మీ స్మార్ట్‌ఫోన్లకు అటాకర్ల నుంచి ముప్పు

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కాని స్మార్ట్‌ఫోన్ కాని వాడుతున్నారా.. ఆ ఫోన్‌లో మీరు చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఏదైనా వాడుతున్నారా..అయితే ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చైనాకు చెందిన మీడియా టెక్ ప్రాసెసర్ వాడుతున్న వారికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్ లోని సమాచారం మొత్తం దొంగిలించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

Read more: వామ్మో.. ఒక్కరోజులో 40 కోట్ల ఆదాయమా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన మీడియాటెక్ కంపెనీ ప్రాసెసర్

చైనాకు చెందిన మీడియాటెక్ కంపెనీ ప్రాసెసర్

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ వాడుతున్నారా? అందులో చైనాకు చెందిన మీడియాటెక్ కంపెనీ ప్రాసెసర్ ఉందా? వీటితోపాటు మీ డివైస్‌లో ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్ ఉందా? అయితే జాగ్రత్త.

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌ కలిగిన డివైస్‌లకు

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌ కలిగిన డివైస్‌లకు

ఎందుకంటే 'మీడియాటెక్ ప్రాసెసర్‌'తోబాటు ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌ కలిగిన డివైస్‌లకు అటాకర్ల నుంచి ముప్పు పొంచి ఉందని పలు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇదే విషయాన్ని సాక్షాత్తూ 'మీడియాటెక్' కూడా ధృవీకరించింది.

అటాకర్‌కు సులువుగా దాడి చేసే సౌకర్యాన్ని

అటాకర్‌కు సులువుగా దాడి చేసే సౌకర్యాన్ని

మీడియాటెక్ ప్రాసెసర్ కలిగిన ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ డివైస్‌లలో వచ్చిన ఈ లోపం (సాఫ్ట్‌వేర్ బగ్) సదరు డివైస్‌ను రూట్ చేయడం (అడ్మిన్ హక్కులు పొందడం) ద్వారా అటాకర్‌కు సులువుగా దాడి చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంది.

రూటింగ్ వల్ల అటాకర్ డివైస్‌లోని డేటాను

రూటింగ్ వల్ల అటాకర్ డివైస్‌లోని డేటాను

రూటింగ్ వల్ల అటాకర్ డివైస్‌లోని డేటాను, ఇతర సమాచారాన్ని తస్కరించడంతోపాటు ఫోన్‌ను బ్రిక్ (పనిచేయకుండా చేయడం) చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.

తాజాగా తెరపైకి వచ్చిన ఈ లోపాన్ని

తాజాగా తెరపైకి వచ్చిన ఈ లోపాన్ని

తాజాగా తెరపైకి వచ్చిన ఈ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే విషయంపై మీడియాటెక్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.

మొబైల్ తయారీ సంస్థలు మొదట్లోనే ఈ లోపాన్ని

మొబైల్ తయారీ సంస్థలు మొదట్లోనే ఈ లోపాన్ని

అయితే మొబైల్ తయారీ సంస్థలు మొదట్లోనే ఈ లోపాన్ని గుర్తించి సవరిస్తే దాన్ని వాడే యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మాత్రం ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write MediaTek confirms bug that affects Android devices running its chipsets
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot