Jio బంపర్ ఆఫర్!!! ఉచితంగా 5నెలల డేటా
ప్రస్తుత రోజులలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అయింది. ఇంటర్నెట్ ను అందించే మార్గాలు చాలా ఉన్నాయి. బ్రాడ్ బ్యాండ్, మొబైల్ డేటా మరియు హాట్‌స్పాట్ వంటివి చాలా ఉన్నాయి. ఇంటి వద్ద కాకుండా చాలా చోట్ల తిరిగే వారికి అధిక వేగంతో డేటాను అందించే వైర్‌లెస్ హాట్‌స్పాట్‌ను రిలయన్స్ జియో సంస్థ అందిస్తోంది.

JioFi హాట్‌స్పాట్ ఆఫర్
ప్రస్తుతం స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకొని జియో సంస్థ తన వైర్‌లెస్ హాట్‌స్పాట్‌ను కొత్తగా కొనుగోలు చేసిన వారికి ఐదు నెలలపాటు 4G డేటాను ఉచితంగా అందిస్తున్నది. దీనితో పాటుగా కాంప్లిమెంటరీ యాక్సిస్ కింద జియో-టు-జియో ఫోన్ కాల్‌లను కూడా ఉచితంగా అందిస్తున్నది. రిలయన్స్ జియో యొక్క జియోఫై హాట్‌స్పాట్ యొక్క ధర రూ.1,999. జియో యొక్క స్వాతంతర్య దినోత్సవం ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioFi హాట్‌స్పాట్ యాక్టివేషన్ విధానం
రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి జియోఫై హాట్‌స్పాట్‌ను కొనుగోలు చేసిన వారు జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారులు డివైస్ లో యాక్టివేట్ కావడానికి అందుబాటులో ఉన్న మూడు జియోఫై ప్లాన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. JioFi పరికరంలో యాక్టివేట్ అయిన సిమ్‌ను చేర్చిన తర్వాత ఎంచుకున్న ప్లాన్ ఒక గంటలో యాక్టివేట్ అవుతుంది. ప్లాన్ యొక్క యాక్టివేషన్ స్టేటస్ ను మైజియో యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు. JioFi డివైస్ ను సంస్థ యొక్క సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

JioFi ఆఫర్ మొదటి ప్లాన్
జియోఫై యొక్క అత్యంత సరసమైన ఆఫర్ ప్లాన్‌లలో రూ.199 ఒకటి. ఇది రోజుకు 1.5GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది అదనంగా రూ.99 విలువ గల జియో ప్రైమ్ సభ్యత్వంను కూడా అదనంగా అందిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ రోజువారి 1.5GB డేటాతో పాటుగా అపరిమిత జియో-టూ - జియో కాల్స్, 1000 నిమిషాల నాన్-జియో కాల్స్ ప్రయోజనాలను మరియు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను 140 రోజులకు పొందవచ్చు.

JioFi ఆఫర్ రెండవ ప్లాన్
రెండవ ఆఫర్ రూ.249 ధర వద్ద 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను అందించే ప్లాన్. ఇక్కడ కూడా మీరు అదనంగా రూ.99 విలువ గల జియో ప్రైమ్ సభ్యత్వాన్ని మరియు రోజుకు 2GB డేటా, జియో టు జియో అపరిమిత కాల్స్, 1000 నిమిషాల నాన్-జియో కాల్స్ 28రోజులకు మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు 112 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

JioFi ఆఫర్ మూడవ ప్లాన్
జియోఫై యొక్క మూడవ ఆప్షన్ రూ.349 ప్లాన్. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 3GB డేటాను ఇస్తుంది. రూ.99 ధర గల జియో ప్రైమ్ సభ్యత్వంను అదనంగా అందిస్తుంది. ఇది రోజుకు 3 జిబి డేటా, అపరిమిత జియో టు జియో కాల్స్, 1,000 నిమిషాల నాన్ జియో కాల్‌లు 28 రోజులకు మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తాయి.


Click it and Unblock the Notifications








