సెల్పీ ఆరాటం.. జలసమాది

Posted By:

సెల్ఫీ క్రేజ్ మరో ప్రాణాన్నిబలితీసుకుంది. బెంగుళూరులోని చిక్కమాగులూరు జిల్లా ముడిజీరిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మహీంద్ర తన నలుగురు మిత్రులతో కలిసి విహారయాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం ఆలికన్ జలపాతం వద్దకు వచ్చారు. సమీపంలోని దేవాలయన్ని సందర్శించిన వీరు పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం సరదాగా గడిపేందుకు జలపాతం వద్దకు వచ్చారు.

Read More : స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువుగా కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా మహీంద్ర అతని మిత్రులు వాటర్ ఫాల్స్ వద్ద ఫోటోలు దిగటం ప్ర్రారంభించారు. ఈ క్రమంలో మహీంద్ర వాటర్స్ ఫాల్స్‌తో క్లోజప్ సెల్ఫీ షాట్ కోసం ప్రయత్నించి జలపాతంలో జారిపడిపోయాడు. ఇతడిని కాపాడేందుకు అతని మిత్రులు ప్రయత్నించినప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. జలపాతంలో గల్లంతైన మహీంద్ర మృతదేహాన్ని స్థానికుల సహాయంతో వెలికితీసారు. కాబట్టి ఫ్రెండ్స్ బీ కేర్ ఫుల్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫీ గురించి ఆసక్తికర విషయాలు

‘సెల్ఫీ' పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్.కామ్ 2013లో అధికారికంగా జతచేసింది.

సెల్ఫీ గురించి ఆసక్తికర విషయాలు

#selfie పదాన్ని 2004లో ఫ్లికర్ మొదటిసారిగా ఉపయోగించింది.

సెల్ఫీ గురించి ఆసక్తికర విషయాలు

2012కు గాను టైమ్ మ్యాగజైన్ వెల్లడించిన టాప్ 10 పదాలలో సెల్ఫీకి చోటు దక్కింది.

సెల్ఫీ గురించి ఆసక్తికర విషయాలు

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు సెల్ఫీలను ఎక్కువుగా వినియోగిస్తున్నారు

సెల్ఫీ గురించి ఆసక్తికర విషయాలు

సెల్ఫీ స్టిక్‌లు ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చాయనుకుంటే మనం పొరబడినట్లే, సెల్ఫీ‌స్టిక్ వినియోగం 1926 నుంచే ఉందని తాజాగా బయటపడిన ఈ ఫోటో ద్వారా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Man attempts selfie, loses life in the bargain. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot