Jio Vs Vi జియో, వోడాఫోన్ ఐడియాల్లో ఎవరు బెస్ట్ జియోహాట్‌స్టార్ ప్లాన్‌లను అందిస్తున్నారు?
క్రికెట్ ఫ్యాన్స్‌కు జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫాం బెస్ట్ ఆప్షన్ గా ఉంది. తక్కువ ధరలో నచ్చిన క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో కొన్నింటిపై జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను (Jiohotstar) అందిస్తున్నాయి. ఇటీవలే డిస్ని + హాట్‌స్టార్ మరియు జియో సినిమా... కొత్తగా ఈ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాయి. జియో, వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు ఈ కొత్త ఓటీటీ కోసం ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లను కలిగి ఉన్నాయి. ఎవరు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తున్నారో చూద్దాం.
జియో రూ.195 ప్లాన్ :
జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తో జియో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. జియో రూ.195 క్రికెట్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా మూడు నెలలపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతోపాటు 15GB 4G / 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Jio Rs195 Recharge Plan) భాగంగా మొబైల్ లో HD రిజల్యూషన్ లో లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.
జియో రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs949 Prepaid Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 2GB 4G డేటాను రోజువారీ పొందవచ్చు. మరియు 5G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో భాగంగా మూడు నెలల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. క్రికెట్ సహా ఇతర కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. జియోలో ఈ రూ.949 ప్లాన్ మాత్రమే కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలు సహా OTT సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది.
* మరో ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) కూడా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తో రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. Vi రూ.151 డేటా ప్లాన్ లో (Vi Rs151 Plan) 30 రోజుల వ్యాలిడిటీతో 4GB డేటాను అందిస్తోంది. మరియు 3 నెలలపాటు Jiohotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు.
Vi రూ.169 డేటా రీఛార్జ్ ప్లాన్ లో (Vi Rs169 Plan) భాగంగా 8GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. దీంతోపాటు మూడు నెలలపాటు జియోహాట్‌స్టార్ ఓటీటీని వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తోంది.
Vi రూ.469 రీఛార్జ్ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. వీటితోపాటు 12AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు.
వీటితోపాటు (Vi Rs469 Recharge Plan) డేటా డిలైట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్ ప్రయోజనాలకు కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా మూడు నెలలపాటు జియోహాట్‌స్టార్ ను వినియోగించుకోవచ్చు.
Vi రూ.994 ప్లాన్‌లో భాగంగా (Vi Rs994 Recharge Plan) అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీంతోపాటు మూడు నెలలపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications