విమానం పై పిడుగు

|

అమెరికాలోని అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానంపై పిడుగు పడింది. అయితే జాక్ పెర్కిన్స్ అనే ప్రయాణికుడొకరు ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించారు. పిడుగు పడుతున్న సమయంలో ఆయన గుర్తించలేదు. అయితే ఈ దృశ్యాన్ని మొబైల్‌ఫోన్‌లో చూస్తుండగా గుర్తు పట్టి ఆయన ఆశ్చర్యపోయారు. పిడుగు పడిన సమయంలో విమానంలో 111 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. అయితే విమానం బాడీ తయారీ ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది కావదడంతో ఎలాంటి నష్టమూ సంభవించలేదు. ప్రయాణీకులెవ్వరూ గాయపడలేదు. ఈ పిడుగులు వల్ల కలిగే నష్టాలు అలాగే ఎక్కడెక్కడ పిడుగులు పడ్డాయో ఓ సారి చూద్దాం.

Read more:అతని ఖాతాలో లక్షల కోట్లు

బ్రెజిల్ విమానం గల్లంతు

బ్రెజిల్ విమానం గల్లంతు

దాదాపు నాలుగేళ్ల క్రితం బ్రెజిల్‌లోని రియో నగరం నుండి ఫ్రాన్స్‌కు బయలుదేరిన విమానం అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. దీనికి కారణం మెరుపులే అన్న అనుమానాలున్నాయి. ఈ ప్రమాదంలో 228 మంది గల్లంతయ్యారు.

గూగుల్ డేటా గల్లంతు

గూగుల్ డేటా గల్లంతు

అధిక కాంతితో ఆకాశం నుంచి సంభవించిన నాలుగు భయనాక మెరుపులు గూగుల్ డేటా సెంటర్‌లోని కొన్నిడిస్క్‌ల డేటాను తుడిచిపెట్టేసాయి. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. దీంతో పలువురు గూగుల్ యూజర్లు తమ డేటాను శాస్వుతంగా కోల్పొవల్సి వచ్చింది. మెరుపుల ధాటికి కొన్ని స్టోరేజ్ డిస్క్‌లు ధ్వంసమైనప్పటికి కొద్ది గంటల్లోనే వాటిని పునరుద్థరించారు.

గూగుల్ డేటా గల్లంతు
 

గూగుల్ డేటా గల్లంతు

సాధారణంగా ఇతర భవంతులతో పోలిస్తే డేటా సెంటర్లు పటిష్టమైన లైట్నింగ్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటాయి. ఈ ఘటన పై లైట్నింగ్ ప్రొటెక్షన్ సర్విస్ ఓరియన్ మేనేజర్ జస్టిన్ గేల్ స్పందిస్తూ బిల్డింగ్ కు కనెక్ట్ అయి ఉన్న పవర్ లేదా టెలికమ్యూనికేషన్స్ కేబల్స్ పై మెరుపు స్ట్రైక్ అవటం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చని అన్నారు.

పిడుగు ప్రయాణ దూరం

పిడుగు ప్రయాణ దూరం

ఈ విశ్వంలో సెకనుకు 100 పిడుగులు చొప్పున నేలను తాకుతున్నాయి. పిడుగుల తాకిడికి ఏటా కనీసం వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక చెట్లు, జంతువులకైతే లెక్కేలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పిడుగుల వల్ల అడవుల్లో ఏటా సుమారు పదివేలకు పైగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నట్లు అంచనా. ముందుగా ఏ ఎండుటాకులనో, ఎండుకొమ్మలనో, ఎండుగడ్డినో తాకిన పిడుగులు క్షణంలో వాటిని అంటించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక్కోసారి ఈ పిడుగుపాట్ల వల్ల పెద్ద ఎత్తున అడవులకు, వన్యప్రాణులకు నష్టం కలుగుతోంది.

118 మైళ్లు ప్రయాణించిన పిడుగు

118 మైళ్లు ప్రయాణించిన పిడుగు

పిడుగులు మబ్బులు ఉండే ప్రాంతంలో అడ్డంగానూ, మబ్బుల నుంచి భూమి వైపునకు నిలువుగానూ రెండు విధాలుగా ప్రయాణిస్తాయి. నిలువుగా ప్రయాణించే పిడుగులు 5-10 మైళ్ల దూరం ప్రయాణిస్తే, అడ్డంగా ప్రయాణించేవి మాత్రం 60 మైళ్లు ఇంకా అంతకన్నా ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలుగుతాయి. కొన్నేళ్ల కిందట అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో సంభవించిన పిడుగు 118 మైళ్ల దూరం ప్రయాణించింది. మానవ సమాజానికి తెలిసినంత వరకూ ఇప్పటి దాకా ఇదే అత్యంత దూరం ప్రయాణించిన పిడుగుగా నమోదయ్యింది.

35,000 నుంచి 40000 ఆంపియర్స్‌ కరెంట్

35,000 నుంచి 40000 ఆంపియర్స్‌ కరెంట్

ఒక్కసారి పిడుగు పడిందంటే దాని నుంచి దాదాపు 35,000 నుంచి 40000 ఆంపియర్స్‌ కరెంట్ ఆ పిడుగు నుంచి పాస్ అవుతుంది.

టెంపరేచర్

టెంపరేచర్

ఈ పిడుగు పడే సమయంలో 50,000 సెల్పియస్ నుంచి 90,000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ జనరేట్ అవుతుంది.

 64 కిలోమీటర్ల మేర ప్రభావం

64 కిలోమీటర్ల మేర ప్రభావం

ఇటువంటి పిడుగులు దాదాపు 64 కిలోమీటర్లు లేక 40 మైళ్ల వరకు ప్రభావం చూపిస్తుంది.

భూమికి పెద్ద దెబ్బ

భూమికి పెద్ద దెబ్బ

ఒక్క సారిగా భూమి సెంకడ్ల వ్యవధిలో కంపించిపోతుంది. పెద్ద పెద్ద గొయ్యలు ఏర్పడతాయి.

 యుఎస్ లో ఏటా వంద మంది మరణం

యుఎస్ లో ఏటా వంద మంది మరణం

ఇటువంటి పిడుగులతో సంవత్సరానికి దాదాపు 100 మంది యుఎస్ లో చనిపోతున్నారు.

బిలియన్ల మేర ఆస్తి నష్టం

బిలియన్ల మేర ఆస్తి నష్టం

ఇటువంటి పిడుగుల పడటం వల్ల ఆస్తినష్టం బిలియన్ల డాలర్లలో ఉంటుందని అంచనా..పిడుగులు పడే సమయంలో ఆ లైట్ కు అన్ని రకాలు మెటీరియల్స్ తగలబడిపోతాయి. ఇక ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ.

అంతస్థులే కుప్పకూలుతాయి

అంతస్థులే కుప్పకూలుతాయి

ఈ భయంకర మెరుపులతో పిడుగులతో అంతస్థులకు అంతస్థులే కుప్పకూలిపోతాయి. జనావాసాల్లో ఈ పిడుగులు పడితే ఇక అంతే సంగతులు

వేగంగా కదిలే మబ్బుల వల్ల పిడుగులు

వేగంగా కదిలే మబ్బుల వల్ల పిడుగులు

ఆకాశంలో మబ్బులు వేగంగా కదులుతున్నప్పుడు విద్యుత్‌ విడుదలై 'మెరుపులు' కనిపిస్తాయి. మామూలుగా ఇవి ఉరుములతో కలిసి వస్తాయి. వాతావరణంలో కలిగే మార్పులే మెరుపులకు కారణమని శాస్త్రజ్ఞులు ప్రతిపా దించారు. వేగంగా వీచేగాలులు, నీటిఆవిరి, వీటి మధ్య రాపిడి మరియు వాయు పీడనం మేఘాలలో విద్యుత్‌ మార్పులను కలిగిస్తాయి. ఇవి మెరుపులకు దారితీస్తాయి.

చిన్న చిన్న మంచుకణాలు పిడుగులు

చిన్న చిన్న మంచుకణాలు పిడుగులు

మబ్బులలో ఉన్న చిన్న చిన్న మంచుకణాలు మెరుపుల్ని కలగజేయటంలో కీలకపాత్ర వహిస్తాయి. వీటి ఒత్తిడి వలన మబ్బులలో అంతర్గతంగా పాజిటివ్‌, నెగిటివ్‌ ఛార్జీలు వేరుపడతాయట! పాజిటివ్‌ ఛార్జీలు మబ్బుపైకి, నెగిటివ్‌ ఛార్జీలు మబ్బు కింది భాగానికి చేరతాయి. ఇలా విద్యుత్‌ ఛార్జీలు వేరుపడటం వల్ల మబ్బుల్లో 'విద్యుత్‌ పీడనం' (ఎలక్ట్రిక్‌ పొటెన్షియల్‌) ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ పీడనం ఒక స్థాయికి మించినప్పుడు, మబ్బుల్లో అదనంగా ఉన్న విద్యుచ్ఛక్తి మెరుపురూపంలో విడుదలవుతుందని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు.

కాంగే దేశంలో అధికంగా మెరుపులు

కాంగే దేశంలో అధికంగా మెరుపులు

భూగోళంలో 'కాంగో' దేశంలో మెరుపులు అత్యధికంగా వస్తున్నాయని గమనిం చారు. మామూలుగా మనంచూసే మెరుపులు మబ్బుల కిందిభాగం నుండి వచ్చే నెగి టివ్‌ విద్యుత్‌ ప్రసారంవల్ల వస్తున్నాయి. ఈ విద్యుచ్ఛక్తి సుమారుగా 30వేల ఆంపియర్స్‌కు సమానమని అంచనా. ఇది 1,20,000 ఆంపియర్స్‌ వరకూ పోవచ్చట!

మెరుపు ఎన్ని సార్లయిన రావచ్చు

మెరుపు ఎన్ని సార్లయిన రావచ్చు

విద్యుత్‌ పీడనం మూడు మిలియన్‌ ఓల్ట్‌లకు మించినప్పుడు మెరుపు వస్తుంది. కేవలం ఒకే ఒక మెరుపు వచ్చినప్పుడు వచ్చే విద్యుత్‌ పీడనం శక్తి వెయ్యి బిలియన్‌ వాట్ల వరకూ ఉంటుందట. ఇది చాలా శక్తివంతమైంది. కానీ, సెకండ్‌లో దాదాపు 33 వేల వంతుకు (30 మైక్రో సెకండ్లు) మాత్రమే ఉంటుందట. అయితే 'మెరుపు' ఒకేసారి కాక కనీసం నాలుగైదు సార్లు వస్తుందట. ఇలా ఎన్నో మెరుపులు రావచ్చు. మెరుపు వచ్చినప్పుడు చుట్టూతా ఉన్న గాలి ఒకేసారి 20 వేల డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకూ వేడి విడుదలవుతుంది. ఇది సూర్యుని ఉపరితలం వేడికన్నా దాదాపు వేల రెట్లు అధికం. ఇంత వేడి ఒకేసారి రావటం వల్ల చుట్టూ ఉన్న గాలి ఒకేసారి సూపర్‌ సోనిక్‌ వేగంతో (శబ్ధానికి మించిన వేగంతో) వ్యాకోచిస్తుంది.

వేడి వల్ల విద్యుత్‌ ఆస్థి, ప్రాణ నష్టం

వేడి వల్ల విద్యుత్‌ ఆస్థి, ప్రాణ నష్టం

పిడుగు సమయంలో మెరుపు నుండి విడుదలయ్యే వేడి, విద్యుత్‌ ఆస్థి, ప్రాణ నష్టం కలిగిస్తాయి. బయటి ప్రదేశాల్లో ఈ పిడుగు ఎక్కడపడితే అక్కడ పడదు. సామా న్యంగా ఎత్తయిన చెట్లపై లేదా కొండల మీద, విశాల ప్రదేశాల్లో పడుతుంది.

చెట్ల కింద చాలా డేంజర్

చెట్ల కింద చాలా డేంజర్

అందువల్ల ఉరుములు, మెరుపులప్పుడు మనం పెద్దచెట్ల కిందకు, కొండల దగ్గరకు, ఎత్తయిన ప్రదేశాల వద్ద ఉండకుండా జాగ్రత్తపడాలి. వర్షం వస్తున్నా పెద్దచెట్ల కింద రక్షణ తీసుకోకూడదన్నమాట. మనం అలవాటున గబుక్కున పెద్ద చెట్ల కిందకు వెళ్లిపోతాం. పిడుగుపాటుకు గురై చనిపోయినవారు ఎక్కువగా ఇలా చెట్లకింద నిలబడినవారే. ఈ సమయంలో పశువులను కూడా చెట్ల కింద ఉంచకుండా జాగ్రత్త తీసుకోవాలి.

Best Mobiles in India

English summary
Wednesday, afternoon storms brought a stray bolt of lightning on top of a plane on the tarmac of Atlanta Hartsfield Airport.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X