జియోకి క్లీన్ చిట్ : టెల్కోలకి దిమ్మతిరిగింది

Written By:

రిలయన్స్ జియోకి ట్రాయ్ క్లీన్ చిట్ ఇచ్చింది. టెలికం ఆపరేటర్లు చేసిన ఆరోపణలను కొట్టి పారేసింది. జియో దోపిడి పద్దతులకు తెరలేపుతోందని టారిఫ్ ప్లాన్ల విషయంలో కష్టమర్లను మోసం చేస్తుందని టెల్కోలు ఆరోపించిన తరుణంలో ట్రాయ్ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. జియో ఎలాంటి తప్పు చేయడం లేదంటూ వారి ఆరోపణలను తోసి పుచ్చింది.

చివరి అవకాశం..ఐఫోన్ 7పై భారీ తగ్గింపు, 9 జిబి డేటా ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత వాయిస్ కాలింగ్ సర్వీసులపై క్లీన్‌చిట్

జీవిత కాల వ్యవధిలో రిలయన్స్ జియో అందించే ఉచిత వాయిస్ కాలింగ్ సర్వీసులపై క్లీన్‌చిట్ వచ్చేసింది. జియో టారిఫ్ ప్లాన్స్ ప్రస్తుత నిబంధనలకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని, వివక్షాపూరితంగా లేవని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ స్పష్టంచేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలాంటి రుజువులు లేవు

ట్రాయ్ దగ్గర రిలయన్స్ జియో నమోదుచేసిన టారిఫ్ ప్లాన్స్, ఐయూసీకి ఆమోదయోగ్యంగా లేవని, మార్కెట్లో దోపిడీ పద్ధతులకు తెరతీసేలా ఉన్నాయనడంలో ఎలాంటి రుజువులు లేవని తేల్చిచెప్పింది.

నిబంధనలకు వ్యతిరేకంగా

కాలింగ్ టారిఫ్ ప్లాన్, ప్రస్తుత నిబంధనలకు వ్యతిరేకంగా దోపిడీ పద్దతులకు తెరదీసేలా ఉన్నాయంటూ టెలికాం ఆపరేటర్లు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిమిషానికి 14 పైసలు

టెలికాం రెగ్యులేటర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 14 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఉచిత వాయిస్ కాల్ ఆఫర్స్‌తో రిలయన్స్ దోపిడీకి తెరతీసిందని ఇతర టెలికాం ఆపరేటర్లు తీవ్రంగా మండిపడ్డాయి.

జియోకు క్లీన్ చిట్

టెలికాం ఆపరేటర్లు చేస్తున్నఈ ఆరోపణలను కొట్టిపడేస్తూ.. రిలయన్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా జియోకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు టెలికాం ఆపరేటర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ లేఖ రాసింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిలయన్స్ జియో సంతోషం

ట్రాయ్ లెటర్‌కు రిలయన్స్ జియో సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిబంధనలకు తమ అన్నీ టారిఫ్ ప్లాన్స్ కట్టుబడి ఉన్నాయనడంలో ట్రాయ్ వద్ద కూడా నిరూపితమైందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో తెలిపింది.

డిసెంబర్ 31 వరకు

రిలయన్స్ జియో సేవలతో టెలికాం మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ వినియోగదారులకు జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌తో పాటు డిసెంబర్ 31 వరకు అపరిమిత ఉచిత 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఆఫర్‌ను అందించనున్నట్లు జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Not discriminatory Reliance Jio's free call offer gets clean chit from Trai Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot