మత పెద్దల సాక్షిగా స్మార్ట్‌ఫోన్‌‌తో యువకుడి పెళ్లి

Written By:

పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. మరి ఇతని పెళ్లి కూడా స్వర్గంలో ఇలా నిర్ణయించారు కాబోలు. అమ్మాయిని కాదు..అబ్బాయిని కాదు.. ఏకంగా సెల్ ఫోన్ ను పెళ్లి చేసుకున్నారు. వినడానికి ఇది చాలా వింతగా ఉన్నా అతనికి మాత్రం యమా ఖుషీగా ఉందని చెబుతున్నారు. ఏకంగా చర్చిలోనే ఈ పెళ్లి వేడుకను కన్నుల పండుగగా చేసుకున్నాడు. పెళ్ళి కొడుకుగా ముస్తాబైన ఆ యువకుడి ఆనందహేలను మీరు చూడండి.

వాట్సప్‌ను ఇండియాలో బంద్ చేయలేం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లాస్ ఏంజిలెస్ కు చెందిన ఆరన్ చెర్వెనార్

1.

అమెరికాలోని లాస్ ఏంజిలెస్ కు చెందిన ఆరన్ చెర్వెనార్ అనే యువకుడికి లాస్ వెగాస్ లోని ఓ చర్చిలో చిత్రమైన వివాహం జరిగింది. ప్రపంచంలో ఒక వివాహం ఈ తరహాలో జరగడం ఇదే తొలిసారి కావడంతో వార్తల్లో నిలిచింది.

తన భార్యగా ఒక డివైస్ ను

2.

ఆరోన్ ఒక స్మార్ట్ ఫోన్ ని పెళ్ళాడాడు. ఆర్టిస్ట్, డైరెక్టర్ అయిన ఇతగాడు తన భార్యగా ఒక డివైస్ ను ఎంపిక చేసుకున్నాడు. లాస్ ఏంజిలిస్ నుంచి లాస్ వేగాస్ వరకు సుమారు 365 కిలోమీటర్లు ప్రయాణించి మరీ చర్చిలోని వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు.

పెళ్లికి చర్చి అధికారులు కూడా గుర్తింపు

3

అతగాడు స్మార్ట్ ఫోన్ ను పెళ్లాడడమే ఒక వింతగా నిలిస్తే.. ఈ టిపికల్ పెళ్లికి చర్చి అధికారులు కూడా గుర్తింపు ఇవ్వడం అంతకన్నా వింతగా నిలిచింది. ఈ వివాహం చేసిన పాస్టర్ మైఖేల్ కూడా కొత్త అనుభూతికి లోనయ్యానని చెప్పారు. 

ఆరన్ ఒక 'సెల్ ఫోన్'ను వివాహం చేసుకుంటానని

4.

ఎన్నో జంటలకు వివాహం చేసిన తాను ఆరన్ ఒక 'సెల్ ఫోన్'ను వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆశ్చర్యానికి లోనయ్యానని తెలిపారు.

లాస్ వేగాస్ రివ్యూ -జర్నల్

5

లాస్ వేగాస్ రివ్యూ -జర్నల్ ఈ పెళ్లి వార్తను రిపోర్ట్ చేసింది. వరుడు సూట్ లో మెరిసిపోతే.. వధువు అదే. స్మార్ట్ ఫోన్ ప్రొటెక్టివ్ కేస్ లో ఒదిగిపోయింది.

చట్ట బద్దంగా భార్యగా స్వీకరించడానికి

6.

ఈ స్మార్ట్ ఫోన్ ను చట్ట బద్దంగా భార్యగా స్వీకరించడానికి అంగీకరిస్తున్నావా అని అడిగి ఆరోన్ అనుమతి తీసుకున్న లిటిల్ లాస్ వేగాస్ చాపెల్ యజమాని మైఖేల్ కెల్లీ ఈపెళ్లి తంతును ముగించాడు.

తనతో చాలా కాలంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉందని

7

అయితే తనతో చాలా కాలంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉందని, తన భావోద్వేగాలను దీనితో పంచుకుంటానని అంటున్నాడు ఆరోన్. అంతేకాదు ఈ పెళ్లి వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు..

ఈ పెళ్లి ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని

8.

అటు ఆయన ఈ పెళ్లి ద్వారా సమాజానికి ఒక సందేశాన్నివ్వాలనుకున్నాడని కెల్లి చెప్పడం విశేషం. అయితే ఈ వివాహానికి నెవెడా రాష్ట్ర చట్టబద్ధత లేదని కెటీఎన్‌వీ రిపోర్ట్ చేసింది.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Man marries his smartphone in Las Vegas ceremony
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot