి ల‌భిస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్ 3జీ ప్లాన్ 3 నెల‌ల‌కు 3297 రూ.లు మాత్ర‌మే. అది కూడా కాకుండా అది అప‌రిమిత డేటాతో కావ‌డం విశేషం.

#6

ఇవి కొన్ని ప్లాన్లు మాత్రమే.. రాత్రి సమయంలో ఉచిత డౌన్ లోడ్ అలాగే మరికొన్ని ఆఫర్లు బిఎసఎన్ఎల్ ప్రవేశపెట్టింది..జియో ఉచితంతో దూసుకువస్తే దాని వెనుక మతలబు ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

#6

జియో ఫీవర్ ముదురుతున్న వేళ దాన్ని ఆపేందుకు అన్ని టెల్కోలు ఇప్పుడు భారీగానే కసరత్తు చేస్తున్నాయి. ఆపర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ వరుసలో అందర్నీ షాక్ లో ముంచెత్తుతూ బిఎస్ఎన్ఎల్ రూపాయికే జిబి అంటూ ముందుకు దూసుకువచ్చింది. మరి ముందు ముందు కంపెనీలు ఇంకా ఏ ఆఫర్లతో వస్తాయో చూూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write reliance-jio-vs-bsnl-unlimited-bb249-state-run-carrier-offers-broadband-re-1-beat-jios-offer
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot