వాట్సప్‌ను ఇండియాలో బంద్ చేయలేం

Written By:

ఇండియాలో వాట్సప్ తో సహా ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ఉన్న 20 యాప్ లను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ యాప్ ల ద్వారా పంపే సందేశాలను అవసరమైతే ప్రభుత్వ వర్గాలు సేకరించేలా ఉండాలని లేని పక్షంలో ఆ యాప్ లను ఇండియాలో నిషేధించాలని హర్యానాకు చెందిని ఆర్టీఐ కార్యకర్త సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం పిల్ ను కొట్టివేస్తూ ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది.

గూగుల్ కీ బోర్డ్‌‌ని తలదన్నే కీ బోర్డ్‌లు

వాట్సప్‌ను ఇండియాలో బంద్ చేయలేం

ఎన్‌క్రిప్షన్ ఉంటే ఒక్కో సందేశాన్ని మధ్యలో చదవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని బ్లాక్ బెర్రి ఇలాంటి ఆప్సన్ అమలు చేయగా ప్రభుత్వం వద్దని చెప్పిందని పిటిషినర్ వాదించారు. అయితే ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఎన్‌క్రిప్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. 

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.

వాట్సప్ మెసేజ్ లు చూడటం సాధ్యం కావడం లేదని ఇది చాలా సమస్యలను సృష్టించే అవకాశం ఉందని కేంద్ర సమాచార,ఐటీ మంత్రి రాజ్యసభలో ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు.వాట్సప్ లాంటి కమ్యూనికేషన్ యాప్‌ల మేసెజ్ లను డీక్రిప్ట్ (వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యపడదని తెలిపారు.

2

న్యాయపరంగా, టెక్నికల్ గా, రెగ్యులేటరీ పాలసీ వంటి కారణాలతో ఈ వాట్సాప్ మెసేజ్ లను చదవగలిగే ఆకృతులోకి మార్చడం కుదరదు. వివిధ అప్లికేషన్ సర్వీస్ ప్రొవేడర్లు కల్పిస్తున్న ఎన్ర్కిప్టెడ్ కమ్యూనిషన్ తో వ్యవహరించేటప్పుడు సెక్యురిటీ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కునే అవకాశం ఉంది.

3

ఆ అప్లికేషన్లు ఎన్కిప్షన్ టెక్నాలజీని, యాజమాన్య ధృవీకరణ ప్రొటోకాల్స్ ను వాడుతూ మెసేజ్ లను భద్రంగా ఉంచుతాయి.ఇతరులు ఎవరూ ఓపెన్ చేయలేరు.

4

సెక్యురిటీ ఏజెన్సీలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించి, వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యపడదు, ఒకవేళ డీక్రిప్ట్ చేయాలనుకున్నా టెక్నికల్ గా, న్యాయపరంగా, రెగ్యులేటరీ పాలసీ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

5

ఎన్ స్క్రిప్షన్ అనేది అత్యంత ప్రాముఖ్యం కల్గిన సాధనం. ఉద్దేశించిన గ్రహీతలు మాత్రమే ఈ మెసేజ్ లు చదువుకోగలిగే రీతిలో దీన్ని రూపొందించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write SC junks PIL on WhatsApp private key
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot