ఈ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి..

Written By:

ఇప్పుడు టెలికాం, ఐడీ ఇండస్ట్రీ చాలా ఘోరమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఐటీ రంగానికి ట్రంప్ దెబ్బ భారీగా తగులుతోంది. ఇక టెలికం కంపెనీలు జియో దెబ్బతో విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు కోతలు విధంచనున్నాయి. ఈ ఏడాది భారీగా ఉద్యోగాల కోత ప్రకటించిన లేదా ప్రకటించబోతున్న దిగ్గజ 10 కంపెనీల జాబితాను రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

మళ్లీ 3 నెలల ఉచితంతో దూసుకొస్తున్న జియో !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాగ్నిజెంట్

ఓ వైపు ట్రంప్ ఎఫెక్ట్, మరోవైపు ఆటోమేషన్ ప్రభావం ఈ మల్టినేషనల్ ఐటీ దిగ్గజం దాదాపు 6000 మందికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో కాగ్నిజెంట్ తన ఉద్యోగులను తగ్గించుకుంటుంది. అంతేకాక ఇటీవల సీనియర్ ఉద్యోగులను సాదరంగా ఇంటికి సాగనంపే క్రమంలో 9నెలల జీతాలిస్తుందని కూడా రిపోర్టులు వస్తున్నాయి. డి ప్లస్ కేటగిరి ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టాలని కోరుతూ ఈ-మెయిల్స్ కూడా పంపిందట.

కాప్జెమిని :

ఫ్రెంచ్ కు చెందిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాప్జెమిని కూడా సుమారు 9000 మందిని ఇంటికి పంపించనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరిలోనే 35 మంది వీపీ, ఎస్వీపీ, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లను కంపెనీ వీడాలని కాప్జెమిని ఆదేశించింది. అంతేకాక తన ఆఫీసుల్లో ఒకటైన ముంబైలో 200 మందికి ఉద్వాసన పలకాలని కూడా నిర్ణయించింది.

ఇన్ఫోసిస్ :

వచ్చే కొన్ని రోజుల్లో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల కోత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వర్గాల ప్రకారం ఈ కంపెనీ 1000 మందిని తీసేస్తుందని తెలుస్తోంది. దీనిలో గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్ ఆర్కిటెక్ట్స్, హైయర్ లెవల్స్ వారు ఉండొచ్చని సంబంధిత వర్గాల సమాచారం. ఈ కంపెనీ ఇటీవలే భారతీయ టెక్కీలకు షాకిస్తూ అమెరికన్లకు 10000 ఉద్యోగాలను ప్రకటించింది.

విప్రో:

దేశంలో మూడో అతిపెద్ద టెక్ దిగ్గజం విప్రో కంపెనీ. పనితీరు బాగోలేదనే పేరుతో ఇప్పటికే ఈ కంపెనీ 600 నుంచి రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసినట్టు తెలిసింది. అంతేకాక కంపెనీలో అదనపు లేయర్లను తీసేయనుందట.

టాటా టెలిసర్వీసెస్ :

టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ 500 నుంచి 600 మంది ఉద్యోగులను తీసేసింది. ఈ ఉద్యోగులందరూ సేల్స్, ఇతర సంబంధిత ఫంక్షన్స్ కు చెందిన వారని కంపెనీ తెలిపింది. వీరికి సెవరెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ ఆఫర్ చేసింది. ప్రతేడాది సర్వీసుకు ఒక జీతం చొప్పున కంపెనీ ఈ ఉద్యోగులకు ఇచ్చింది.

ఎయిర్ సెల్ :

ఈ ఏడాది ఫిబ్రవరిలో సెల్యులార్ సర్వీసెస్ మేజర్ ఎయిర్ సెల్ తన ఉద్యోగుల్లో 700 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. అంటే తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. దేశీయ టెలికమ్యునికేషన్ రంగంలో ఇదే తొలి ఉద్యోగాల కోత. దేశవ్యాప్తంగా ఎయిర్ సెల్ లో దాదాపు 8000 మంది ఉద్యోగులున్నారు.

స్నాప్ డీల్:

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న స్నాప్ డీల్ కూడా మార్కెట్లో అతలాకుతలమవుతోంది. ఈ ప్రభావం ఉద్యోగులపై భారీగా పడుతోంది. మొత్తం వర్క్ ఫోర్స్ లో 30 శాతం మందిని మాత్రం కంపెనీ బయటికి పంపేయనుందని తెలుస్తోంది. అంటే కంపెనీలో ప్రత్యక్షంగా పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుందని సమాచారం. అంతేకాక 1000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై కూడా ప్రభావం పడనుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mass layoffs in IT and telecom spook job market in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot