ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

Written By:

ఓ వైపు విమానం రన్ వే‌పై అగ్ని ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోతోంది..ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు బతికితే చాలురా దేవుడా అనుకుంటూ ప్రయాణికులను అలర్ట్ చేసేందుకు ఫ్లైట్ లో ఉన్న అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా మీరు తొందరగా దూకండి దూకండి అంటూ అరుస్తున్నారు అధికారులు..కాని ప్రయాణికులు ఒక్కరూ కూడా దిగలేదు.వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంటే వారు మాత్రం వస్తువులను వెతుక్కునే పనిలో పడ్డారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.

జియోకే షాక్ ఇస్తున్న ఎయిర్‌టెల్ అన్ లిమిటెడ్ ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

తిరువనంతపురం నుంచి దుబాయ్ కి వెళుతున్న ఎమిరేట్స్ విమానం విమానాశ్రయంలో క్రాష్ అవుతున్న సమయంలో అధికారులు బయటకు వెళ్లండి అంటూ అరుస్తున్న ఒక్కరూ ఆ మాటలు పట్టించుకోలేదని వీడియో తెలుస్తోంది.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

ఆ వీడియోలో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా తమ లగేజిలను వెతుక్కుంటూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది తమ ఖరీతైన ల్యాప్ టాప్ లను వెతుక్కునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదని వీడియో పుటేజిలో తెలుస్తోంది.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

ఇటువంటి సమయంలో 90 సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడం విమానం సిబ్బంది బాధ్యత. ఆ తర్వాత విమానంలో మంటలు తీవ్రమవుతాయనే విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు వైమానిక నిపుణుడు ఆశ్లీ న్యూన్స్ తెలిపారు.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

అందుకనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది ఆ 90 సెకండల్లలో ప్రయాణికులను ఖాళీ చేయించేందుకు అవసరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అయితే ప్రయాణికులు మాత్రం తమ లగేజీలను తీసుకొని విమానాన్ని ఖాళీ చేశారు.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

ఈ తతంగమంతా జరిగేసరికి దాదాపు నిమిషంపైనే పట్టింది. రన్‌వేపై జారిపోతున్న విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా 1.23 సెకండ్ల వీడియో ఫుటేజ్‌లో కనిపించింది.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

మరి అంత విపత్కర పరిస్థితుల్లో అంటే అర నిమిషం లేటైనా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలేసేవే. ప్రాణాల కన్నా వారికి ఆ వస్తువుల మీద మమకారం ఎక్కువైందా అని ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

గతేడాది సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం లాస్ వెగాస్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ప్రయాణికులు ఇలాగే వ్యవహరించారు.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

2013 జూలై నెలలో ఓ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్‌కు గురైనప్పుడు కూడా ప్రయాణికులు తమ లగేజ్‌ల కోసం ఇలాగే వెంపర్లాడడం కనిపించింది.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

ఇప్పుడు ఎమిరేట్స్ విమానం క్రాషింగ్... సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫుటేజ్ ద్వారా వైమానిక సిబ్బంది ప్రయాణికులకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో  తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Laptop Laptop Kerala Passengers Risked Many Lives For Saving Gadgets On Emirates Plane
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot