ప్రపంచంలో ఫస్ట్ ఎయిర్ పోర్ట్ మనదే !

Written By:

ప్రపంచంలో సోలార్‌తో నడిచే తొలి ఎయిర్ పోర్ట్ వచ్చేసింది. కరెంట్ లో సంబంధం లేకుండా నడిచే తొలి ఎయిర్ పోర్ట్ మన భారతదేశంలోనే ఉండటం మనమందరం చాలా గర్వపడాల్సిన విషయం..కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ దీనికి వేదికయింది. ప్రపంచ దేశాలన్నింటిలో కెళ్లా కరెంట్ తో సంబంధం లేకుండా కేరళ లోని కొచ్చి ఎయిర్ పోర్టు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. 24 గంటలు విద్యుత్ కాంతులతో ఎయిర్ పోర్ట్ అదిరిపోతోంది. కేరళలోని కొచ్చికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ ఎలా ఉంటుందో ఓ సారి చూసేద్దాం.

Read more : పనులన్నీఎస్‌బిఐ బడ్డితో చేసేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొచి విమానాశ్రయం

తొలి సోలార్ ఎయిర్ పోర్ట్

కొచి విమానాశ్రయం సోలార్ సొబగులు అద్దుకుంది. ఇక్కడఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలన్నీ సోలార్ విద్యుత్‌తోనే జరగనున్నాయి.

వంద శాతం సోలార్

వంద శాతం సోలార్

ప్రపంచంలో వంద శాతం సోలార్ పవర్‌తో నడిచే తొలి విమానాశ్రయం ఇదే. 

45 ఎకరాల విస్తీర్ణంలో 12 మెగావాట్ల ప్లాంట్‌

45 ఎకరాల విస్తీర్ణంలో 12 మెగావాట్ల ప్లాంట్‌

సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం విమానాశ్రయంలోని కార్గో కాంప్లెక్స్‌కు సమీపంలోని 45 ఎకరాల విస్తీర్ణంలో 12 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

ప్లాంట్ ను ప్రారంభించిన కేరళ సీఎం

ప్లాంట్ ను ప్రారంభించిన కేరళ సీఎం

కేరళ సీఎం ఊమెన్ చాందీ మంగళవారం ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు.

రోజుకు 50-60 వేల యూనిట్ల విద్యుత్

రోజుకు 50-60 వేల యూనిట్ల విద్యుత్

ఈ విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణకు రోజుకు 50-60 వేల యూనిట్ల విద్యుత్ అవసరం.

అత్యంత అధునాతనంగా కొచి

అత్యంత అధునాతనంగా కొచి

రానున్న అయిదేళ్లలో కేరళ సీఎం ఉమెన్ చాంది ఈ ఎయిర్ ఫోర్టును అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. దానికి సంబంధించిన ప్లాన్ గత సంవత్సరమే రూపొందించారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
cripting a new chapter, the Cochin International Airport on Tuesday became the first in the world to operate completely on solar power.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot