ఫేస్‌బుక్‌కు ఓ దండం: మనోళ్లకు భోదించాలనుకోవడం పెద్ద తప్పు

Written By:

మార్కండేయ కట్జూ.. ఈ పేరు తెలియనివారు బహుశా ఎవరూ ఉండరు. ఎందుకంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కదా.ఇక ఎవరేమనుకున్నా సరే చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేయడం అన్నది మార్కండేయ కట్జూకు అలవాటు. పర్యవసానంగా ఎన్ని విమర్శలు వచ్చినా వెరవని తనం కట్జూను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టింది. అలాంటి కట్జూకు కోపం వచ్చింది. ఫేస్‌బుక్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ఇకపై ఫేస్‌బుక్ వాడనని రిపబ్లిక్ డే రోజున ఆయన సంచలన నిర్ణయం ప్రకటించారు. పోతూ పోతూ సంచలన వ్యాఖ్యలు చేసి వెళ్లారు.

Read more : పట్టా ఉన్నా టెక్ ఉద్యోగాలకు పనికిరారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రచ్చకెక్కినా..! పేచీ పెట్టుకున్నా..! అంతా సోషల్ మీడియాలోనే

రచ్చకెక్కినా..! పేచీ పెట్టుకున్నా..! అంతా సోషల్ మీడియాలోనే. అభిప్రాయాలను పంచుకోవడం, వాదించుకోవడం.. అన్నీ అక్కడే. సమస్త జ్ఞాన బోధకు.. అదే సమయంలో కొంత చెత్తకు ఇప్పుడో సోషల్ మీడియా ఒక వేదిక.

భావ ప్రకటన కోసం ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాలను

అందుకే భావ ప్రకటన కోసం ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాలను అనుసరిస్తున్నారు చాలామంది. ఇందులో చేదు అనుభవాలు ఉంటాయి.. అదే సమయంలో ఆదరణ కూడా ఉంటుంది. రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్తేనే అక్కడ మనం ఫోకస్ అవుతాం. లేదంటే ఎకౌంట్ మూసేసుకోవాల్సిందే.

సుప్రీం మాజీ న్యాయ మూర్తి మార్కండేయ కట్జూ ఫేస్ బుక్ కు గుడ్ బై

ఇదే నేపథ్యంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్న సుప్రీం మాజీ న్యాయ మూర్తి మార్కండేయ కట్జూ ఫేస్ బుక్ కు గుడ్ బై చెప్పేశారు. తన అభిప్రాయాలను అర్థంచేసుకోవడంలో బారతీయుల వైఖరి వేరు ఉందన్న ఆయన.. భారతీయులకు బోధించాలనుకోవడం ఎంత తప్పో అర్థమైందన్నారు.

తనకు తెలిసిన మంచి విషయాలు బోధించాలని

తనకు తెలిసిన మంచి విషయాలు బోధించాలని భావించానని, అయితే దానికి లభించిన బహుమానం విమర్శలు, దూషణలని ఆయన పేర్కొన్నారు. భారతీయులకు బోధించాలని భావించడం తన బుద్ధి తక్కువతనమని ఆయన అంగీకరించారు. అందుకే ఫేస్‌బుక్‌కు వీడ్కోలు పలుకుతున్నానని ఆయన తెలిపారు.

ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా.

ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా.. తిట్లు-విమర్శలే మూట గట్టుకోవాల్సి వచ్చిందని అందుకే ఫేస్‌బుక్‌ను వీడుతున్నాని ప్రకటించారు.తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించిన కట్జూ.. రిపబ్లిక్ డే అయిన మంగళవారం రాత్రి ఫేస్‌బుక్‌కి ఇక సెలవంటూ.. పోస్టు చేశారు.

తన సమూల తెలివి తేటలను అందరికి పంచాలనుకోవడం

తన సమూల తెలివి తేటలను అందరికి పంచాలనుకోవడం తప్పయిందని అభివర్ణించిన ఆయన.. ఇక మీదట మళ్ళీ ఫేస్‌బుక్ జోలికి రాను అన్న తరహాలో స్పందించారు. మొత్తానికి మార్కండేయ కట్జూకి ఫేస్ బుక్ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిందన్నమాట.

కట్జూ గతంలో నేతాజీని జపాన్ ఏజెంట్ అని

కాగా..! కట్జూ గతంలో నేతాజీని జపాన్ ఏజెంట్ అని.. గాంధీజీని బ్రిటీష్ మార్గదర్శకాలు అనుసరించేవాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Markandey Katju says 'goodbye' to Facebook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot