ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నట్లుగానే మన వస్తువులను కూడా మనమే పరిరక్సించుకోవాలి. మొబైల్ కమ్యూకేషన్ తప్పనిసరైన నేపధ్యంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీతో షేర్ చేసుకుంటున్న 10 క్రియేటివ్ ఆలోచనలు మీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుతాయి. మరి ఆ క్రియేటివ్ ఐడియాలను క్రింది స్లైడర్‌లో చూసేయండి మరి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
మీ ఫోన్ కోసం స్మార్ట్ చిట్కా:
మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
మీ మొబైల్ చార్జర్ వైర్ బ్రేక్ అవకుండా ఉండేందుకు పెన్ స్ప్రింగ్‌ను చార్జర్ పిన్ వెనుక భాగంలో అమర్చండి.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
క్యాసెట్ కేస్‌ను ఫోన్ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చన్న విషయాన్ని ఈ ఫోటో మనకు స్పష్టం చేస్తోంది.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
గిఫ్ట్‌కార్డ్‌లను ఇయర్‌బడ్ హోల్డర్‍గా కూడా ఉపయోగించుకోవచ్చని ఈ ఫోటో ద్వారా మనకు అర్థమవుతోంది.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
అత్యవసర పరిస్థితుల్లో మన జేబులోని పర్సును కూడా ఫోన్ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
కొంచం కొత్తగా ఆలోచిస్తే హెయిర్ క్లిప్ కూడా ఫోన్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
ఆలోచిస్తే చిన్న చెక్క ముక్కను టాబ్లెట్ స్టాండ్‌లా తీర్చిదిద్దవచ్చు.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
హ్యాంగర్లను ఇలా కూడా వాడుకోవచ్చు.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
పనికిరాని కార్బ్ బోర్డును సైతం ఇలా చార్జింగ్ హోల్డర్‍లా మలచవచ్చు.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
ఇంట్లోని పాత లోషన్ బాటిల్‌ను ఇలా సెట్ చేయండి.

ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా..?
ఆలోచిస్తే పనికిరాని గిఫ్ట్ బాక్సును కూడా చార్జింగ్ స్టేషన్‌లా మార్చేయవచ్చు.


Click it and Unblock the Notifications








