శాస్ర్తవేత్తలకే షాక్ ఇస్తున్న మామ్ ఫోటోలు

Posted By:

మామ్... మనకు స్వతంత్ర దినోత్సవం రోజున ఆకాశం నుండి అద్భుతమైన కానుకలను పంపించింది. ఇంతకీ ఈ మామ్ ఎవరా అని అశ్చర్యపోతున్నారా..ఇంకెవరు మన దేశ కీర్తి పతాకాన్ని ఆకాశంలో రెపరెపలాడిస్తున్న మంగళయాన్.. ఇంకా చెప్పాలంటే మార్స్ ఆర్బిటర్‌మిషన్.మార్స్ ఇస్రో పంపించిన ఉపగ్రహం మార్స్ ఉప‌రిత‌లానికి సంబంధించి చాలా విష‌యాల‌ను చెప్పే అద్భుత‌మైన ఫోటోల‌ను భూమి మీదకు పంపించింది. వాటిని మామ్ జులై 15న తీసి పంపించినా ఇస్రో వాటిని ఈ మధ్యనే రిలీజ్ చేసింది. ఆ అదిరిపోయో ఫోటోలను ఓ సారి చూద్దాం.

Read more :దిగ్గజాల మధ్య మొబైల్ వార్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మామ్ ఉపరితలానికి సంబంధించి తీసిన ఫోటోలు

2014 సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 24న మార్స్ క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించిన మామ్ ఇప్పుడు మార్స్‌కు అతిద‌గ్గ‌ర‌లో అంటే కేవ‌లం 1857 కిలోమీట‌ర్ల ఎత్తులో నుంచి తీసిన ఫోటోలివి.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఈ ఫోటోల్లో మార్స్ గ్ర‌హం లోయ‌ల ప్రాంతం చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

వ్యాలీస్ మెరిన‌రైస్ కెన్యాన్ సిస్ట‌మ్‌గా పిలిచే ఈ ప్రాంతం ఇమేజెస్‌లో ఓ లోతైన లోయ‌ల మెలిక చాలా స్ప‌ష్టంగా ఉంది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

సుమారు 5000 కిలోమీట‌ర్ల వ్యాసంలో ప్రాంతమంతా కనిపిస్తున్న ఈ ఫోటోలు అంత‌రిక్ష ప్రేమికుల‌కు క‌న్నుల పండుగే అని చెప్పాలి.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఈ ఫోటోల‌ను విశ్లేషించి అక్క‌డ ఇది నీటి ప్ర‌వాహాలు ఉన్నాయేమో శాస్త్ర‌వేత్తలు క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

మొత్తానికి మ‌న దేశం చేప‌ట్టిన అతి సుదూర అంత‌రిక్ష ప్రాజెక్ట్ స‌క్సెస్ కావ‌డం అవికూడా మ‌న స్వ‌తంత్ర్య‌ దినోత్స‌వం రోజునే ఆ ఫ‌లితాల‌ను చూడ‌గ‌ల‌గ‌డం నిజంగా గ్రేట్‌.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

మంగ‌ళ‌యాన్ నుంచి మ‌రిన్ని అద్భుత‌మైన ఫోటోలు త్వరలో రానున్నాయి

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

మార్స్ ఆర్బిటర్ మిషన్ ‘మంగళయాన్' అంగారక గ్రహం పై కాలుమోపి నెల రోజులు పూర్తి అయినప్పుడు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ పేజీ పై ప్రత్యేకమైన డూడుల్‌ను అప్పుడు పోస్ట్ చేసింది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

భారత శాస్త్రవేత్తలు అంగారకుడిపైకి పంపించిన మంగళయాన్ మార్గమధ్యంలోనే తన పనిని ప్రారంభించింది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

అప్పుడు కోస్తాని అతలాకుతలం చేసిన హెలెన్ తుఫాను ఫొటో తీసి భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్‌కు పంపించింది. ఇది మంగళయాన్ పంపిన మొట్టమొదటి చిత్రం. భారత్‌కు 68,000 కిలోమీటర్లు ఎత్తు నుంచి మంగళయాన్ ఈ ఫొటోను నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం తీసింది. మంగళయాన్‌కు అమర్చిన కెమెరాను పరీక్షించే నిమిత్తం శాస్త్రవేత్తలు ఈ ఫొటోను తీసేలా సంకేతాలు పంపారు. ఈ ఫోటోలో భారత్, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, గల్ఫ్ ప్రాంతాలు కూడా కవర్ అయ్యాయి. పిక్చర్ చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు పట్టలేని సంతోషంతో చెపుతున్నారు.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

2013 నవంబర్ 5న మామ్ ని ప్రయోగించారు. దాదాపు పది నెలలు ప్రయాణించి గత సెప్టెంబర్ 24న అది మార్స్ కక్ష్యలోకి చేరింది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

మామ్ సక్సెస్ ఫుల్‌ గా కక్ష్యలోకి చేరటంతో మార్స్ ప్రయోగంలో భారత్ మరో అడుగు ముందుకేసినట్లైంది. మొదటి ప్రయత్నంలోనే మార్స్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించిన ఘనత భారత్ సొంతం చేసుకుంది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

2014లోని 25 ఆవిష్కరణల్లో మామ్ ఒకటని టైమ్ మ్యాగజైన్ ప్రశంసించింది. మామ్ ప్రయోగానికి ఇస్రో రూ. 450 కోట్లు ఖర్చు చేసింది.

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

ఉపరితలానికి సంబంధించి మామ్ తీసిన ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో సోర్స్ : ఇస్రో 

English summary
here write Mangalyaan sends back stunning images of Mars
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot