Jio vs BSNL vs Airtel: 3GB రోజువారీ డేటా ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే...
ఇండియా యొక్క టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఏ మూర్తన ప్రవేశించిందో ఏమో అప్పటి నుంచి మొబైల్ డేటా వినియోగం భారీగా పెరిగింది. ఇతర టెలికాం ఆపరేటర్లు జియోను ఎదురుకోవడానికి వారి యొక్క ధరల నమూనాను పూర్తిగా మార్చారు. దీని ఫలితంగా ప్రపంచంలో మొబైల్ డేటాను అధికంగా వినియోగించే వారిలో భారతదేశం మొదటి స్థానానికి చేరుకుంది. ఈ రోజు ప్రతి టెలికాం ఆపరేటర్ తమ వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రయోజనాలతో పలు రకాల ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. ప్రస్తుత కరోనా సమయంలో చాలా మంది వినియోగదారులు 3GB రోజువారీ డేటాను అందించే ప్లాన్ లను ఇష్టపడుతున్నారు. 3GB రోజువారీ డేటాను అందించే ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
రిలయన్స్ జియో యొక్క రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది రూ .349 ధర వద్ద లభించే జియో ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలు మరియు రూ.401 ప్లాన్ ప్రయోజనాలు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ ప్లాన్ లో ఒక సంవత్సరం వాలిడిటీతో డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క ప్రయోజనం అదనంగా లభించడంతో పాటుగా వినియోగదారులకు 6GB బోనస్ డేటాను కూడా అందిస్తుంది. వాస్తవానికి వినియోగదారుడు 3GB రోజువారీ డేటా, అపరిమిత జియో టు జియో కాలింగ్‌తో పాటు, నాన్-జియో కాల్ చేయడానికి 1,000 FUP నిమిషాలు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత కాంప్లిమెంటరీ సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్టెల్ వినియోగదారులు ప్రస్తుతం రోజుకు 3GB డేటాను అందించే ఉత్తమమైన ప్లాన్ లో ఇది ఒకటి. ఇది 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB రోజువారీ డేటాను మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులకు ఎయిర్టెల్ థాంక్స్ ప్రీమియం, ఉచిత హెలొటూన్స్, వింక్ మ్యూజిక్, సంవత్సరం షా అకాడమీ ఉచిత ఆన్లైన్ కోర్సు మరియు ఫాస్టాగ్ లావాదేవీలపై రూ.150 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తాయి.

బిఎస్ఎన్ఎల్ రూ.247 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ రూ.247 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ (రోజుకు 250 FUP నిమిషాలు) తో పాటు 3GB రోజువారీ డేటాను మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే BSNL యొక్క STV_247 ప్లాన్‌లో ఎటువంటి అదనపు ప్రయోజనాలు లేవు. అదనపు ప్రయోజనాలు లేనప్పటికీ 3GB రోజువారీ డేటా ప్లాన్లతో పోలిస్తే అదే చెల్లుబాటుతో ఇతర టెల్కోస్ అందించే వాటితో పోలిస్తే ఇది చాలా చౌకగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








