జియో మాయ, ప్రతి 60 సెకన్లకి 1000మంది కష్టమర్లు

Written By:

సంచలనాలతో దూసుకుపోతున్న జియో మరో సంచలనానికి వేదికఅయింది. టెలికం రంగంలో షాకుల మీద షాకులు ఇస్తూ పోతోంది. ఎయిర్ టెల్ , ఐడియాలో సంవత్సరాల తరబడి సాధించిన కష్టాన్ని జియో కేవలం మూడు నెలల్లో దాటేసింది. ఇది ఇలాగే కొనసాగితే ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి వాటిని కూడా అవలీలగా దాటేస్తుందని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కొత్త న్యూస్: మరో ఏడాదిపాటు జియో ఉచితం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరో రికార్డు

ఉచిత ఆఫర్లతో సంచలనంగా మారిన జియో తాజాగా అయిదు కోట్ల ఖాతాదారుల మైలురాయిని అధిగమించి మరో రికార్డును సృష్టించింది.

కేవలం మూడునెలల్లో

జియో లాంచ్ చేసిన తరువాత కేవలం మూడునెలల్లో (83 రోజులు) ఈ రికార్డు స్థాయి ఖాతాదారులను నమోదు చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతి ఎయిర్‌టెల్ కు 12 ఏళ్లు

మార్కెట్ లీడర్ భారతి ఎయిర్‌టెల్ కు 50 మిలియన్ల ఖాతాదారుల మైలు రాయిని దాటడానికి 12 ఏళ్లు పడితే, వోడాఫోన్, ఐడియాకు 13 సం.రాలు పట్టిందని విశ్లేషకులు లెక్కలు చెప్పారు.

రోజుకు సగటున 6 లక్షల ఖాతాదారులు

జియో పరిశ్రమ అంచనాలకు మించి నిమిషానికి వెయ్యి కస్టమర్ల చొప్పున, రోజుకు సగటున 6 లక్షల ఖాతాదారులను సొంతం చేసుకుంది.

వాట్సప్, ఫేస్ బుక్, స్కైప్ లను

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్, ఫేస్ బుక్, స్కైప్ లను మించిన ఆదరణ పొందుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెల్ కమ్ ఆఫర్ ని 2017 ఏడాది చివరి వరకు పొడిగించే అవకాశం

మరో వైపు ఉచిత ఆఫర్లను మరో మూడు నెలలు పాటు పొడిగించినప్పటికీ వెల్ కమ్ ఆఫర్ ని 2017 ఏడాది చివరి వరకు పొడిగించే అవకాశం ఉన్నదని ఇది ధీరూభాయి అంబానీ పుట్టినరోజున జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

దేశంలోని టెలికాం దిగ్గజాలకు కష్టకాలమే

ఈ వార్తలు నిజమైతే దేశంలోని టెలికాం దిగ్గజాలకు కష్టకాలమే అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి నిజంగా రిలయన్స్ అధినేత మరో సంచలనానికి తెర తీస్తారా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Reportedly Crosses 50-Million Subscriber Milestone in 83 Days Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot