తగ్గిన జియో జోరు..అసలు సత్తా చూపకుంటే భారీ షాక్ !

Written By:

వచ్చి రావడంతోనే ఉచిత ఆఫర్లతో సంచలనాలకు తెరలేపిన జియో జోరుకు బ్రేకులు పడ్డాయి. ఉచితం అనే ఒకే ఒక్క పదంతో దేశం మొత్తాన్ని జియో ఫీవర్ లో ముంచెత్తారు జియో అధినేత ముకేష్ అంబాని..అయితే ఇది రాను రాను మరింత అధ్వానంగా తయారైందని జియో కష్టమర్లు పెదవి విరుస్తున్నారు. ఇది ఇలాగే ఉంటే ముందు ముందు షాకులు తప్పవని చెబుతున్నారు. రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి.

జియోకే దడ పుట్టిస్తున్న Rcom కొత్త ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు నెలలు పూర్తయినా

జియో సేవలు ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా సేవల్లో ఇంకా నాణ్యత పెరగలేదని, ఇప్పటికీ డేటాను 2.35 స్పీడుతో అందించలేకపోతోందని ఓస్వాల్ తన నివేదికలో విమర్శించింది.

వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని

ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, నెట్వర్క్ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలిపింది.

పదికోట్ల మంది వినియోగదారులను చేర్చుకోవాలన్న సంస్థ లక్ష్యం

దీంతో 2018 డిసెంబరు నాటికి పదికోట్ల మంది వినియోగదారులను చేర్చుకోవాలన్న సంస్థ లక్ష్యం దూరమయ్యేలా కనిపిస్తోందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో అసలు సత్తా ఏంటనేది

అయితే ఉచిత ఆఫర్ పూర్తి అయి సేవలకు చార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తే జియో అసలు సత్తా ఏంటనేది బయటపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో పేర్కొంది.

సిమ్‌ను మూలనపడేయడం ఖాయమని

ఫ్రీ ఆఫర్ ముగిశాక ఇప్పుడు మొదటి సిమ్ గా ఉన్న జియోను రెండో సిమ్ గా మార్చేస్తారని, అలాగే చాలామంది సబ్‌స్క్రైబర్లు ఆఫర్ ముగిశాక సిమ్‌ను మూలనపడేయడం ఖాయమని అభిప్రాయపడింది.

జియోకు ఎయిర్టెల్ ప్రధాన పోటీదారు

నెట్వర్క్, డేటా సేవల విషయంలో జియోకు ఎయిర్టెల్ ప్రధాన పోటీదారు కాగలదని మోతీలాల్ ఓస్వాల్ వివరించింది.

మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం

మరోవైపు యూజర్ల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి జియో మున్ముందు మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం అందిస్తున్న వెల్కమ్ ఆఫర్‌ను కూడా జియో పొడిగించే అవకాశం ఉందని రిపోర్టులో వివరించింది.

రూ .2.25 నుంచి రూ. 2.35 లక్షల కోట్లకు

ఇక రానున్న 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పెట్టుబడులు రూ .2.25 నుంచి రూ. 2.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jios Subscriber Growth Slows Data Speeds Drops below 50 percent report Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot