Home
News

పనులన్నీఎస్‌బిఐ బడ్డితో చేసేయండి

భారత్‌లో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ వాలెట్ యాప్‌ను ప్రారంభించింది. బడ్డి పేరుతో ప్రారంభించిన ఎస్‌బీఐ మొబైల్ వాలెట్ యాప్‌ను ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. ప్రస్తుత ఖాతాదారులతో పాటు ఎస్‌బీఐలో ఖాతాలేని వినియోగదారులకు సైతం ఈ యాప్ అందుబాటులో ఉంటుందని బ్యాంక్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఇతరులకు నగదు బదిలీ చేయడంతోపాటు సినిమా, విమాన టికెట్లు, హోటళ్లు, షాపింగ్ చేయవచ్చు కూడా.

Read more:గూగుల్ గుట్టు విప్పేసింది

గూగుల్ ప్లే స్టోర్  నుంచి డౌన్ లోడ్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం బ్యాంక్ కల్పించింది. త్వరలోనే యాపిల్ ఫోన్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సంస్థ మరో మైలురాయికి చేరుకుందని బ్యాంక్ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు.

భవిష్యత్ లో చెల్లింపులు

భవిష్యత్ లో చెల్లింపులు

భవిష్యత్తులో ఈ కార్డు ద్వారా చెల్లింపులు, రీచార్జీ, బిల్లుల చెల్లింపుల విషయాన్ని ముందే హెచ్చరించే సదుపాయాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు ఆమె చెప్పారు.

ఎస్ బిఐ ఫౌండేషన్

ఎస్ బిఐ ఫౌండేషన్

కార్పొరేట్ సామాజిక బాధ్యతను(సీఎస్‌ఆర్) మరింత విస్తరించే ఉద్దేశంతో బ్యాంక్ ఎస్‌బీఐ ఫౌండేషన్ సర్వీసులు కూడా ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను జైట్లీ ఆవిష్కరించారు. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, వాతావరణ, మహిళా సాధికారిత, పిల్లల సంక్షేమానికి పనిచేయనున్నది.

అనుబంధ బ్యాంకుల విలీనం కష్టం

అనుబంధ బ్యాంకుల విలీనం కష్టం

ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనకు ప్రాధాన్యతనివ్వడం లేదని అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో విలీనం చేసుకుందామని అనిపిస్తోంది..ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తోందని, ఈ సమయంలో విలీనం చేసుకుంటే ఈ సమస్యలు రెట్టింపుకానున్నాయని ఆమె తెలిపారు.

ఎస్‌బీఐ గ్రూపు కింద ఐదు బ్యాంకులు

ఎస్‌బీఐ గ్రూపు కింద ఐదు బ్యాంకులు

ప్రస్తుతం ఎస్‌బీఐ గ్రూపు కింద ఐదు బ్యాంకులు పనిచేస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్‌ల నుంచి సిబ్బందిని నేరుగా నియమించుకునే అవకాశం ప్రభుత్వరంగ బ్యాంకులకు కల్పించాలని ఎస్‌బీఐ చీఫ్ డిమాండ్ చేశారు.

ఆర్థిక మంత్రి ప్రశంసలు

ఆర్థిక మంత్రి ప్రశంసలు

ఎస్‌బీఐకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసలు కురిపించారు. ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా మెరుగైన సేవలు అందించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో తొలిస్థానంలో ఉండటం మాములు విషయం కాదని జైట్లీ పేర్కొన్నారు.

ఎస్‌బిఐ బడ్డి

ఎస్‌బిఐ బడ్డి

ఈ యాప్ ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ కెళ్లి ఎస్‌బిఐ బడ్డి అని టైప్ చేస్తే ఈ యాప్ మీకు ప్రత్యక్షమవుతుంది. 

Best Mobiles in India

English summary
Country's largest lender State Bank of India on Tuesday launched a mobile wallet app, SBI Buddy, in collaboration with Accenture and MasterCard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X