లెనోవో రికార్డ్ సేల్.. 5.2 సెకన్లలో 47,440 కే3 నోట్ యూనిట్ల అమ్మకం

తమ కే3 నోట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ ద్వారా గురువారం నిర్వహించిన మొదటి ఫ్లాష్‌సేల్‌కు అనూహ్య స్పందన లభించినట్లు లెనోవో తెలిపింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సేల్ కేవలం 5.2 సెంకడ్లలో ముగిసినట్లు లెనోవో వెల్లడించింది. లెనోవో కే3 నోట్‌ను సొంతం చేసుకునేందుకు సుమారు 5 లక్షల మందిదాకా రిజిష్టర్ కాగా వారిలో 47,440 మంది మాత్రమే బుక్ చేసుకోగలిగారు. లెనోవో కే3 నోట్ (బ్లాక్ వేరియంట్)కు సంబంధించిన తరువాతి ఫ్లాష్‌సేల్ జూలై 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది, వైట్ వేరియంట్‌కు సంబంధించిన ఫ్లాష్‌సేల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
Read More: మీ ఫోన్ వైవిధ్యంగా కనపించాలంటే

లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Read More: 10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు
ఫాబ్లెట్ పరిమాణం 152.6 x 76.2 x 7.99మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు). ధర రూ.9,999. లెనోవో కే3 నోట్ రిజిస్ట్రేషన్ లింక్


Click it and Unblock the Notifications








