స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్ (గత వారం రిలీజ్‌లు)!
కార్బన్ స్మార్ట్ టాబ్ 7 టోర్నడో (Karbonn Smart Tab 7 Tornado):

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల విభాగంలో దూసుకుపోతున్న కార్బన్ తాజాగా ‘స్మార్ట్ టాబ్ 7 టోర్నడో’ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌ను కార్బన్ అధికారికంగా ప్రకటించనప్పటికి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘సాహోలిక్ ‘ తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ధర రూ.5,499.
స్పెసిఫికేషన్‌లు…..
డిస్‌ప్లే : 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1.2గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ర్యామ్ సామర్థ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.
కనెక్టువిటీ: బుల్ట్ ఇన్ వై-పై, యూఎస్బీ పోర్ట్, 3జీ వయా డాంగిల్,
బ్యాటరీ: 3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8గంటల వీడియో ప్లేబ్యాక్, 7 గంటల వై-ఫై బ్రౌజింగ్, 25 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్),
ధర ఇతర వివరాలు: ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ ‘స్మార్ట్ టాబ్ 7 టోర్నడో’ను రూ.5,499కి ఆఫర్ చేస్తోంది.
2013కు ముస్తాబవుతన్న ‘8 హాటెస్ట్’ స్మార్ట్‌ఫోన్‌లు(గ్యాలరీ)


Click it and Unblock the Notifications








