సైంటిస్టుల ముందడుగు..చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ..

Written By:

టైటిల్ చూడగానే షాక్ అవుతున్నారా..అవును మీరు విన్నది నిజమే..శాస్ర్తవేత్తలు ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. చనిపోయిన మనిషిని బతికించే మార్గాలలో ఓ మార్గాన్ని కనుగొన్నారు. మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలో జన్యువులు రెండు నుంచి నాలుగురోజుల పాటు బతికే ఉంటాయని వీటి ద్వారా ఆయువుపోసే మార్గాలను వెతకొచ్చని వారంటున్నారు. అదెలాగో చూడండి.

Read more: ఆకాశమే హద్దుగా లేచిన హర్మ్యాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

అందర్నీఎప్పుడూ వేధిస్తున్న ప్రశ్న ఏదైనా ఉందంటే అది మనిషి చనిపోయాక ఏమవుతాడు అనేది. అయితే దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు తమ సమాధానాలను చెబతారు. కాని ఇప్పటివరకు ఎవరూ సరైన సమాధానం కనుగొనలేదు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి చనిపోవడం అంటే ఏంటీ. చనిపోయిన తర్వాత మనిషిని బతికించవచ్చా ? అన్న దిశగా విజ్ఞాన జిజ్ఞాస కలిగిన శోధకులు నిరంతరంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

అలా పరిశోధనలు చేస్తున్న సైంటిస్టలకు ఇప్పుడు ఓ చిన్న క్లూ దొరికింది. మనిషి చనిపోయాక కూడా అతని శరీరంలోని కొన్ని జన్యువులు బతికే ఉంటాయని, మనిషి చనిపోయిన తర్వాతనే అవి క్రియాశీలకంగా మారుతాయని నేటి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

వారు ఈ అభిప్రాయానికి రావడానికి కారణం ఎలుకలు, జీబ్రా చేప, మరికొన్ని జంతువులపై జరిపిన పరిశోధనలే కారణం. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రెండు ల్యాబుల్లో ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ అద్భుత విషయాలను కనుగొన్నారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటంటే. రకరకాల జంతువుల్లో 1063 జన్యువులు శరీరానికి ప్రాణం ఉన్నంతకాలం స్తబ్దుగా ఉంటాయని, చనిపోయిన తర్వాత అవి క్రియాశీలకంగా మారుతాయని వారి పరిశోధనల్లో తేల్చారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

జంతువుల్లో ఇలా ఉందంటే మానవుల్లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇలా జన్యువులు క్రియాశీలంగా మారడం వల్లనే చనిపోయిన మనిషిని బతికించలేకపోయినా, పాడై పోయిన అవయవాన్ని మార్పిడి చేసేందుకు కావాల్సినంత సమయం చిక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

చనిపోయిన జంతువుల్లోని ఆర్‌ఎన్‌ఏను విశ్లేషించగా ప్రాణం పోయాక వాటిలో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న జన్యువులు 24 నుంచి 48 గంటల్లోగా క్రియాశీలకంకాగా, కొన్ని జంతువుల్లో రెండు, మూడు రోజుల తర్వాత కూడా క్రియాశీలకంగా మారాయని యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

ఇవి ప్రాణి శరీరంలోని వ్యవస్థలన్నింటినీ మూసివేయడంలో భాగంగా జరుగుతుందని భావించినప్పటికీ ప్రాణం పోయాక కూడా జన్యువులు బతికి ఉండడం, అవి క్రియాశీలకంగా మారుతున్నాయని తెలియడం విశేషమని, భవిష్యత్తులో మనిషికి ప్రాణంపోసే దిశగా ఉపయోగపడే ముందడుగని వారు అంటున్నారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

ఇదిలా ఉంటే మరొక పరిశోధనలో కొన్ని విచిత్రాలు బయటకొచ్చాయి. వాసన పసిగట్టలేని వారి పని అయిపోయనట్లేనని శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. ముక్కు వాసన పీల్చే శక్తిని కోల్పోతే మరణానికి దగ్గరగా ఉన్నట్టేనని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

యూనివర్శిటీకి సంబంధించిన కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్‌లోని సైకియాట్రీ విభాగానికి చెందిన భారత డాక్టర్ దావనగిరి దేవానంద్ ఈ విషయంపై పరిశోధించి మరీ తేల్చిచెప్పాడు. ముక్కు వాసన పీల్చగల తన ప్రత్యేక శక్తిని కోల్పోతే ఆ తర్వాత కనీసం నాలుగేళ్లలోపు ఆ వ్యక్తి చనిపోతాడనే విషయం తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

ఇప్పటివరకు 1,169 మంది వృద్ధులపై చేసిన ప్రత్యేక అధ్యయనంలో ఈ విషయాన్ని నిరూపణ అయినట్టు తెలిపారు. ముక్కు తన ప్రత్యేక లక్షణాన్ని కోల్పోవడమంటే చావు గడియలు దగ్గర పడుతుందనడానికి సంకేతమని యూనివర్శిటీ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనలో తేలింది.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

ఏది ఏమైనా పుట్టుక చావు అనేది దైవ నిర్ణయం అంటారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనికి భిన్నంగా చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీకి శ్రీకారం చుడుతున్నారు. మరి ముందు ముందు ఇది ఏతీరాలకు చేరుతుందో చూడాలి.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Hundreds of genes spring to life up to 4 days after death scientists find
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot