దిగ్గజాల మధ్య మొబైల్ వార్..

|

టెక్నాలజీ రంగంలో మొబైల్ వార్‌ మొదలు కాబోతోందా? ప్రపంచంలోని అతిపెద్ద టెక్‌ కంపెనీలకు భారత సంతతికి చెందిన ఇద్దరు సీఈవోలుగా ఉన్నారు. ఒకరు సత్యా నాదెళ్ల ..ప్రపంచంలోని అతి పెద్ద టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా కాగా మరోకరు సెర్చి ఇంజిన్‌ గూగుల్‌ కంపెనీ సీఈవో సుందర్ రామన్ పిచాయ్. రోజు రోజుకు టెక్నాలజీ రంగం పూర్తిగా మారిపోతోంది. గతంలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్ల నుంచి ఇంటర్నెట్‌ వాడేవారు. ప్రస్తుతం డెస్క్‌టాప్‌ నుంచి ఇంటర్నెట్‌ వినియోగం స్మార్ట్‌ఫోన్లకు మారిపోయింది. ప్రతి ఒక్కరు మొబైల్‌ ద్వారానే ఇంటర్నె ట్‌ వాడటం మొదలు పెట్టారు. డెస్క్‌టాప్‌ పాతబడిపోయింది. సో ఇప్పుడు వీరిద్దరి మధ్య టెక్నాలజీ వార్ మొదలవుబోతందనే సంకేతాలు వెలువడుతున్నాయి..దీనిపై ఓ లుక్కేద్దాం.

 

Read more:ప్రపంచంలో ప్రధాన అంతరిక్ష కేంద్రాలివే

కంప్యూటర్ రంగాన్ని ఏలిన మైక్రోసాఫ్ట్

కంప్యూటర్ రంగాన్ని ఏలిన మైక్రోసాఫ్ట్

ఒకప్పడు కంప్యూటర్‌ రంగాన్ని మైక్రోసాఫ్ట్‌ ఏలిందని చెప్పవచ్చు. ఎందుకంటే కంప్యూటర్లు రన్‌కావాలంటే మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తప్పకుండా వాడాల్సిందే. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేదంటే కంప్యూటర్‌ రన్‌ కాదని వేరే చెప్పనక్కర్లేదు. 

అడ్రస్ లేని నోకియా

అడ్రస్ లేని నోకియా

ఒకప్పుడు బేసిన్‌ ఫోన్లలో నోకియాదే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేది. స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రావడంతోనే నోకియా అడ్రస్‌ లేకుండా పోయింది. దాని స్థానాన్ని స్యాంసంగ్‌ ఆక్రమించింది. ఇక స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ వినియోగం మొదలైంది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ను స్యాంసంగ్‌ వినియోగించడంతో మైక్రోసాఫ్ట్‌ వెనుకబడిపోయింది.

దిగ్గజాల మధ్య మొబైల్ వార్..?
 

దిగ్గజాల మధ్య మొబైల్ వార్..?

ప్రస్తుతం భారత్‌ సంతతికి చెందిన ఇద్దరు ప్రపంచంలోని అతి పెద్ద రెండు కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. ఇక మొబైల్‌వార్‌ మొదలైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.

పట్టు కోసం పోటీ

పట్టు కోసం పోటీ

ఇంటర్నెట్‌ ఆర్థిక వ్యవస్థలో తన పట్టు సాధించుకోవడానికి మైక్రోసాఫ్ట్‌ బాస్‌ సత్య నాదెళ్ల మీద పోటీకి పిచాయ్‌ను పెట్టారని పరిశీలకులు చెబుతున్నారు. ఇద్దరు ప్రాడక్టు స్పెషలిస్టులే. తమ తమ విభాగాల్లో కీలక పాత్రలు పోషించిన వారే. అయితే యాజమాన్యాలు మాత్రం ఇక మీరు ప్రాడక్టులు తయారు చేసే పనికి స్వస్తి చెప్పి కంపెనీకి నాయకత్వం వహించి ముందుకు తీసుకువెళ్లాలని సీఈవోలుగా పదోన్నతి కల్పించాయి.

గూగుల్ వర్సెస్ మైక్రోసాఫ్ట్

గూగుల్ వర్సెస్ మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్‌కు చెందిన నాదెళ్ల ఆపిల్‌ వినియోగించే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అమల్లోకి తేవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ఆపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కేవలం ఆపిల్‌ ఫోన్లకు మాత్రమే పనికొస్తుంది. అయితే నాదెళ్ల ముందున్న అతి పెద్ద సవాల్‌ మాత్రం గూగుల్‌ను దెబ్బకొట్టడమే..

రాబోయేరోజుల్లో ఇంటర్నెట్‌దే హవా

రాబోయేరోజుల్లో ఇంటర్నెట్‌దే హవా

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సమాచారం కోసం గూగుల్‌ ఇంటర్నెట్‌ను వినియోగిస్తారు. గూగుల్‌ సెర్చి ఇంజిన్‌తో పాటు గూగుల్‌ క్రోమ్‌లో చాలా భాగం పిచాయ్‌ తయారు చేసింది. రాబోయేరోజుల్లో ఇంటర్నెట్‌దే హవా... దీని ఆపరేటింగ్‌ సిస్టమ్‌, హార్డ్‌వేర్‌ మార్కెట్‌ చాలా కీలకం. ఈ మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని ఈ ఇద్దరు దిగ్గజాలు పోటీపడే అవకాశం ఉంది.

రేస్ లో లేని ఆపిల్

రేస్ లో లేని ఆపిల్

ఇక ఆపిల్‌ విషయానికి వస్తే ప్రస్తుతం రేస్‌లో లేదు. ఇది మాస్‌ మార్కెట్‌లో లేదు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ లు మాత్రం మాస్‌ మార్కెట్లో ఉన్నాయి. ఇటీవల మార్చిలో నాదెళ్ల సెర్చి ఇంజిన్‌ బింగ్‌ను అమల్లోకి తెచ్చారు. సెర్చి వెబ్‌లోప్రతి ఐదుగురిలో ఒకరు బింగ్‌ వాడుతున్నారు.

10 ఒఎస్‌ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌

10 ఒఎస్‌ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌

ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 ఒఎస్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ద్వారా నూతన అనుభూతిని పొందుతారని పేర్కొంది. అన్ని అనుకూలంగా ఉంటే ఇదే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను మైక్రోసాఫ్ట్‌ ఫోనుకు అమల్లోకి తెస్తామని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

గూగుల్ ను ముందుకు తీసుకెళ్లే పనిలో  సుందర్ పిచాయ్

గూగుల్ ను ముందుకు తీసుకెళ్లే పనిలో సుందర్ పిచాయ్

పిచాయ్‌ విషయానికి వస్తే ఆయన సరికొత్త ప్రాడక్టులను తీసుకువచ్చారు. వాటిలో జీ-మెయిల్‌, గూగుల్‌ మ్యాప్స్‌, ఆండ్రియాడ్‌లు తీసుకువచ్చారు. ప్రపంచం‌లోని మెజారిటీ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు.

పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగం

పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగం

ప్రస్తుతం మార్కెట్లో పర్సనల్‌ కంప్యూటర్ల వినియోగం కంటే కూడా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. 2017 నాటికి 5.3 బిలియన్‌ మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్లకు మారిపోతారన్న అంచనా. 99.5 శాతం మొబైల్‌యూజర్లు సమాచారం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు. 62.1శాతం, ఈ -మెయిల్స్‌ చెక్‌ చేసుకోవడానికి 41.7 శాతం మంది యాప్స్‌ను డౌన్‌ లోడుచేసుకోవడానికి వినియోగిస్తున్నారు.

ఒకదానితో ఒకటి పోటీ

ఒకదానితో ఒకటి పోటీ

ఈ రెండు కంపెనీలు ఇంటర్నెట్‌ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ వాటాను దక్కించుకునేందుకు ఒకదానితో ఒకటి పోటీ పడటం ఖాయం. రాబోయే రోజుల్లో సుందర్‌ వర్సెస్‌ నాదెళ్ల మద్య మొబైల్ వార్‌ ఎలా ఉండబోతుందో తేలిపోతుంది.

మొబైల్ వార్ రానుందా..?

మొబైల్ వార్ రానుందా..?

గూగుల్ కంపెనీ నుంచి సెర్చ్ ఇంజన్ క్రోమ్ రాగా, మైక్సోసాప్ట్ నుంచి బింగ్ అనే సెర్చ్ ఇంజన్‌ను ఉంది. ఇటీవల కాలంలో బింగ్ సెర్చ్ ఇంజన్‌ను వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల విడుదల చేసిన విండ్సో 10 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మొబైల్ కస్టమర్స్‌కు మైక్రోసాప్ట్ పరికరాల మధ్య కొత్త ఎక్స్ పీరియన్స్‌ని కస్టమర్స్‌కు అందించింది.

 

 

మొబైల్ వార్....

మొబైల్ వార్....

ఇదే గనుక విజయవంతమైతే మైక్రోసాప్ట్ ఫోన్‌లో ప్రస్తుతం గూగుల్ సెర్చ్ ఇంజన్ స్ధానంలో త్వరలో బింగ్ సెర్చ్ ఇంజన్ రానుంది. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజిన్ గట్టి పోటీ ఇస్తుంది. ఇలా భారత సంతతికి చెందిన ఇద్దరూ సీఈఓలు భారతదేశ ప్రతిభను, ఖ్యాతిని ప్రపంచమంతా చాటుతున్నారు.

 సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈఓ

సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈఓ

2014 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు చెందిన సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన మైక్రోసాఫ్ట్‌లో 22ఏళ్లు పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. సీఈఓగా కంటే ముందు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

సుందర్ పచాయ్

సుందర్ పచాయ్

గూగుల్‌ సంస్థ అనుసంధానంతో కొత్తగా ప్రారంభిస్తున్న గూగుల్‌ ఆల్ఫాబెట్‌ విభాగానికి భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ను సీఈఓగా ప్రకటించారు. చెన్నైకి చెందిన సుందర్‌ పిచాయ్‌ 2004వ సంవత్సరంలో గూగుల్‌ సంస్థలో చేరిన సుందర్‌ ప్రస్తుతం సీఈఓ స్థాయికి ఎదిగారు.

ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి

ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి.

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
here write mobil war start microsoft between google

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X