0.9 సెకన్ల వ్యవధిలో 10,000 కే4 నోట్ ఫోన్‌లు అమ్మిన అమోజాన్ ఇండియా

Written By:

లెనోవో కే4 నోట్ మొదటి ఫ్లాష్‌సేల్ అమ్మకాలు దుమ్ము రేపాయి. సెకను కన్నా తక్కువ వ్యవధిలో 10,000 కే4 నోట్ యూనిట్లు అమ్ముడై సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు లెనోవో తెలిపింది. అమోజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమైన ఈ సేల్‌కు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పలికారు.

0.9 సెకన్ల వ్యవధిలో 10,000 కే4 నోట్ ఫోన్‌లు అమ్మిన అమోజాన్ ఇండియా

ఈ ఫ్లాష్ సేల్‌కు గాను మొత్తం 4,80,566 రిజిస్ట్రేషన్‌లను లెనోవో అందుకుంది. ఈ సేల్‌లో భాగంగా కే4 నోట్‌ను వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌తో కలిపి విక్రయించారు. ఈ బండిల్ ప్యాక్ ఖరీదు రూ.12,499. ఈ ఫోన్ కు సంబంధించిన తరువాతి ఫ్లాష్ సేల్ జనవరి 27న జరుగుతుందని అమెజాన్ ఇండియా తెలిపింది.

మోటరోలా నుంచి 'కింద పడినా పగలని ఫోన్'

కే3 నోట్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న లెనోవో వైబ్ కే4 నోట్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ధర రూ.11,999. మెటాలిక్ బాడీ ఫినిషింగ్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, ఎన్ఎఫ్‌సీ చిప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కే4 నోట్ రికార్డ్ సేల్, సెకనులో 10,000 యూనిట్ల అమ్మకం

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్,

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ,

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

ఫింగర్ ప్రింట్ స్కానర్ (Fingerprint scanner) ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యుల్ క్రింద ఏర్పాటు చేసిన ఈ స్కానర్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

కే4 నోట్ ప్రధాన స్పెక్స్

వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ NFC సెన్సార్ లను సపోర్ట్ చేయటం విశేషం. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ టూల్ ద్వారా రెండు ఎలక్ట్రానిక్ డివైస్‌ల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో కమ్యూనికేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo sells 10,000 K4 Note units in less than a second. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot