ఐడియాని భారీగా తాకిన జియో దెబ్బ, షాకింగ్ నిర్ణయం

Written By:

దేశంలో అతి పెద్ద టెలికం వెంచర్ గా ముందుకు దూసుకుపోతున్న ఐడియాకు జియో దెబ్బ భారీగానే తాకినట్లు తెలుస్తోంది. ఉచిత ఆఫర్లతో జియో టెల్కోలను హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఐడియా తన ఫెర్ ఫామెన్స్ వీక్ గా ఉంటుందని భావించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మలేషియన్ కంపెనీ ఆక్సియాటా తన వాటానే అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2 లక్షల ఫ్రీడం 251 ఫోన్లు, వస్తున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐడియాలో తన 20 శాతం వాటాను

జియో ఉచిత సేవల నేపథ్యంలో మరో మూడేళ్లపాటు ఐడియా పనితీరు మందగించే అవకాశమున్నట్లు అమ్మకానికి సిద్ధమైన మలేసియన్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐడియాలో తన 20 శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ) విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

కొనుగోలుకోసం..

ఈ మేరకు గతంలో టెలికాం మలేషియా, ఆక్సియాటా వాటాను తిరిగి కొనుగోలుకోసం ఐడియా సెల్యులర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ను సంప్రదించింది. ఆదిత్యా బిర్లా గ్రూపుకు ఐడియాలో 40 శాతం వాటా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టు..

అయితే ఆదిత్యా బిర్లా దానికి తిరస్కరించడంతో ఇతర కొనుగోలుదారులకోసం చూస్తోంది. ఈ మేరకు బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఐడియా, ఆక్సియాటా సంస్థలు నిరాకరించాయి.

పెద్ద నోట్ల రద్దుతో

ఇదిలా ఉంటే పెద్ద నోట్ల రద్దుతో రూ.100- 200 మధ్య ఐడియా రిచార్జ్ లు గణనీయంగా తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే 2 శాతం క్షీణించిన ఐడియా ఆదాయం ఈ క్వార్టర్ లో 4-5 శాతం వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

స్టాక్ మార్కెట్లో బలహీనం

గుప్పుమన్న ఈ వార్తలతో ఐడియా స్టాక్ మార్కెట్లో బలహీనపడింది. సుమారు 3.28 శాతం నష్టాలతో కొనసాగుతోంది. అయితే రద్దయిన నోట్లతో మొబైల్ బిల్లులు డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చని ఐడియా ఇది వరకే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Malaysia's Axiata looks to sell its 20% stake in Idea Cellular Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot