ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న ‘లెనోవో కే4 నోట్’ ఫీచర్లు
జనవరి 5న భారత్ లో విడుదల కాబోతున్న 'లెనోవో కే4 నోట్' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాన్ని లెనోవో విడుదల చేస్తోంది. ఈ కిల్లర్ నోట్ ఫోన్‌కు సంబంధించి తాజాగా విడుదలైన మరో టీజర్ షాకింగ్ విషయాలను బహిర్గతం చేసింది. ట్విట్టర్ వేదికగా కే4 నోట్‌ను ఉద్దేశించి విడుదల చేసిన టీజర్‌లో లెనోవో ఈ విధంగా పేర్కొంది.

"When is audio more than just a sum of its decibel levels? Take centre-stage with the K4 Note. #KillerNote2016".
ఈ సారాంశంతో పాటు లెనోవో విడుదల చేసిన ఓ వీడియో టీజర్‌ను బట్టి చూస్తే కే4 నోట్ ట్విన్ స్పీకర్ వ్యవస్థతో వస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు బహిర్గతమైన స్పెక్స్‌ను ఓ సారి పరిశీలించినట్లయితే.. 3జీబి ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ చిప్‌లు ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మోటో జీ3 ఫోన్‌లకు Android M అప్‌డేట్
అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం మేరకు లెనోవో కే4 నోట్.. 1080 పిక్సల్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మెటల్ బాడీ వంటి ప్రత్యేకతలను కలిగి ఉండే అవకాశముంది.


Click it and Unblock the Notifications








