LeEco Le 1s కోసం 7 లక్షల రిజిస్ట్రేషన్స్...

Written By:

తన మొదటి ఫ్లాష్ సేల్‌లో భాగంగా 70,000 ఫోన్‌లను కేవలం రెండు సెకన్లలో విక్రయించి రికార్డుల మోత మోగించిన LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రెండవ ఫ్లాష్‌సేల్‌కు సిద్ధమవుతోంది. Flipkartలో ఫిబ్రవరి 9న జరగనున్న ఈ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించి ఇప్పటి వరకు 700,000 మంది రిజిస్టర్ అయినట్లు LeEco శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సేల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు రోజులు గడువున్న నేపథ్యంలో సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కంపెనీ చెబుతోంది. మొదటి ఫ్లాష్‌సేల్‌‍లో భాగంగా ఈ ఫోన్ కోసం 6,05,5000 మంది నమోదయ్యారు.

LeEco Le 1s కోసం 7 లక్షల రిజిస్ట్రేషన్స్...

మొదటి ఫ్లాష్‌సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకున్న బెంగళూరు వాసి ఉమా మహేష్ ఫోన్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో బయ్యర్ నేహా సింగ్ Le 1s స్మార్ట్‌ఫోన్ అద్భుతమంటూ కితాబిచ్చారు. భారతీయులకు మరింత చేరువయ్యే క్రమంలో తమ ఫోన్‌ల సర్వీసింగ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 500 సర్వీస్ సెంటర్‌లను ఏర్పాటు చేయటంతో పాటు 24X7 టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ సపోర్ట్‌ను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది.

ఎక్కువగా మాట్లాడితే మగతనానికే ముప్పట..?

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్)‌, 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

LeEco Le 1s  స్మార్ట్‌ఫోన్ పూర్తి మెటల్ బాడీతో వస్తోంది.

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్)‌

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్,

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

LeEco Le 1s  స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్ తో వస్తోంది

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

LeEco Le 1s  స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఫీచర్ లోపించింది.

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తుంది.

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

ఈ సూపర్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన విప్లవాత్మక ఫింగర్ ప్రింట్ సెన్సార్ లీటచ్ పేటెంట్ టెక్నాలజీ పై స్పందిస్తుంది. ఈ సెన్సార్‌లో పొందుపరిచిన మిర్రర్ - సర్‌ఫేసిడ్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ 99.3% ఖచ్చితమైన ఐడెంటిఫికేషన్‌తో ఫ్లాష్ రికగ్నిషన్‌ను కేవలం 0.15 సెకండ్లలో ఎనేబుల్ చేస్తుంది. 5 ఫింగర్ ప్రింట్‌ల ఆప్షన్‌తో కూడిన 360 డిగ్రీ టచ్ ఇన్ అన్‌లాక్ ఫీచర్‌‌ సెన్సార్‌కు మరో హైలెట్. యాంటీ స్ర్కాచ్ సామర్థ్యంతో వస్తున్న ఈ మిర్రర్ - సర్‌ఫేసిడ్ సెన్సార్ 6H మందాన్ని రీచ్ అయ్యింది.

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని ఫోన్‌లో పొందుపరిచారు. యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 

 

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

Le 1S స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, ఐఎస్ఓసెల్ సెన్సార్, పీడీఏఎఫ్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలు ఆస్వాదించవచ్చు.

 

 

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

పనితీరు పరంగా Le 1S స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఫోన్‌లో పొందుపరిచిన 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాసెసర్‌కు తోడైన 3జీబి ర్యామ్ సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహద పడుతుంది.

 

 

LeEco Le 1s మొదటి ఇంప్రెషన్స్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన EUI 5.5 యూజర్ ఇంటర్ ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1s Reaches 700,000 Registrations For Second Sale On Flipkart. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot