మోటో జీ3 ఫోన్‌లకు Android M అప్‌డేట్

Written By:

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ యూజర్లకు లడ్డూ లాంటి వార్త. న్యూ ఇయర్ కానుకగా మోటరోలా తన మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్ (Android 6.0 Marshmallow update)ను లాంచ్ చేసింది. తాజా అప్‌గ్రేడ్‌లో భాగంగా ఆండ్రాయిడ్ 5.1.1 (లాలీపాప్) వర్షన్‌లో ఉన్న మోటో జీ3 యూజర్లు ఆండ్రాయిడ్ 6.0కు అప్‌డేట్ కావొచ్చు.

మోటో జీ3 ఫోన్‌లకు  Android M అప్‌డేట్

2జీబి పరిమాణంలో ఉండే ఈ సాఫ్ట్‌వేర్‌ను పొందటం ద్వారా డోజ్ మోడ్, గూగుల్ నౌ ఆన్ టాప్, సింప్లర్ వాల్యుమ్ కంట్రోల్ తదితర కొత్త ఫీచర్లు జీ3 ఫోన్‌లో జతవుతాయి.

3జీ కనెక్షన్‌లో 4జీ స్పీడ్‌ను అందుకోవటం ఏలా..?

కొత్త అప్‌డేట్‌ను పొందటం ఎలా..?

Android M అప్‌డేట్ మీ ఫోన్‌కు అందిన వెంటనే ఓ నోటిఫికేషన్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అప్‌డేట్‌కు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ మీ ఫోన్‌కు అందని పక్షంలో సెట్టింగ్స్‌లోని వెళ్లి సిస్టం అప్‌డేట్‌ను చెక్ చేసుకోండి.

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

మోటో జీ3 స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌‍డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ ఇంకా ర్యామ్ విషయానికొస్తే రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 1జీబి ర్యామ్/8జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్/ 16 జీబి ఇంటర్నల్ మెమరీ. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ -టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఈర్ ఫిల్టర్, ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆండ్రాయిడ్ ఎం ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

అప్లికేషన్ పర్మిషన్లను కంట్రోల్ చేసుకునే సరికొత్త ఆప్షన్‌ను గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో పొందుపరిచింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

 ‘ఆండ్రాయిడ్ పే' అనే మొబైల్ పేమెంట్ సిస్టంను గూగుల్ ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ ప్రవేశపెట్టింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా డోజ్ స్టేట్ అనే డీప్ స్లీప్ మోడ్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ర్యామ్ మేనేజర్ మెమరీ యూసేజ్‌కు సంబంధించి బోలెడంత సమాచారాన్ని యూజర్లకు అందిస్తుంది. 

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

 ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ఆటో బ్యాకప్ ఫీచర్ డేటాను ఆటోమెటిక్‌గా బ్యాకప్ చేసేస్తుంటుంది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో భాగంగా గూగుల్ నౌ ఫీచర్‌లో సరికొత్త నౌ ఆన్ ట్యాప్ ఫీచర్‌ను గూగుల్ జత చేసింది.

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆసక్తికర పీచర్లు

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం యూఎస్బీ టైప్ సీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G3 to get Android M: How to check for update..? Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot